Advertisement
అజిత్ దోవల్.. ఇండియన్ జేమ్స్ బాండ్ అని ఈయన్ను పిలుచుకుంటారు. పాక్ ఉగ్రవాదులు భారత్‌పై దాడి చేసి ఎంతో మంది జవాన్లను హత్య చేశాక.. భారత్ సర్జికల్ దాడులు చేసి ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసి, ఉగ్రవాదులను మట్టుబెట్టారు. దీంతో అప్పట్లో అజిత్ దోవల్ పేరు బాగా వినిపించింది. అయితే ఈయన కేవలం అందుకే కాదు.. ఇంకా అనేక విషయాల పరంగా గుర్తింపు పొందారు. ఇప్పటి వరకు తన కెరీర్‌లో ఆయన ఎన్నో విజయాలు సాధించారు. వాటిలో 10 ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఇరాక్‌లోని తిక్రిత్‌లో బందీ అయిన 46 మంది భారతీయ నర్సులను తిరిగి భారత్‌కు తీసుకురావడంలో అజిత్ దోవల్ కీలకపాత్ర పోషించారు. జూన్ 2014లో వారు తిక్రిత్‌లోని ఓ హాస్పిటల్‌లో చిక్కుకుపోయారు. ఐఎస్ఐఎస్ మిలిటెంట్ల చేతుల్లో వారు బందీలు అయ్యారు. వారిని రక్షించేందుకు దోవల్ జూన్ 25న ఇరాక్‌కు వెళ్లారు. అక్కడి ప్రభుత్వంతో మాట్లాడారు. దీంతో వారిని అక్కడి ఎర్బిల్ అనే నగరంలో మిలిటెంట్లు విడిచిపెట్టారు. అనంతరం వారిని దోవల్ ఇండియాకు సురక్షితంగా తీసుకువచ్చారు.
2. పాకిస్థాన్‌లోని లాహోర్‌లో దోవల్ 7 ఏళ్ల పాటు అండర్‌కవర్ ఏజెంట్‌గా పనిచేశారు. పాకిస్థానీ ముస్లింగా నటిస్తూ ఆయన ఆ పనిచేశారు. అప్పట్లో ఆయన పాకిస్థాన్‌కు చెందిన చాలా కీలకమైన సమాచారాన్ని ఇండియాకు చేరవేశారు.
Advertisements
3. అజిత్ దోవల్ తన ప్రతిభ, ప్రణాళిక, నైపుణ్యత, చాకచక్యంతో 1971 నుంచి 1999 వరకు మొత్తం 15 భారతీయ విమానాలను హైజాకింగ్‌ల నుంచి రక్షించారు.
4. పంజాబ్‌లోని అమృతసర్‌లో ఉన్న గోల్డెన్ టెంపుల్‌లో 1988లో మిలిటెంట్లు దాడి చేసినప్పుడు దోవల్ టెంపుల్ లోపలే ఉన్నారు. ఆయన ఓ రిక్షా కార్మికుడిగా నటిస్తూ లోపల ఉన్న మిలిటెంట్ల గురించిన కీలక సమాచారం బయటకు చేరవేశారు. దీంతో మిలిటెంట్లు ఓటమిని అంగీకరించి సరెండర్ అయ్యారు.
Advertisement
5. కాందహార్‌లో ఐసీ-814 విమానం హైజాకింగ్‌కు గురైనప్పుడు అందులోని ప్రయాణికులను విడిపించడంలో దోవల్ కీలకపాత్ర పోషించారు. టెర్రరిస్టులతో రాయబారం చేసిన ముగ్గురు కీలక వ్యక్తుల్లో దోవల్ ఒకరు.
6. పాకిస్థాన్‌లో అండర్ కవర్ ఏజెంట్‌గా పనిచేసిన అనంతరం దోవల్ అక్కడే ఇస్లామాబాద్‌లోని భారత హై కమిషన్‌లో కీలక అధికారిగా పనిచేశారు.
7. అజిత్ దోవల్ మే 30, 2014న దేశానికి 5వ జాతీయ భద్రతా సలహాదారుగా నియామకమయ్యారు. ప్రధాని మోదీకి భద్రతా సలహాదారుగా పనిచేస్తున్నారు.
8. దోవల్ రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఉన్న అజ్మీర్ మిలిటరీ స్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. అనంతరం 1967లో ఆగ్రా యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీని అందుకున్నారు. కేరళ క్యాడర్‌కు చెందిన 1968 ఐపీఎస్ బ్యాచ్ పోలీస్ అధికారి ఈయన.
9. సాధారణంగా పోలీసు సర్వీసులో 17 ఏళ్ల పాటు అద్భుతమైన సేవలు చేసిన వారికి పోలీస్ మెడల్ ఇస్తారు. కానీ దోవల్ కేవలం 6 ఏళ్ల పాటు మాత్రమే పోలీస్ సేవలు అందించారు. అయినా ఆయనకు పోలీస్ మెడల్ లభించింది. అంటే.. ఆయన ఏ రేంజ్‌లో సేవలు అందించారో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
10. అజిల్ దోవల్‌కు 1988లో అత్యుత్తమ గ్యాలంట్రీ అవార్డు కీర్తి చక్ర లభించింది. అయితే ఇది మిలటరీ వారికి ఇచ్చే అవార్డు. కానీ దోవల్ పోలీసు అధికారి. అయినప్పటికీ దోవల్ అందించిన సేవలకు ఆయనకు ఈ మిలటరీ పురస్కారాన్ని అందజేశారు. ఇక గ్యాలంట్రీ అవార్డు పొందడంతోపాటు దేశానికి అద్భుతమైన సేవలు అందించినందుకు గాను దోవల్‌కు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ కూడా లభించింది. అందుకే ఆయన ఇండియన్ జేమ్స్‌బాండ్ అయ్యారు. ఆయన ఎంతో మంది మిలటరీ, పోలీసు అధికారులకు ఆయన ప్రేరణగా నిలుస్తున్నారు.
Advertisements