Advertisement
భారత్‌లో ఎంతో పురాతన కాలం నుంచి ఉన్న ఆలయాలను ప్రభుత్వాలు పరిరక్షిస్తున్నాయి. తవ్వకాల్లో బయట పడ్డ ఆలయాలను కూడా రక్షిస్తున్నారు. కానీ పాకిస్థాన్‌లో మాత్రం ఆలయాలకు రక్షణ కరువవుతోంది. అందుకు అక్కడి వరుణ దేవుడి ఆలయమే ఉదాహరణ అని చెప్పవచ్చు. పాకిస్థాన్‌లోని కరాచీ ప్రాంతంలో మనోరా ఐల్యాండ్ బీచ్ వద్ద వరుణ దేవుడి ఆలయం ఉంది. ఇది సుమారుగా 1000 సంవత్సరాల కిందటిదని చరిత్ర చెబుతోంది. అయితే దీన్ని పబ్లిక్ టాయిలెట్ కింద వాడుతున్నారు.
ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో నిర్మించి ఉంటారని చరిత్ర చెబుతోంది. అప్పట్లో భోజోమల్ నాన్సీ భాటియా అనబడే ఓ సంపన్నుడు ఈ ఆలయం ఉన్న ప్రాంతాన్ని కొనుగోలు చేశాడని, అందువల్ల ఆలయం అప్పట్లో అతను, అతని వంశస్థుల చేతుల్లో సురక్షితంగా ఉండేదని తెలుస్తోంది. అయితే ఈ ఆలయాన్ని కచ్చితంగా ఎప్పుడు నిర్మించారనేది తెలియదు. దీన్ని 1917-18వ సంవత్సరంలో పునర్నిర్మించారు.
ఆలయం ప్రధాన ద్వారం వద్ద గోడలపై సింధీ భాషలో రాతలను చూడవచ్చు. భ్రియాకు చెందిన సేత్ హర్‌చంద్ మల్ దయాల్ దాస్ జ్ఞాపకార్థం అనే రాతలు ఉంటాయి. అయితే అందులో భ్రియా అనేది ఒక టౌన్. పాకిస్థాన్‌లోని సింధ్ రాష్ట్రం ఖైర్‌పూర్‌లో భ్రియా టౌన్ ఉంది.
Advertisement
ప్రస్తుతం ఆలయ బాధ్యతలను పాకిస్థాన్ హిందూ కౌన్సిల్ చూసుకుంటోంది. అయినప్పటికీ ఆలయాన్ని పరిరక్షించేందుకు వారు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. దీంతో గోడలు, గదులు శిథిలావస్థకు చేరుకున్నాయి. బీచ్‌కు వచ్చే వారు ఈ ఆలయంలో ఉన్న గదులను టాయిలెట్లుగా వాడడం మొదలు పెట్టారు. 2008లో ఆలయ పరిరక్షకుడు జీవ్‌రాజ్ ఆలయ హక్కులు ఎవరికి ఉన్నాయో తెలుసుకునేందుకు అక్కడి మనోరా కంటోన్మెంట్ బోర్డు (ఎంసీబీ)కి లేఖ రాశాడు. ఈ క్రమంలో పాకిస్థాన్ నేవీకి ఆలయం ఉన్న స్థలం చెందుతుందని తేలింది.
Advertisements
Advertisements
ఇక ఆలయంలోకి ఇతరులు ప్రవేశించకుండా అడ్డుకునే గేట్లను కూడా తీసేశారు. దీంతో ఎవరు పడితే వారు అందులోకి వెళ్లడం మొదలైంది. ఈ క్రమంలో ఆలయం శిథిలావస్థకు కూడా చేరుకోవడంతో.. ఆలయ పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. ఆలయ శిఖరం కూడా ఒక వైపుకు వంగింది. గోడలన్నీధ్వంసమయ్యాయి. 1992లో ఆలయానికి సీల్ వేశారు. ఈ ఆలయంలో చివరిసారిగా 1950లలో పూజలు చేశారు. అప్పటి నుంచి ఎలాంటి పూజలూ చేయడం లేదు.
ఈ ఆలయం ప్రాంగణంలోనే మరో రెండు చిన్న ఆలయాలు ఉంటాయి. జూలే లాల్, శివాలయాలు ఉంటాయి. అవి కూడా శిథిలావస్థలోనే ఉన్నాయి. 1970ల నుంచి రిపేర్లను చేస్తున్నప్పటికీ ఆలయం ఎప్పటికప్పుడు ధ్వంసమవుతుండడం వల్ల ఎన్ని రిపేర్లు చేసినా పరిస్థితి అలాగే ఉంది. ఇక ఎన్నో ఏళ్ల తరువాత యూఎస్ అంబాసిడర్స్ ఫండ్ ఫర్ కల్చరల్ ప్రిజర్వేషన్ వారు విరాళాలు ఇవ్వడంతో ఆలయాన్ని ఎట్టకేలకు పునరుద్ధరించారు. పూర్తి స్థాయిలో మరమ్మత్తులు చేశారు. పలు పనులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.