Advertisement
సినీ నటులు, ఇతర సెలబ్రిటీలు ఫెయిర్‌నెస్ క్రీముల పేరిట నిత్యం టీవీల్లో ప్రకటనలతో ఊదరగొడుతుంటారు. తమ కంపెనీ క్రీమ్ లేదా పౌడర్ వాడితే నల్లగా ఉన్నవారు కూడా తెల్లగా మారుతారని ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ యాడ్స్ ఇస్తుంటారు. కొందరు సెలబ్రిటీలు అది తప్పని తెలిసినా సరే ఏ మాత్రం విలువలు పాటించకుండా ఆ యాడ్స్‌లో నటిస్తూ కేవలం తమ స్వప్రయోజనాలు మాత్రమే చూసుకుంటూ ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేస్తారు. అయితే బాలీవుడ్ నటుడు సుశాంత్ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. సమాజం తన వల్ల నష్టపోకూడదని అతను భావించాడు. అలాంటి యాడ్స్‌లో నటించేది లేదని తేల్చి చెప్పాడు. ఈ క్రమంలోనే ఇదే అంశంపై సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు చెందిన ఓ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Advertisement
సుశాంత్ నిజానికి చక్కని యాక్టర్ మాత్రమే కాదు.. విలువలు ఉన్న వ్యక్తి. తన వల్ల సమాజానికి చెడు జరగకూడదని భావించే వ్యక్తిత్వం ఉన్నవాడు. అందుకనే అతను గతంలో ఫెయిర్‌నెస్ క్రీముల యాడ్స్‌లో నటించనని చెప్పాడు. ఇక ఓ కంపెనీ ఆ యాడ్స్‌లో నటించేందుకు గాను రూ.15 కోట్ల భారీ మొత్తాన్ని ముట్టజెబుతామని ఆశ చూపిందట. కానీ అందుకు సుశాంత్ ససేమిరా అన్నాడు. ఫెయిర్‌నెస్ క్రీములను వాడడం వల్ల నల్లగా ఉన్న ముఖం తెల్లగా అవుతుందని చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే అవుతుందని అతను నమ్మాడు. అలాంటి ప్రకటనల్లో నటించలేనని చెప్పాడు.
Advertisements
ఆ కంపెనీ 3 ఏళ్ల కాలానికి గాను 6 ఫెయిర్‌నెస్ క్రీము యాడ్స్‌లలో నటించాలని చెప్పింది. అందుకు అంత భారీ మొత్తంలో డబ్బు అందజేస్తామని తెలిపింది. 2018లో ఈ సంఘటన జరిగింది. అయినా వారి భారీ ఆఫర్‌ను సుశాంత్ తిరస్కరించాడు. విలువలు ఉన్న వ్యక్తి కనుకనే అలాంటి తప్పుదోవ పట్టించే ప్రకటనల్లో నటించలేదు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చే సరికి సుశాంత్‌ను అతని అభిమానులు మెచ్చుకుంటున్నారు. అవును మరి.. కేవలం డబ్బుల కోసమే.. ప్రజలను పట్టించుకోకుండా వారిని తప్పుదోవ పట్టించే ప్రకటనల్లో నటించే కొందరు సెలబ్రిటీలతో పోలిస్తే సుశాంత్ ఇప్పుడు ఎంతటి మంచి వ్యక్తిత్వం ఉన్నవాడో అర్థమవుతుంది కదా..!
Advertisements