Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

నా 10 Th క్లాస్ లవ్ స్టోరి.! “చిట్టీ” ఓ మ‌ధుర జ్ఞాపకం.

Advertisement

చిట్టి నా క్లాస్ మేట్! 5 Th క్లాస్ వ‌ర‌కు క‌లిసి మా ఊరి బ‌డిలోనే చ‌దువుకున్న మేము 6 Th క్లాస్ కోసం ప‌క్క ఊరులోని పెద్ద స్కూల్ కు వెళ్లాల్సి వ‌చ్చింది. మా ఊరిబ‌డిలో 5Th క్లాస్ అయిపోయిన వాళ్లంద‌రం….. 6 Th క్లాస్ కోసం పెద్ద బ‌డిలో జాయిన్ అయిపోయాం!

మా క్లాస్ లో అమ్మాయిలు, అబ్బాయిలు క‌లిపి మొత్తం  90 మంది., క్లాస్ లకు  ఇబ్బందవుతుందని… సార్  వాళ్ళు  మమ్మల్ని  45 మంది  వచ్చేలా రెండు  సెక్షన్ల్ లుగా విడ‌గొట్టారు.! చిట్టిదీ నాదీ ఒకే సెక్ష‌న్…. A సెక్ష‌న్!

6,7,8 త‌ర‌గ‌తులు అలా గ‌డిచిపోయాయి…ఇప్పుడు మేము 9 Th క్లాస్ లో ఉన్నాం. 6 Th క్లాస్ నుండి చిట్టీ గ‌ర్ల్స్ బెంచ్ లో అటువైపుకు, నేను బాయ్స్ బెంచ్ లో ఇటువైపు కూర్చునేవాళ్లం. కానీ సంక్రాంతి సెల‌వుల త‌ర్వాత చిట్టీ ప్లేస్ మార్చేసింది. అడిగినా ఏదో అన్న‌ట్టు స‌మాధానం చెప్పింది….ఎందుకో  చిట్టి పక్కన  లేకపోయేసరికి  నాకేదో లోటుగా  అనిపించి నేను కూడా  వెనక బెంచీకి  వెళ్ళాను.  తర్వాత  ఆ బెంచీల మద్యం దూరం  లాగే  మా మధ్య కూడా దూరం  పెరిగింది .

తర్వాత  ఎండాకాలం  సెలవలు …. నేను  చిట్టిని  లవ్ చేస్తున్నానని  నాకు  అప్పుడే తెలిసింది . ఎందుకంటే  మాకు  ఆ రోజుల్లో  క్లాస్ లో ఎవరైనా  ఊరికే  ఒకరివైపు  చూస్తున్నారంటే వారి మధ్య  ప్రేమ  ఉన్నట్టే అర్ధం .  మాకు  తెలిసిన  ప్రేమ అంతే!   ఎందుకంటే  అప్పటికే  మా క్లాస్ లో  ఉన్న రెండు  మూడు  జంటలు  అలాగే  ప్రేమించుకునే  వారు ,  అదే  మా దృష్టిలో ప్రేమ. నేను  కూడా ఊరికే చిట్టినే  చూస్తున్నాను  అంటే  నాది  ప్రేమేన‌ని  కన్ఫర్మ్ చేసుకున్నాను!

Advertisements

Advertisement

10th  క్లాస్  స్టార్ట్  అయ్యింది  నేను చిట్టితో మాట్లాడటానికి  చాలా సార్లు ట్రై  చేశా కానీ ధైర్యం చాల‌ట్లేదు…. చిట్టి  కూడా  ఎందుకో  నాతో  మాట్లాడటం బాగా తగ్గించింది. 10th క్లాస్  కూడా అయిపోవచ్చింది  అందరూ  వాళ్ళ లవర్స్ తో  చివరి సారి  అన్నట్టుగా  మాట్లాడుకుంటున్నారు.! కానీ  నేను మాత్రం  చిట్టి కళ్ళలోకి  చూసి  నా ప్రేమని  చెప్పే  ధైర్యం చేయలేకపోయాను… 10th  అయిపోయింది. ఆ తర్వాత చదువు కోసం  నేను హైదరాబాద్ కి  వచ్చేసాను .  నా 10th  అయిపోయి  8 సంవత్సరాలు అవుతుంది  మళ్ళీ  ఇప్పటివరకు  చిట్టిని  కలవలేదు నా ప్రేమ  చెప్పలేదు.!

 

నా 10th  తర్వాత  4 సంవత్సరాలకి  చిట్టి వాళ్ళ ఇంటిపక్కనుండే ఓ అక్క‌….నాకు ఫోన్ చేసింది. ఆమె నాకు చాలా క్లోజ్… మాట్లాడుతూ మాట్లాడుతూ….ఏరా చిట్టీని మ‌ర్చిపోయావా? అంటూ అడిగింది! చిట్టి అన్న పేరు విని నా గుండె  ఒక్కసారిగా  ఆగిపోయినట్టనిపించింది! స్కూల్ డేస్ లో నువ్వు చిట్టీ మీద ఇంట్రెస్ట్ చూపావ‌న్న విష‌యం నాకు తెలుసు….ఈ విష‌యం ఓ సారి చిట్టీని అడిగాను …నీకు వాడంటే ఇష్ట‌మా? అని .. దానికి చిట్టి ఇష్ట‌మే  అక్కా ! కానీ మా ఫ్యామిలీ  గురించి  తెలుసుగా  మళ్ళీ  ఇంట్లో  తెలిస్తే నాన్న  చ‌దువు మానేపిస్తాడ‌ని దూరంగా ఉంటూ వ‌చ్చాన‌ని చెప్పిందట‌!

Advertisements

స్కూల్ డేస్ ఒక్క‌సారిగా క‌ళ్లముందు తిరిగాయి…. నాపై ప్రేమ‌ను చిట్టి ఎన్ని సార్లు, ఏ విధంగా కంట్రోల్ చేసుకుందో అర్థ‌మైంది. చిట్టి నెంబ‌ర్ తీసుకోవాల‌నిపించింది…కానీ చిట్టీకి అప్ప‌టికే పెళ్లైపోయిందని తెలిసి నాకు నేను నో చెప్పుకున్నాను. చిట్టి నా జీవితంలో నాతో పాటు లేక‌పోవొచ్చు కానీ  ఓ మ‌ధుర‌ జ్ఞాపకంగా ఎప్ప‌టికీ నిలిచిపోతుంది! ఆ త‌ర్వాత మళ్ళీ ఇప్పటివరకు చిట్టిని చూడలేదు  ఎక్కడా  కలవలేదు.!