Advertisement
ప్రతిభ అనేది నిజానికి ఎవరి సొత్తు కాదు. ఎంతటి వారైనా సరే అద్భుతాలు చేయవచ్చు. ఏదైనా నిర్దిష్టమైన అంశంపై ఏకాగ్రత, శ్రద్ధ ఉండి ఆసక్తి చూపించాలే కానీ ఎవరైనా ఎందులో అయినా రాణించవచ్చు. సరిగ్గా ఆ బాలుడు కూడా ఇదే విషయాన్ని నిరూపించాడు. చదువుతున్నది పదో తరగతి అయినప్పటికీ నైపుణ్యం ఉన్న మెకానిక్ కన్నా ఎక్కువగా ప్రదర్శన కనబరిచాడు. స్క్రాప్ మెటీరియల్ నుంచి ఏకంగా టూవీలర్‌నే తయారు చేశాడు.
చండీగఢ్‌కు చెందిన గౌరవ్ పదవ తరగతి చదువుతున్నాడు. ఇతనికి టూవీలర్స్ అంటే ఆసక్తి. ఎప్పుడూ వాటి పార్ట్స్ ను విడదీసి మళ్లీ కలుపుతుంటాడు. అందులో భాగంగానే అతను స్క్రాప్ మెటీరియల్ నుంచి ఏకంగా ఓ టూవీలర్‌నే రూపొందించాడు. ద్విచక్ర వాహనాలకు చెందిన పార్ట్‌లను సేకరించి అతను కొత్తగా ఓ బైక్‌ను తీర్చిదిద్దాడు. ఆ బైక్ లీటర్ పెట్రోల్‌కు ఏకంగా 80 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుండడం విశేషం.
Advertisement
Advertisements
అయితే గౌరవ్ అంతకుముందు ఎలక్ట్రిక్ బైక్‌ను రూపొందించాడు. కానీ దాంతో ఎక్కువ స్పీడ్ వెళ్లలేకపోయాడు. ఈ క్రమంలో అదే బైక్‌ను పెట్రోల్ బైక్‌గా మార్చాడు. అందులో ముందు భాగంలో సైకిల్ టైర్‌ను అమర్చాడు. ఇక మిగిలిన అన్ని భాగాలను ఇతర బైక్‌ల పార్ట్‌ల నుంచి సేకరించాడు. ఇంజిన్, చాసిస్, వెనుక టైర్, ఇతర ఫ్రేమ్‌లు, సీట్, మిర్రర్స్.. ఇలా అన్ని విడి భాగాలను సేకరించి అతను ఆ బైక్‌ను రూపొందించాడు.
Advertisements
కాగా గౌరవ్ అలా స్క్రాప్ ద్వారా బైక్‌ను రూపొందించే సరికి అందరూ అతన్ని మెచ్చుకుంటున్నారు. కేవలం 10వ తరగతి చదువుతూనే ఇంత అద్భుతం చేశాడంటే భవిష్యత్తులో ఇంకా అతను ఎంతో సాధిస్తాడని అందరూ ప్రశంసిస్తున్నారు.