Advertisement
1.యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద చంద్రబాబు కాన్వాయ్ కు తృటిలో తప్పిన ప్రమాదం.ఆవును తప్పించబోయి డ్రైవర్ వేసిన సడెన్ బ్రేక్ కారణంగా ముందున్న ఎస్కార్ట్ వాహనాన్ని బలంగా ఢీ కొన్న చంద్రబాబు వాహనం.
2.కొ విడ్ వ్యాప్తి దృష్ట్యా ఈ నెల 30వరకు తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను నిలిపివేసిన టీటీడీ.
3.అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవ రథం దగ్ధం. 60 ఏళ్ల క్రితం టేకు కలపతో తయారు చేసిన ఈ రథం మంటలు అంటుకోవడం పై విచారణ చేస్తున్న పోలీసులు.
4.పేద ప్రజలకు వాగ్దానం చేసిన ఇళ్లను అప్పగించడంలో ప్రభుత్వం విఫలమైంది.మరి అలాంటి ప్రభుత్వం మునిసిపల్ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కును కోల్పోయారన్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపి రేవంత్ రెడ్డి.
Advertisements
5.కొత్తగా నిర్మించే సెక్రటేరియట్ లో మందిరం, మసీదులు, చర్చిని పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని ప్రకటించిన కేసీఆర్.
Advertisement
6.బంగ్లాదేశ్‌లోని నారాయణ్‌గంజ్ ప్రాంతంలోని ఓ మసీదులో శుక్రవారం గ్యాస్ లీక్ అవ్వడంతో ఆరు ఎయిర్ కండీషనర్లు పేలి 17 మంది మృతి చెందారు. 20 మందికి గాయాలయ్యాయి.
7.స్వరం మార్చిన చైనా . ఒక్క అంగుళం భూభాగాన్నీ వదులుకోబోమని ప్రకటించిన చైనా రక్షణ మంత్రి వెయ్ ఫెంఘె..
8.ఆస్ట్రాయిడ్ 2010 ఎఫ్‌ఆర్ భూమిని ఢీకొట్టే అవకాశమే లేదని.సెప్టెంబరు 6న భూమికి దాదాపు 4.6మిలియన్ మైళ్ల దూరం నుంచి ఇది వెళ్లిపోతుంది అని నాసా ట్వీట్ చేసింది.
9.ఐపీఎల్‌లో ఆడడానికి ముస్తాఫిజుర్‌కు ఆఫర్ వచ్చింది కానీ మేం అతడికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్‌ఓసీ) ఇవ్వకుండా నిరాకరించాం ఎందుకంటే అక్టోబర్‌లో మాకు శ్రీలంక సిరీస్ ఉందని స్పష్టత ఇచ్చిన అక్రమ్‌ఖాన్.
Advertisements
10.ఐసీసీలో తమదైన రాజకీయాలు చేస్తున్న ‘బిగ్ త్రీ’ (భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు)లో ఎవరికీ ఐసీసీ చైర్మన్ పదవిని ఇవ్వవద్దని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ ఎహ్‌సాన్ మణి సంచలన వ్యాఖ్యాలు చేశారు.