Advertisement
ప్రపంచంలోని చాలా దేశాల్లో క్రికెట్ ఆటకి చాలా ప్రాధాన్యత ఉంది . చాలామంది ప్రజలు క్రికెటర్లు ఆడి గెలిచే గెలుపుని వారి గెలుపుగా భావిస్తారు. కొన్ని దేశాల్లో క్రికెటర్స్ ఆడే ఆటని వారి దేశ పరువుతో పోల్చుకుంటారు . ఐతే ఇలా వారు సొంత దేశం కోసం కాకుండా వేరే దేశం గెలుపుకోసం వేరే టీమ్ లో ఆడుతున్న ఆటగాళ్లు కూడా ఉన్నారు .
వేరే దేశం కోసం ఆడుతున్న క్రికెటర్లు
1. క్రిష్ జోర్డాన్
ఇంగ్లాండ్ కు చెందిన ఈ ఫాస్ట్ బౌలర్ 1988 వ సంవత్సరం అక్టోబర్ 4న కరేబియన్ దీవుల్లోని బార్బడస్ అనే దేశంలో జన్మించాడు . కానీ వారి తాతలు ఇంగ్లాండ్ సిటిజన్స్ కావడంతో బార్బడస్ లో తన చదువు పూర్తయ్యాక ఇంగ్లాండ్ లో స్థిరపడ్డాడు . దీంతో జోర్డాన్ వెస్టిండీస్ తరుపున కాకుండా ఇంగ్లాండ్ తరుపున క్రికెట్ అడుతున్నాడు.
Advertisements
2. సికిందర్ రజా
జింబాబ్వే కు చెందిన ఈ స్టార్ అల్ రౌండర్ 1986 వ సంవత్సరంలో పాకిస్థాన్ లోని సియాల్ కోట్ లో జన్మించాడు . 2001వ సంవత్సరం వరకు పాకిస్థాన్ లోనే నివసించాడు . కానీ ఆ తర్వాత తన కుటుంబంతో కలిసి జింబాబ్వే కి మారిపోయాడు . ఇక దేశవాలి క్రికెట్లో బాగా రాణించి , జింబాబ్వే నేషనల్ టీమ్ లో చోటు సంపాదించాడు .
3. ఉస్మాన్ ఖవాజ
ఆస్ట్రేలియాకు చెందిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మ్యాన్ 1986 వ సంవత్సరంలో పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ లో జన్మించాడు . కానీ అతనికి ఐదేళ్లు ఉన్నప్పుడే అతని పేరెంట్స్ పాకిస్థాన్ నుండి ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్వెల్స్ అనే ప్రాంతానికి మారిపోయారు . దీంతో ఖవాజ ఆస్ట్రేలియా తరఫున క్రికెట్ ఆడుతున్నాడు
4. జేషన్ రాయ్
ఇంగ్లాండ్ కు చెందిన డ్యాషింగ్ బ్యాట్స్ మ్యాన్ 1990 వ సంవత్సరం జులై 21వ తేదీన సౌత్ ఆఫ్రికా లోని డర్బన్ లో జన్మించాడు . కానీ తనకి పదేళ్ల వయస్సులో అతని కుటుంబం ఇంగ్లాండు కు మారిపోయింది . ఇక అప్పటినుంచి ఇంగ్లాండ్ డొమెస్టిక్ క్రికెట్ లో రాణిస్తూ . నేషనల్ టీమ్ లో చోటు సంపాదించాడు .
5. ఆండ్రు సైమాండ్స్
ఆస్ట్రేలియాకు చెందిన ఈ డేంజరస్ అల్ రౌండర్ 1975వ సంవత్సరంలో ఇంగ్లాండ్ లోని బర్మింగ్ హమ్ లో జన్మించాడు. కొన్ని రోజులు ఇంగ్లాడ్ తరఫున అండర్ 14కు ఆడాడు. తనకి 14 సంవత్సరాలు ఉన్నప్పుడు తన కుటుంబం ఆస్ట్రేలియా కి మారింది . ఆ తర్వాత తనకి ఇంగ్లాండ్ తరుపున ఆడే అవకాశం వచ్చినా ఆస్ట్రేలియా తరుపునే తన ప్రయాణాన్ని కొనసాగించాడు.
Advertisement
6. ఇమ్రాన్ తాహిర్
సౌత్ ఆఫ్రికాకు చెందిన ఈ లెజండరీ లెగ్ స్పిన్నర్ 1979 వ సంవత్సరంలో పాకిస్థాన్ లోని లాహోర్ లో జన్మించాడు . అలాగే తాహిర్ పాకిస్థాన్ అండర్ 19 మరియు A జట్టుల తరుపున కూడా ఆడాడు . కాకపోతే అక్కడ తనకి సరైన గౌరవం దక్కకపోవడంతో ఇంగ్లాండ్ లో కౌంటీలు ఆడడం మొదలుపెట్టాడు . తర్వాత మళ్ళీ సౌత్ ఆఫ్రికాకు మారిపోయి అక్కడి డొమెస్టిక్ క్రికెట్ లో ఆడుతూ నేషనల్ టీమ్ లో చోటు సంపాదించాడు .
7. బెన్ స్టోక్స్
ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో బెస్ట్ అల్ రౌండర్ గా పేరు సంపాదించిన , బెన్ స్టోక్స్ ఆడేది ఇంగ్లాండ్ తరుపునే అయినా తను మాత్రం 1991 వ సంవత్సరంలో న్యూజిలాండ్ లోని క్రైస్ చర్చ్ అనే నగరంలో జన్మించాడు . కానీ తనకి 12 ఏళ్ల వయసునప్పుడు తన పేరెంట్స్ తో కలిసి ఇంగ్లాండ్ కు మారిపోయాడు .
8. జోఫ్రా ఆర్చర్ :
ఇంగ్లాండ్ కు చెందిన ఈ సూపర్ ఫాస్ట్ బౌలర్ 1995 వ సంవత్సరంలో బార్బడస్ లోని బ్రిడ్జ్ టౌన్ లో జన్మించాడు . అలాగే ఆర్చర్ తన డిమెస్టిక్ క్రికెట్ తో పాటు వెస్టిండీస్ అండర్ 19 తరుపున కూడా ఆడాడు . కానీ 2015 సంవత్సరం నుండి తన తండ్రి సహాయంతో ఇంగ్లాండ్ లో నివసించడంతో అలా అప్పటినుంచి కౌంటీ లో ఆడుతూ….ఇంగ్లాండ్ టీమ్ కు సెలెక్ట్ అయ్యాడు.
9. ఇయాన్ మోర్గాన్:
ఇంగ్లాండ్ టీం కెప్టెన్ అయిన మోర్గాన్ 1986 వ సంవత్సరంలో ఐర్లాండ్ లోని డబ్లిన్ అనే నగరంలో జన్మించాడు. మోర్గాన్ దేశవాలీ క్రికెట్ తో పాటు , 23 అంతర్జాతీయ వన్ డే మ్యాచ్ లు ఐర్లాండ్ తరుపునే ఆడాడు. తర్వాత ఇంగ్లాండ్ కు వచ్చి….ఇంగ్లాండ్ టీమ్ కు సెలెక్ట్ అయ్యాడు.
10. కెవి పిటర్సున్ :
10. కెవి పిటర్సున్ :
ఇంగ్లాండ్ కు చెందిన కెవి….. 1980 వ సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా లోని పీటర్ మారిజ్ బర్గ్ అనే నగరంలో జన్మించారు . అలాగే తన డొమెస్టిక్ క్రికెట్ మొత్తం సౌత్ ఆఫ్రికా లోనే ఆడాడు కానీ కొద్ది రోజుల తర్వాత సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డ్ మరియు తన తోటి ఆటగాళ్లతో విబేధాలు రావడంతో ….. సౌత్ ఆఫ్రికాని విడిచిపెట్టి ఇంగ్లాండ్ కు మారిపోయాడు. ఇక ఆ తర్వాత ఇంగ్లాండ్ నేషనల్ టీంలో చోటు సంపాదించి . ఆ దేశం తరుపున ఆడాడు.
Advertisements