Advertisement
రాత్రి 2.30 అప్పుడు ఫోన్ రింగవుతుంది… మామూలుగా అయితే ఆ టైంలో తనెప్పుడూ కాల్ చేయదు.. ఈ టైంలో ఎందుకు చేస్తుంది అని ఆలోచన కూడా లేకుండా కాల్ కట్ చేసా..మళ్లీ కాల్ వచ్చింది.. మళ్లీ మళ్లీ టూ త్రి టైంస్ కట్ చేసా.. ఆఫీస్ వర్క్ టెన్షన్ తో బాగా అలసిపోయి ఉన్నా, ఇంత నైట్ కాల్స్ వస్తుంటే అటెండ్ చేయాలనే ఆలోచన కూడా లేకుండా నిద్ర ముంచుకొస్తుంది..మళ్లీ కాల్ వచ్చే సరికి అప్పుడు స్పృహ వచ్చింది.. ఒక్కసారిగా భయం వేసింది..ఈ టైంలో ఎందుకు కాల్ చేస్తుందా అని లిఫ్ట్ చేసా..
ఒక్కసారి ఇక్కడికి వస్తావా?? ఇప్పుడే ఈ క్షణమే అంటూ అవతల నుండి తన వాయిస్.. వెంటనే మళ్లీ తనే వద్దులే నువ్వు మళ్లీ ఉదయాన్నే ఆఫీస్ కి వెళ్లాలి కదా అని.. ఏమైంది ఎందుకు రమ్మంటున్నావ్ అని అడిగా.. my dad is gone(చనిపోయారు..)..అని చెప్తుంటే తన ఏడుపు గొంతు నాకు స్పష్టంగా వినిపించింది..నువ్వు ఏడవకు నేను వెంటనే వస్తున్నాను అని చెప్పి బైక్ స్టార్ట్ చేసాను..
Advertisement
తన ఢిల్లిలో పేయింగ్ గెస్ట్ గా ఉంటూ జాబ్ చేస్తుంది.. ఫ్యామిలి ఉత్తరప్రదేశ్ లో ఉంటారు.. తన దగ్గరకి బయలుదేరగానే ఇప్పుడు తనను అంతదూరం పంపాలా?? ఈ కరోనా టైంలో అదెంత రిస్క్ అని ఆలోచిస్తూనే తనని చేరాను..నేను వెళ్లేసరికి తను స్టెప్స్ పై ఒక్కర్తే కూర్చుని ఉంది..నన్ను చూడగానే పరిగెత్తుకొచ్చి హగ్ చేసుకుని వెక్కివెక్కి ఏడుస్తూనే ఉంది..ఊరుకోబెట్టడానికి చాలా ప్రయత్నించా..కానీ తను ఊరుకునే పరిస్థితిలో లేదు..
సుమారు గంటన్నర పాటు మేం ఇద్దరం అదే స్టెప్స్ పై కూర్చుని ఉన్నాం..తను ఏడుస్తూ మాట్లాడుతూనే ఉంది.. ఇంటికి వెళ్లాలని పట్టుబడ్తుంది..వద్దని చెప్పలేను..పంపే ధైర్యం చేయలేను..చివరికి పంపడమే కరెక్ట్ అనిపించింది..తన బ్యాగ్ సర్దుకుని బయటకు వచ్చింది..తనని వాళ్ల ఫ్యామిలి ఫ్రెండ్ ఇంటి దగ్గర డ్రాప్ చేసా..అక్కడ నుండి వాళ్లతో కలిసి తన ఊరికి వెళ్తుంది.. ఇంటికి వెళ్లగానే కాల్ చేసింది ఇంటికి వెళ్లగానే కాల్ చేసింది నాన్న ,చనిపోయింది కరోనాతో కాదు , హార్ట్ ఎటాక్ తో అని చెప్తూ మళ్లీ ఏడుస్తుంది..
Advertisements
Advertisements
ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే అమ్మాయిని ఫస్ట్ టైం అలా చూసేసరికి నాక్కూడా ఏడుపు ఆగలేదు.ఇంటికి పెద్ద కూతురు తనే..జాబ్ చేస్తూ వాళ్ల ఫాదర్ కి తోడుగా ఉంది.. లా(LLB) చదవాలన్నది తన కోరిక.. ఈ సెప్టెంబర్ లో జాబ్ వదిలేసి కాలేజి జాయిన్ అవ్వాల్సి ఉండే… కానీ, ఇఫ్పుడు తన తండ్రి మరణంతో తన కుటుంబ బాధ్యత తనపైనే పడింది…జస్ట్ ఒకే ఒక రాత్రి తన జీవితాన్ని మొత్తం మార్చేసింది..ప్చ్..