Advertisement
పాట్నాకు చెందిన సంప్రీతికి గుగూల్ 1.10 కోట్ల ఆఫర్ ఇచ్చింది. లండన్ లో జాబ్ చేయాలని ఆఫర్ లెటర్ చేతికిచ్చింది. 9 రౌండ్ల ఇంటర్వ్యూ తర్వాత సంప్రీతికి ఈ ఆఫర్ ను ప్రకటించింది గుగూల్ . ఫిబ్రవరి 14న జాబ్ లో జాయిన్ అవ్వాలని తెల్పింది.
బీహార్ లోని పాట్నాకు చెందిన సంప్రీతి తల్లిదండ్రులిద్దరూ మంచి మంచి పొజీషన్ లో ఉన్నారు. సంప్రీతి కూడా చిన్నప్పటి నుండి చదువులో ముందుండేది. అందుకే టెన్త్ లో 10 జిపిఏ సాధించింది. 12వ తరగతి పూర్తవ్వగానే JEE మెయిన్స్ లో మంచి ర్యాంక్ సాధించి ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ నుండి బిటెక్ కంప్యూటర్ సైన్స్ ను కంప్లీట్ చేసింది.
Advertisement
Advertisements
ఫైనల్ ఇయర్ లో ఉండగానే 4 పెద్ద పెద్ద సంస్థల నుండి సంప్రీతికి ఆఫర్స్ వచ్చాయి. 44 లక్షల ప్యాకేజ్ కు మైక్రోసాఫ్ట్ లో జాయిన్ అయ్యింది. అలా జాబ్ చేస్తూనే గుగూల్ ఆఫర్ చేసిన ఇంటర్వ్యూలకు హాజరై… 9 రౌండ్లను క్లియర్ చేసి 1.10 కోట్ల ప్యాకేజ్ తో జాక్ పాట్ కొట్టేసింది.
Advertisements