Advertisement
భారత చలన చిత్ర పరిశ్రమలో ఎన్నో వేల సినిమాలు రూపొందాయి. వాటిల్లో బాక్స్ ఆఫీసు ని కుదిపేసిన బ్లాక్ బస్టర్స్ , చరిత్రలో నిలిచిపోయే క్లాసిక్స్ , సమాజాన్ని తట్టిలేపిన గొప్ప చిత్రాలు ఇలా ఎన్నో ఉన్నాయి! అన్ని వేల సినిమాల్లోంచి CNN , IBN వారు అల్ టైం 100 గ్రేటెస్ట్ ఇండియన్ మూవీస్ ను సెలెక్ట్ చేశారు. ఆ లిస్ట్ లో 10 తెలుగు సినిమాలు చోటు దక్కించుకున్నాయి. తెలుగు ఖ్యాతిని పెంచిన ఆ సినిమా లిస్ట్ మీకోసం
1. పాతాళ భైరవి:
NTR & SVR కాంబినేషన్ లో వచ్చిన జానపద చిత్రం పాతాళ భైరవి . KV రెడ్డి డైరెక్షన్లో 1951 లో రిలీజైన ఈ చిత్రం…. డైరెక్ట్ గా 200 రోజులు ప్రదర్శించబడి సంచలనం సృష్టించింది. పాతాళ భైరవి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శింపబడింది . NTR కి స్టార్ ఇమేజ్ తెచ్చిన పాతాళ భైరవి, తొలినాళ్లలోనే తెలుగు సినిమా ఖ్యాతిని దేశమంతా చాటింది.
2. మల్లీశ్వరి:
Advertisements
BN రెడ్డి డైరెక్షన్లో ఎన్టీఆర్ , భానుమతి నటించిన అద్భుత ప్రేమకథ మరియు క్లాసిక్ సినిమా మల్లీశ్వరి . కల్ట్ క్లాసిక్ కు మొట్టమొదటి సారి అర్ధం చెప్పిన సినిమా ఇది . రెండు సంవత్సరాలు షూటింగ్ జరుపుకొని 1951లో రిలీజై ఘనవిజయం సాధించింది .
3. దేవదాస్:
ప్రేమ కథా చిత్రాలకు అల్టిమేట్ ట్రెండ్ సెట్టర్ దేవదాస్ . నాగేశ్వరరావు అద్భుత అభినయం… ఆయన్ని జీవితాంతం గుర్తుంచుకునెలా చేసింది . సావిత్రి కి కూడా మంచి బ్రేక్ ఇచ్చిన ఈ సినిమా వేదాంతం రాఘవయ్య డైరెక్షన్లో 1953 లో రిలీజై అద్భుత విజయం సాధించింది.
4. మాయ బజార్:
తెలుగు సినిమా అంటే మాయ బజార్ , మాయ బజార్ అంటే తెలుగు సినిమా అనేంతలా మన మదిలో పెనవేసుకపోయిన సినిమా ఇది . ఈ సినిమా నిర్మాణం, స్క్రీన్ ప్లే ముందుతరాలకు ఒక గ్రంథాలయం . అసలు టెక్నాలజీ అందుబాటులో లేకున్నా అలా ఎలా తీసారబ్బా? అని ఇప్పుడు చూసినా ఆశ్చర్య పోవడం ఖాయం . ఎన్టీఆర్ , ఏఎన్ఆర్, ఎస్ విఆర్, సావిత్రి లాంటి దిగ్గజాలు కలిసి నటించిన ఈ సినిమా 1957 లో రిలీజై అల్ టైమ్ తెలుగు బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది .
5. నర్తనశాల:
Advertisement
పౌరాణిక సినిమాల్లో అజరామరం నర్తనశాల ఎన్టీఆర్ , సావిత్రి , ఎస్ వి ఆర్ ల ఔట్ స్టాండింగ్ పెరఫార్మెన్స్ ఎప్పటికీ గుర్తుండి పోతుంది . 2 సెంటర్లలో 200 రోజులు ప్రదర్షింపబడిన ఈ సినిమా 1963 లో రిలీజైంది .
6. మరో చరిత్ర:
లవ్ స్టోరీస్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే మూవీ మరో చరిత్ర . యూత్ ఆలోచనతీరుపై తీవ్ర ప్రభావం చూపింది ఈసినిమా! క్లైమాక్స్ విషాదాంతంతో ట్రెండ్ సెట్ చేసిన మరో చరిత్ర మూవీని చూసి ప్రేమ విఫలమైన జంటలు ఆత్మహ_ త్యలు చేసుకోవటం అప్పట్లో సంచలనం సృష్టించింది . 1978 లో రిలీజై కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది.
7.నా భూమి:
1979 లో రిలీజై ఇప్పటికీ సజీవంగా మిగిలిపోయిన సినిమా నా భూమి . తెలంగాణ బ్యాక్డ్రాప్ లో అక్కడి పల్లెలు , నిజాం అరాచక పాలనను రియాలిస్టిక్ గా చూపించారు.
8. శంకరాభరణం:
నేషనల్ అవార్డ్స్ నుంచి నంది అవార్డ్స్ దాకా ఎన్నో అవార్డ్స్ కొల్లగొట్టి, పల్లెల నుండి ఫారెన్ కంట్రీస్ దాకా మన తెలుగు సినిమా గొప్పతనాన్ని చాటిన దృశ్యకావ్యం శంకరాభరణం. కె విశ్వనాధ్ డైరెక్షన్ , ఎస్ వి సోమయాజులు అభినయం నభూతో నభవిష్యత్!
9. సాగర సంగమం:
ఒక్క సినిమాలో ఇన్ని వేరియేషన్స్ చూపించొచ్చా? అని అందరిని ఆశ్చర్యానికి గురిచేసిన మూవీ సాగర సంగమం . కె విశ్వనాథన్ , కమల్ హాసన్ , ఇళయరాజా, ఎస్ పి బాలు ఈ నలుగురి సంగమం తెలుగు సినిమా గర్వపడే ఒక క్లాసిక్ ని సృష్టించింది . ఈ సినిమాకు రెండు నేషనల్ అవార్డ్స్ లభించాయి.
10. శివ:
తెలుగు సినిమాని విభజించాల్సి వస్తే శివ కి ముందు శివకి తర్వాత అని చెప్పుకోవాలి . టోటల్ టాలీవుడ్ ఫేట్ నే మార్చేసి మేకింగ్ లో కొత్త వరవడి సృష్టించిన అసలు సిసలు ట్రెండ్ సెట్టర్ శివ.!
Advertisements