Advertisement
ఇప్పుడంటే అంతర్జాతీయ క్రికెట్‌లో అంపైర్ డెసిషన్ రివ్యూ సిస్టం (డీఆర్ఎస్) వచ్చింది కానీ.. అంతకు ముందు ఫీల్డ్‌లో ఉండే అంపైర్లు ఏది చెబితే అది వినాల్సి వచ్చేది. వారు ఔటిస్తే.. ఔట్.. లేదంటే నాటౌట్.. అంతే.. ప్లేయర్లు ముందు, వెనుకా చూడకుండా.. ఏమీ మాట్లాడకుండా అంపైర్ చెప్పినట్లు చేయాల్సి వచ్చేది. ఈ క్రమంలోనే పలువురు అంపైర్లు తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకునేవారు. అవి అప్పటికప్పుడే తప్పు అని టీవీ రీప్లేల్లో తెలిసేవి. అయినా.. ఏమీ చేయలేకపోయేవారు. ఈ క్రమంలో అలా ఇప్పటి వరకు అంపైర్లు తీసుకున్న 10 తప్పుడు నిర్ణయాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఓ వరల్డ్ కప్ మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు 332 పరుగులను చేజ్ చేస్తోంది. అందులో భాగంగా చివరి 19 బంతులకు ఆ జట్టు 32 పరుగులు చేయాల్సి ఉంది. అప్పటికే ఆ జట్టు బ్యాట్స్‌మెన్లు సీన్ విలియమ్స్ (149), బ్రెండాన్ టేలర్‌లు జోరు మీద ఉన్నారు. కానీ విలియమ్స్ కొట్టిన ఒక బంతిని ప్రత్యర్థి జట్టు ఫీల్డర్ బౌండరీ మీద పట్టుకున్నాడు. టీవీ రీప్లేలో అతని కాలు బౌండరీ లైన్ పక్కన లైన్‌ను తాకుతున్నట్లు కనిపించింది. అది నిజానికి ఔట్ కాదు. జింబాబ్వేకు బౌండరీ రావల్సి ఉంది. కానీ థర్డ్ అంపైర్ జోయెల్ విల్సన్ అనూహ్యంగా దాన్ని ఔట్ అని ప్రకటించాడు. దీంతో జింబాబ్వే ఆ గేమ్‌ను 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. అదే బంతిని ఔట్ కాకుండా బౌండరీగా ప్రకటించి ఉంటే జింబాబ్వే నిజానికి ఆ గేమ్‌లో గెలిచి ఉండేది. ఇది అంపైర్ తప్పిదానికి ఒక ఉదాహరణ.
2. శ్రీలంక, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక విజయానికి 507 పరుగులను చేయాల్సి ఉంది. కుమార సంగక్కర 192 పరుగుల స్కోరు చేసి జోరు మీద ఉన్నాడు. జట్టు 3 వికెట్ల నష్టానికి 265 పరుగుల వద్ద కొనసాగుతోంది. అయితే ఆస్ట్రేలియా బౌలర్ స్టువర్ట్ క్లార్క్ వేసిన బంతిని సంగక్కర పుల్ షాట్ ఆడాడు. అది అతని చేయికి తగిలి వెనక్కి వెళ్లగా 2వ స్లిప్‌లో ఉన్న పాంటింగ్ క్యాచ్ పట్టాడు. అయితే చేతికి బంతి తగలడం వల్ల నిజానికి అది నాటౌట్. కానీ ఆసీస్ ప్లేయర్లు అప్లై చేయడంతో అంపైర్ రూడీ కొయెర్ట్జన్ ఔట్ ఇచ్చాడు. ఆ మ్యాచ్‌లో లంక 96 పరుగుల తేడాతో ఓడిపోయింది. అదే సంగక్కర ఔట్ కాకుండా ఉంటే లంక చారిత్రాత్మక మ్యాచ్‌లో గెలిచి ఉండేది.
Advertisements
3. ఆస్ట్రేలియాలో గబ్బా మైదానంలో 2003లో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో భారత ప్లేయర్ సచిన్ టెండుల్కర్‌ను స్టీవ్ బక్నర్ ఔట్ కాకున్నా ఔట్ అని ప్రకటించాడు. బంతి ఎక్కడో పడగా సచిన్ కదలలేదు. అయినా అంపైర్ ఔట్ ఇచ్చాడు.
4. సౌతాఫ్రికాతో 2006లో జరిగిన వన్డే సిరీస్‌లో ఓ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ జహీర్‌ఖాన్ విసిరిన బంతి సౌతాఫ్రికా ప్లేయర్ ఏబీ డివిలయర్స్ బ్యాట్ ఎడ్జ్‌కు తాకింది. సచిన్ స్లిప్‌లో క్యాచ్ పట్టాడు. అది ఔట్ అయినా దాన్ని అంపైర్ అలీం దార్ నాటౌట్ అని ప్రకటించాడు.
Advertisement
5. జింబాబ్వే, వెస్టిండీస్‌ల మధ్య 2013లో జరిగిన ఓ సిరీస్‌లో 2వ వన్డేలో విండీస్ ఆటగాడు రామ్‌నరేష్ శర్వాన్ సింగిల్‌కు యత్నించి క్రీజుకు 8 ఇంచుల దూరంలో నిలిచాడు. రన్ పూర్తి చేయలేదు. అది నిజానికి రనౌట్. కానీ అంపైర్ పీటర్ నెరో థర్డ్ అంపైర్‌కు ఇవ్వలేదు.
6. అడిలైడ్‌లో 1999లో ఆసీస్‌తో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో 2వ ఇన్నింగ్స్‌లో భారత ప్లేయర్ సచిన్ భుజానికి బంతి తాకింది. అది నాటౌట్. కానీ అంపైర్ దాన్ని ఎల్‌బీడబ్ల్యూగా ప్రకటించాడు.
7. అప్పట్లో.. 1995-96లలో సిడ్నీ టెస్టు సందర్భంగా శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ చకింగ్‌కు పాల్పడుతున్నాడని అంపైర్లు అతన్ని బౌలింగ్ వేయకుండా నిషేధించారు. కానీ ఐసీసీ పరీక్షలు నిర్వహించి అతను చకింగ్ చేయలేదని తేల్చింది.
8. 2007-2008లో ఇండియా, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన సిడ్నీ టెస్టు మ్యాచ్‌లో అనేక అంపైర్ తప్పిదాలు చోటు చేసుకున్నాయి. ఇషాంత్ శర్మ వేసిన బంతి ఆండ్రూ సైమండ్స్ బ్యాట్‌కు తాకింది. టీమిండియా ప్లేయర్లు సంబరాలు చేసుకున్నారు. కానీ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. ఇక మరో బౌలర్ బంతికి సైమండ్స్ స్టంప్ అవుట్ అయ్యాడు. అయినా అంపైర్ బక్నర్ థర్డ్ అంపైర్‌కు ఇవ్వలేదు. అలాగే పాంటింగ్ క్యాచ్‌ను గంగూలీ పట్టాడు. కానీ అతన్ని ఔట్‌గా ప్రకటించలేదు. ఇక ఓ లెగ్ స్పిన్నర్‌ను ద్రావిడ్ చాలా దూరంలో తప్పించుకున్నాడు. కానీ ఆసీస్ ప్లేయర్లు అప్పీల్ చేయడంతో అది నాటౌట్ అయినా దాన్ని ఔట్‌గా ప్రకటించారు. అలాగే గంగూలీ ఇచ్చిన క్యాచ్‌ను పాంటింగ్ పట్టుకున్నాడు. కానీ బంతి ముందుగా నేలను తాకింది. అది నాటౌట్ అయినా.. గంగూలీ నిరసన తెలిపినా.. దాన్ని అంపైర్ మార్క్ బెన్సన్ ఔట్‌గా ప్రకటించాడు. థర్డ్ అంపైర్‌కు కూడా ఇవ్వలేదు.
9. 2013లో జరిగిన యాషెస్ సిరీస్ మొదటి టెస్టు 3వ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ప్లేయర్ స్టువర్ట్ బ్రాడ్ స్లిప్‌లో ఉన్న ఆసీస్ ప్లేయర్ మైకేల్ క్లార్క్‌కు క్యాచ్ ఇచ్చాడు. కానీ అంపైర్ అలీమ్ దార్ దాన్ని పట్టించుకోలేదు.
10. 2007లో బ్రిస్టల్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో టెండుల్కర్ 99 వద్ద ఔటయ్యాడు. కానీ అది నిజానికి నాటౌట్. ఇంగ్లండ్ బౌలర్ ఫ్లింటాఫ్ వేసిన షార్ట్ పిచ్ బంతిని సచిన్ ఆడగా.. అది అతని చేతులకు తాకింది. ఇంగ్లండ్ ప్లేయర్ మ్యాట్ ప్రియర్ క్యాచ్ పట్టాడు. ఆ టీం మొత్తం అప్పీల్ చేయడంతో అంపైర్ దాన్ని ఔట్‌గా ప్రకటించాడు. నిజానికి టెండుల్కర్‌కు 90లలో ఔట్ కావడం కామనే. అయినా.. ఈ ఔట్‌లో మాత్రం అతని తప్పు లేదు.
Advertisements