Advertisement
తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్లో 5,204 నర్సింగ్ పోస్టులకు నోటిఫికేషన్ ను విడుదల చేయగా మొత్తం 40,936 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షను మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (MHSRB), ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ద్వారా నిర్వహిస్తుంది. MHSRB విడుదల చేసిన నోటిఫికేషన్ లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్/ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ కింద 3,823 పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP)లో 757, MNJ క్యాన్సర్ హాస్పిటల్లో 81, వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ విభాగంలో 8 పోస్టులు ఉన్నాయి. , తెలంగాణ మైనారిటీల రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్ సొసైటీలో 127, మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీలో 197, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీలో 74 మరియు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషనల్ సొసైటీలో 13 పోస్టులున్నాయి.
Advertisements