Advertisement
అంబులెన్స్ అవసరం వచ్చినప్పుడు సాధారణంగా మనం 108కి కాల్ చేస్తాం.ఇంతకీ అంబులెన్స్ కు 108 నంబర్ ను ఎందుకు ఎంచుకున్నారు ఆ నంబర్ వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.
హిందువులకు 108 అనే సంఖ్య చాలా పవిత్రమైనది.అందుకే దేవుడికి కట్టే పూల పూలమాలలో సరిగ్గా 108 పువ్వులను వాడుతారు.అంతేకాకుండా పూసలు పొదిగిన హారాలలో కూడా 108 పూసలని వినియోగిస్తారు.
ఇక సూర్యుడు,చంద్రుడు,భూమి దూరం వాటి వ్యాసాల( డయామీటర్) సరిగ్గా 108 సార్లు ఉంటుంది.ఇక యోగా శాస్త్రాల ప్రకారం దేశంలో 108 సంఖ్య గల పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.అంతేకాక ఉపనిషత్తులు, మర్మ స్థానాల సంఖ్య కూడా 108 సంఖ్య ఉంది.
Advertisements
Advertisement
ఇక ఇస్లాం మతంలో 108 సంఖ్యను దేవుడితో పోలుస్తారు.సాధారణంగా మనిషి చనిపోయాక తన ఆత్మ 108 ఘట్టాలను ఎదుర్కొని ప్రయాణం చేయాలట.
ఇక సైకాలజి పరంగా చూస్తే మనిషి డిప్రెషన్ లేదా సమస్యలో ఉన్నప్పుడు అతని చూపు ఫోన్ లో ఎడమ భాగం వైపు చివరిగా వెళ్తుందని అక్కడ 0,8 దగ్గరగా ఉన్నాయని అందుకే 108ని ఎమర్జెన్సీ నంబర్ గా ఉంచుండ వచ్చని అంచనా వేస్తున్నారు.ఇక మరో కథనం ప్రకారం మొదటి సంఖ్య అయిన 1 మేల్ ను,0 ఫిమేల్ ను సూచిస్తాయి అని 8వ సంఖ్య ఇన్ఫినిటీ లేదా ఎటర్నిటిని సూచిస్తుందని అంటారు.
Advertisements
సో ఇదండీ ప్రస్తుతం 108 సంఖ్య అంబులెన్స్ లకు వాడడానికి గల కారణంగా చెబుతున్నారు.మరి పై చెప్పబడిన కారణాలలో మీరు దేనితో ఏకీభవిస్తారో మాకు కామెంట్స్ సెక్షన్ లో తెలియజేయండి.