Advertisement
1.నేటి నుంచి మొదలుకానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.పీవీకి భారతరత్న,రెవెన్యూ చట్టం,కరోనా వైరస్ వ్యాప్తి, రాయలసీమ ఎత్తిపోతల పథకం, నియంత్రిత పద్ధతిలో సాగు, రిజిస్ట్రేషన్లు వంటి కీలక అంశాలపై చర్చ.
2.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్ట్ సమీపంలో బాంబ్ పేల్చిన మావోలు.ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ కు ప్రతిగా ల్యాండ్ మైన్ పేల్చారని అంటున్న పోలీసులు
3.169 రోజుల సుదీర్ఘ గ్యాప్ తరువాత పట్టాలెక్కిన హైదరాబాద్ మెట్రో రైలు.కారిడార్-1 మియాపూర్-ఎల్‌బీనగర్ మార్గంలో మాత్రమే పరుగులు తీయనున్న మెట్రో.ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు రైళ్ళు
Advertisement
4.అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధమైన ఘటనపై స్పందించిన డీజీపీ గౌతమ్ సవాంగ్.పూర్తిస్థాయి సాక్ష్యాధారాలను సేకరించే పనిలో అధికారులు ఉన్నట్లు పేర్కొన్నారు.
Advertisements
5.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జాబితాలో ఆంధ్రప్రదేశ్ కు ప్రథమ స్థానం దక్కడం అభినందనీయమని పేర్కొన్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
6.ముంబైను అవమానిస్తూ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలకు ముందుగా క్షమాపణ చెబితే, తాను క్షమాపణ చెప్పే విషయం ఆలోచిస్తానని అంటున్న శివసేన ఎంపీ సంజయ్ రావత్.
7.కేరళలోని ప్రఖ్యాత ఎదనీరు మఠాధిపతిగా కేశవానంద భారతి శ్రీపాద గల్వరు ఇకలేరు.కేశవానంద భారతి మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేసిన ప్రధాని మంత్రి,ఉప రాష్ట్రపతి
8.దావూద్ ఇబ్రహీం ఇంటి ల్యాండ్‌ఫోన్ నుంచి మహారాష్ట్ర సీఎంకు బెదిరింపు కాల్స్.ఉద్ధవ్ ఠాక్రే నివాసం వద్ద కట్టుదిట్టం చేసిన భద్రతా ఏర్పాట్లు.
9.ఘనంగా మొదలైన బిగ్ బాస్4. గంగవ్వ ఫ్యాన్స్ ఆర్మీ సోషల్ మీడియాలో హల్ చల్.
Advertisements
10.ఐపీఎల్ షెడ్యూల్ విడుదల. ప్లే ఆఫ్స్ షెడ్యూల్ కోసం మరి కొంతకాలం ఆగాల్సిందే అంటున్న నిపుణులు.