Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

విలన్స్ గా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోస్ అయిన 10 మంది టాలీవుడ్ హీరోలు!!

Advertisement

సినిమా  ఇండస్ట్రీలో  మొదట  విలన్ గా  కెరియర్ మొదలు  పెట్టి.,  తర్వాత  హీరో  అయిన  వాళ్ళు చాలామందే  ఉన్నారు .  కానీ  అందులో  సక్సెస్ అయిన  వాళ్ళు  అతికొద్ది  మంది  మాత్రమే!   అలా సక్సెస్ అయ్యి  స్టార్  ఇమేజ్  పొందిన  10 మంది  హీరోల గురించి  ఇప్పుడు  తెలుసుకుందాం.

villan to heros tollywood

1. కృష్ణంరాజు:

రెబల్ స్టార్  గా  పేరు  పొందిన  కృష్ణంరాజు నేనంటే నేనే ,  భ‌లే మాస్టర్  వంటి సినిమాల్లో  విలన్ గా  గుర్తింపు  పొందాడు .  తర్వాత  హీరోగా  కెరీర్ మొదలుపెట్టి  మొదటి  సినిమాతోనే  సక్సెస్ కొట్టి  హీరోగా  స్థిరపడిపోయాడు.

krishnam raju

Advertisements

2. రజినీకాంత్:

కన్నడ  సినిమాల్లో  చిన్న చిన్న  వేషాలు ,  తర్వాత విలన్  వేషాలు  వేసి  గుర్తింపు  తెచ్చుకున్నాడు రజినీకాంత్ . కథా సంగమం,  బాలు జాన్ వంటి కన్నడ  మూవీస్ తో  విలన్ గా మంచి   పేరు  తెచ్చుకొని …. తమిళ్,  తెలుగులో  కూడా  సైడ్  రోల్స్  చేసి త‌ర్వాత‌ర్వాత  సౌత్  ఇండియా  సూపర్ స్టార్ గా  ఎదిగాడు.

rajani kanth

3. చిరంజీవి:

కుక్కకాటుకు  చెప్పు దెబ్బ ,  మోసగాడు ,  47 రోజులు ఇలాంటి  మూవీస్ తో  విలన్ గా  ఫేమ‌స్  అయ్యాడు చిరంజీవి .  తర్వాత  సోలో  హీరోగా  చిన్న చిన్న సినిమాలు  చేస్తూ ,  ఖైదీ  సినిమాతో  స్టార్ అయిపోయాడు.

chirangevi

4. మోహన్ బాబు:

అప్పటి  అందరి  టాప్ హీరోస్  సినిమాలలో  విలన్ గా నటించి  టాప్ విలన్ గా  పేరు  తెచ్చుకున్న  మోహన్ బాబు .  అల్లుడు గారు  సినిమాతో  హీరోగా  బ్రేక్ పొంది …. 17 సంవత్సరాల  పాటు  స్టార్ స్టేటస్ అనుభవించాడు .

5. రాజశేఖర్:

కెరీర్  మొదట్లో  సైడ్  క్యారెక్టర్స్  వేస్తూ  తలంబ్రాలు సినిమాతో  విలన్ గా  గుర్తింపు  పొందాడు  రాజశేఖర్ . త‌ర్వాత‌ ఆహుతి ,  అంకుశం  లాంటి  సినిమాలతో  తిరుగులేని  స్టార్  అయ్యాడు.!

Advertisement

rajashekar

6. రవితేజ:

1990 లోనే  చిన్న విలన్  క్యారెక్టర్ తో  ఎంటరై తర్వాత  సముద్రం,  సీతారామరాజు ,  వంటి సినిమాలతో  విలన్ గా  పేరు  పొందిన ర‌వితేజ . సైడ్ క్యారెక్ట‌ర్స్, ‌ సెకండ్  హీరో  రోల్స్ చేస్తూ  తర్వాత  ఇట్లు  శ్రావణి సుబ్రహ్మణ్యం , ఇడియట్  సినిమాలతో  టాప్ హీరో  అయ్యాడు.

ravi teja

7. శ్రీకాంత్:

ప్రెసిడెంట్ గారి పెళ్ళాం ,  అబ్బాయి గారు ,  వారసుడు సినిమాలతో  యంగ్ విలన్ గా  పేరు  తెచ్చుకున్న శ్రీకాంత్ తర్వాత  సైడ్  హీరో  రోల్స్  చేస్తూ  పెళ్లి సందడి  సినిమాతో  స్టార్ అయ్యాడు .

srikanth

8. జె డి చక్రవర్తి:

ఫస్ట్  మూవీ  శివ తోనే  విలన్ గా  పేరు  తెచ్చుకున్న  జెడి  తర్వాత  కొన్ని  సినిమాలలో  చిన్న చిన్న  విలన్ పాత్రల్లో  నటించాడు .  1995 లో  గులాబి  సినిమాతో హీరోగా  గుర్తింపు  పొందాడు.

JD chakravarthi

9. శ్రీహరి:

రౌడీ ఇన్స్పెక్టర్ ,  ముఠా మేస్త్రి ,  ప్రేమించుకుందాం రా , శ్రీరాములయ్య  వంటి  సినిమాలతో  సూపర్ విలన్ గా పేరు  తెచ్చుకొని ….  సడెన్ గా  పోలీసు  మూవీ తో హీరోగా  బ్రేక్  పొంది ,  కొంతకాలం  పాటు  తనకంటూ మంచి  మార్కెట్  క్రియేట్  చేసుకున్నాడు  శ్రీహరి .

10. గోపిచంద్:

జయం,  నిజం ,  వర్షం  సినిమాలతో  భయంకరమైన విలన్ గా  గుర్తింపు  పొందిన  గోపి చంద్ .  రణం  మూవీతో హీరోగా  స్టార్  స్టేటస్  తెచ్చుకున్నాడు.

Advertisements

gopichand