Advertisement
హీరో కావాలంటే ….ఇండస్ట్రీలో గాడ్ ఫాథర్ ఉంటే ఓకే, స్ట్రాంక్ బ్యాక్ గ్రౌండ్ ఉంటే లైన్ క్లియర్ అనే మాటలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. కానీ ఇవన్నీ ఓ పరిధిమేరకే పనిచేస్తాయి..దీనికి ఉదాహరణ ఈ 10 మంది హీరోలు…..బ్యాక్ గ్రౌండ్ బలంగా ఉన్నా ఇప్పటికీ స్టార్ హీరోలుగా గుర్తింపు పొందలేదు.
1. రమేష్ బాబు:
సూపర్ స్టార్ కృష్ణ నెంబర్ వన్ గా వెలుగొందుతున్న కాలంలో….. సామ్రాట్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రమేష్ బాబు మొదట్లో మూడు నాలుగు హిట్స్ తో జోరుమీద కనిపించాడు . రమేష్ బాబు మాస్ సినిమాలు మాత్రమే చేయడం తనకి మైనస్ అయింది . అప్పటికే చిరంజీవి , బాలక్రిష్ణ వంటి మాస్ హీరోలు ప్రేక్షకులకు దగ్గరైపోయారు. తండ్రి ఫ్యాన్ బేస్ గట్టిగానే ఉన్నప్పటికి సినిమా కథను సెలెక్ట్ చేసుకోవడంలోని లోపాల వల్ల హీరోగా నిలబడలేకపోయాడు.
2.నాగబాబు:
Advertisements
నాగబాబు హీరోగా ఎదగాలని ఎంత ట్రై చేసినా వీలుపడలేదు . తన బలం చిరంజీవి, బలహీనత కూడా చిరంజీవే! ఎందుకంటే చిరంజీవి తమ్ముడి సినిమాలు కూడా చిరంజీవి రేంజ్ లో ఉండాలని ఆడియన్స్ ఫిక్స్ అయ్యిపోవడంతో నాగబాబు హీరోగా నిలబడలేకపోయారు. దాంతో కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిమితమవ్వాల్సి వచ్చింది.
3. దాసరి అరుణ్ కుమార్:
ఎంతోమంది నటులను స్టార్స్ గా నిలబెట్టిన డైరెక్టర్ దాసరి నారాయణ రావు తన కొడుకును మాత్రం హీరోగా నిలబెట్టలేకపోయారు . అట్టహాసంగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన దాసరి అరుణ్ కుమార్ అంతే త్వరగా ఫేడ్ ఔట్ అయిపోయాడు .
4.సుమంత్:
అక్కినేని నాగార్జున మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుమంత్….తన హైట్ , లుక్స్ , యాక్టింగ్ , స్కిల్స్ తో తొలి సినిమా నుండే స్టార్ హీరో అవుతానిపించాడు . కానీ కెరీర్ మొదట్లోనే మంచి మంచి సినిమాలు వదిలేసుకోవడం వల్ల స్టార్ డమ్ రాకుండా పోయింది. అక్కినేని ఫ్యాన్ బేస్ సపోర్ట్ ఉన్నా అతడు మాత్రం స్టార్ హీరో కాలేకపోయాడు!
5. తారకరత్న:
Advertisement
నందమూరి వంశం నుంచి ఒకేసారి 9 సినిమాలతో హీరోగా అడుగుపెట్టిన తారకరత్న , జూనియర్ ఎన్టీఆర్ తో పోటీపడాలనే తాపత్రయంతో వరుసగా ఏ సినిమాలు పడితే ఆ సినిమాలు చేసేసాడు . వాటిల్లో ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు . నందమూరి ఫ్యాన్స్ ఎన్టీఆర్ ను కళ్యాణ్ రామ్ ను ఓన్ చేసుకున్నంతగా తారకరత్నను ఓన్ చేసుకోలేకపోయారు. దానికి తోడు ఆయన ఎంచుకున్న సినిమాలు కూడా అలాగే ఉన్నాయి
6. కె ప్రకాష్:
2002 లో నీతో అనే సినిమాతో రాఘవేంద్రరావు అబ్బాయి ప్రకాష్ హీరోగా పరిచయమయ్యాడు! కానీ అతనిలో హీరో మెటీరియల్ లేదని ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత హీరోగా మానేసి డైరెక్షన్ పై దృష్టి సారించాడు. ఎందర్నో స్టార్ హీరోలుగా మలిచిన రాఘవేంద్రరావు తన కొడునుకు మాత్రం హీరోగా నిలబెట్టలేకపోయారు.
7. అల్లు శిరీష్:
అటు మెగా ఫ్యాన్స్ ఇటు అల్లు ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్ గా ఉందని హీరోగా రంగప్రవేశం చేసాడు అల్లు శిరీష్ . తను చేసిన సినిమాలు కొన్ని బాగునప్పటికి హీరోగా మాత్రం మంచి మార్క్ లు సంపాదించుకోలేకపోయాడు . ఇప్పటికీ హీరోగా ట్రై చేస్తున్నప్పటికీ బ్లాక్ బస్టర్ సినిమా అతని అకౌంట్ లో పడలేదు.
8 నారా రోహిత్:
చంద్రబాబు నాయుడు తమ్ముడి కుమారుడిగా కాస్త క్రేజ్ తో హీరోగా అడుగుపెట్టిన నారా రోహిత్ కు మొదట్లో నందమూరి ఫ్యాన్స్ సపోర్ట్ చేశారు. విభిన్న తరహా కథలు ఎన్నుకొని మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నప్పటికీ పెద్ద హీరోగా ఇంకా రిజిస్ట్రర్ అవ్వలేదు.
9) సాయి రామ్ శంకర్:
పూరీ జగన్నాథ్ తమ్ముడిగా 143 సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయి కూడా హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. పూరీ క్రేజ్ ఎక్కడా తమ్ముడికి కలిసి రాలేదు.
10) సుధీర్ బాబు :
ఈయన హార్డ్ వర్క్ , డెడికేషన్ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. కానీ హీరోగా మాత్రం ఇంకా సక్సెస్ అవ్వలేకపోయాడు. మహేష్ బాబు బావగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు హీరో మెటీరియలే అయినప్పటికీ ఇంత వరకు ఒక్క బ్లాక్ బస్టర్ కూడా కొట్టేలేకపోయాడు.
Advertisements