Advertisement
ప్రస్తుతం ఎక్కడ చూసినా కెమికల్స్ వాడకం ఎక్కువైంది. మనం తినే పదార్థాల నుంచి తాగే పానీయాలు, వాడే వస్తువులు.. అన్నీ కెమికల్స్‌ను కలిగి ఉంటున్నాయి. దీంతో దీర్ఘకాలంలో మనకు అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే మనం నిత్యం వాడే పలు రకాల వస్తువుల్లో ఉండే కెమికల్స్ గురించి తెలుసుకుంటే.. వాటి వాడకాన్ని కొంతమేర లేదా పూర్తిగా తగ్గించి.. తద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇక ఆ వస్తువులు ఏమిటంటే…
1. పెర్‌ఫ్యూమ్స్
వీటిల్లో బెంజాల్డిహైడ్, ఈథైల్ ఎసిటేట్, బెంజైల్ ఎసిటేట్, అసిటోన్, మిథైల్ క్లోరైడ్ వంటి రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని మనం పీలిస్తే తలతిరిగినట్లు అనిపిస్తుంది. వికారంగా ఉంటుంది. నిద్ర మత్తు వస్తుంది. గొంతులో దురద పెట్టినట్లు అనిపిస్తుంది. సుదీర్ఘకాలం పాటు పెర్‌ఫ్యూమ్‌లను వాడితే కళ్లు, చర్మం, ఊపిరితిత్తులు, కిడ్నీలు డ్యామేజ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇక పెర్‌ఫ్యూమ్స్‌లో సహజసిద్ధమైన వాటిని వాడితే మేలు.
2. పరుపులు
నిత్యం మనం నిద్రించేందుకు ఉపయోగించే పరుపుల్లో పీబీడీఈలు అనబడే హానికారక రసాయనాలు ఉంటాయి. ఇవి మెదడుపై ప్రభావం చూపిస్తాయి. మెదడులోని కణాలను నాశనం చేస్తాయి. వీర్యం నాణ్యత తగ్గిపోతుంది. థైరాయిడ్ సమస్యలు వస్తాయి.
Advertisements
3. శుభ్రపరిచే వస్తువులు
ఇంటిని శుభ్రం చేసే క్లీనర్లలో హానికారక రసాయనాలు ఉంటాయి. థాలేట్స్ అనబడే కెమికల్స్ వాటిలో ఉంటాయి. అవి మన శరీరంలోని లివర్, కిడ్నీలు, ఊపిరితిత్తులపై ప్రభావాన్ని చూపి వాటి వ్యవస్థలను నాశనం చేస్తాయి. దీంతో ఆయా భాగాలకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక వీటికి బదులుగా బేకింగ్ సోడా, నిమ్మరసం – వేడినీటి మిశ్రమం వంటి సహజ సిద్ధమైన క్లీనర్లను వాడవచ్చు.
4. ఎయిర్ ఫ్రెషెనర్లు
వీటిల్లో ఎథిలీన్ ఆధారిత గ్లైకాల్ ఈథర్స్, పారాడైక్లోరోబెంజీన్ తదితర విష పదార్థాలు ఉంటాయి. ఇవి శ్వాసకోశ వ్యవస్థపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి.
5. ప్లాస్టిక్ ఫుడ్ కంటెయినర్లు
గతంలో చాలా మంది ఆహారాన్ని నిల్వ చేసేందుకు, లంచ్ బాక్సులకు స్టీల్ పాత్రలను ఎక్కువగా వాడేవారు. కానీ ఇప్పుడు ప్లాస్టిక్ బాక్సులు, ప్లాస్టిక్ ఫుడ్ కంటెయినర్లను ఎక్కువగా వాడుతున్నారు. కానీ నిజానికి వాటిల్లో థాలేట్లు అనబడే హానికారక రసాయనాలు ఉంటాయి. అవి థైరాయిడ్ వ్యాధులను కలగజేస్తాయి. ప్రత్యుత్పత్తి వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి. నాడీ మండల వ్యవస్థకు హాని కలగజేస్తాయి.
6. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్
షాపుల్లో 1, 2, 5 లీటర్ల పరిమాణాల్లో అమ్మే మినరల్ వాటర్ బాటిల్స్‌ను మనం కేవలం ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలి. వాటిలోని నీటిని తాగాక వాటిని పడేయాలి. కానీ కొందరు వాటిని మళ్లీ మళ్లీ ఉపయోగిస్తుంటారు. అలా చేయరాదు. పదే పదే వాటిని వాడితే ప్లాస్టిక్ మన శరీరంలోకి వెళ్లి విష పదార్థంగా మారి తీవ్రమైన అనారోగ్య సమస్యలను కలగజేస్తుంది. క్యాన్సర్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక వాటిని కేవలం ఒక్కసారి మాత్రమే వాడాలి.
7. కాస్మొటిక్స్
కాస్మొటిక్ వస్తువులను మహిళలు నిత్యం ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటిల్లో ఉండే థాలేట్లు, సీసం, కోల్ టార్, నానో పదార్థాలు, ఫార్మాల్డిహైడ్ సమ్మేళనాలు చర్మానికి హాని కలగజేస్తాయి. చర్మ క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. శ్వాసకోశ వ్యవస్థ సమస్యలు కూడా వస్తాయి.
8. యాంటీ పర్‌స్పిరెంట్స్
చెమట అస్సలు రాకుండా ఉండేందుకు కొందరు వీటిని వాడుతారు. వీటిలో క్యాన్సర్‌ను కలగజేసే హానికారక రసాయనాలు ఉంటాయి.
Advertisement
9. ఫ్యాబ్రిక్ సాఫ్టెనర్స్
వీటిలో అమ్మోనియం లవణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మంపై దద్దుర్లు, దురదను కలగజేస్తాయి. శ్వాసకోశ సమస్యలు, తలనొప్పి వస్తాయి.
10. నాన్-స్టిక్ కుక్‌వేర్
చాలా మంది నాన్-స్టిక్ కుక్‌వేర్‌లో ఆహార పదార్థాలను డీప్ ఫ్రై చేస్తుంటారు. దీని వల్ల టెఫ్లాన్ కోటింగ్‌తో ఉండే పాన్ విషపూరిత వాయువును విడుదల చేస్తుంది. ఆ వాయువు ఆహార పదార్థంలో కలుస్తుంది. దాన్ని తింటే మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి. ప్రత్యుత్పత్తి వ్యవస్థపై ఆ వాయువు ప్రభావం చూపుతుంది. కనుక స్టెయిన్‌లెస్ స్టీల్ లేదా ఇనుప పాత్రల్లో వండిన ఆహారాలనే తినాలి.
11. బేబీ కేర్ ప్రొడక్ట్స్
పిల్లల కుర్చీలు, ఇతర ఫర్నిచర్ వస్తువులు, కాస్మొటిక్స్‌లో హానికారక బ్రోమిన్, క్లోరిన్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి పిల్లల జననావయవాలు, వారి నాడీ మండల వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి.
12. షవర్ కర్టెయిన్స్
వీటిల్లోనూ థాలేట్స్ అనబడే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి పెద్దలు, పిల్లల మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తాయి. జ్ఞాపకశక్తి నశిస్తుంది.
13. కీటకాల స్ప్రే
ఇంట్లో బొద్దింకలు, దోమలు తదితర కీటకాలను చంపేందుకు వాడే స్ప్రేలలో హానికారక రసాయనాలు ఉంటాయి. ఎన్, ఎన్-డైఈథైల్-మెటా-టోల్యుమైడ్, సైఫ్లుథ్రిన్, పెర్‌మెథ్రిన్, పైరిత్రాయిడ్స్ అనబడే కెమికల్స్ వీటిలో ఉంటాయి. ఇవి మన నాడీ మండల వ్యవస్థపై తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపుతాయి.
14. క్యాన్డ్ ఫుడ్
క్యాన్డ్ ఫుడ్‌లో బైస్ఫినాల్ ఎ అనబడే రసాయనం ఉంటుంది. ఇది మన శరీరంలో హార్మన్లపై ప్రభావం చూపిస్తుంది. దీంతో పురుషుల్లో సంతాన లేమి సమస్యలు వస్తాయి. అలాగే గుండె జబ్బులు, డయాబెటిస్ వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది.
15. మొక్కజొన్న, సోయాబీన్
ప్రస్తుతం మొక్కజొన్న, సోయాబీన్ పంటలకు గాను జెనెటిక్‌గా మార్పులు చేయబడిన విత్తనాలను ఉపయోగిస్తున్నారు. అందువల్ల అలాంటి పంటల ద్వారా వచ్చిన మొక్కజొన్న, సోయాబీన్‌లను తింటే అవి మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి.
16. డ్రై క్లీన్ చేయబడిన దుస్తులు
దుస్తులను డ్రై క్లీనింగ్ చేసేందుకు పెర్‌క్లోరోఎథిలీన్ (పీసీఈ) అనబడే కెమికల్‌ను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ క్రమంలో డ్రై క్లీన్ చేయబడిన దుస్తులను ధరించడం వల్ల లివర్, కిడ్నీ, నాడీ వ్యవస్థ సమస్యలు వస్తాయి.
17. టీవీలు, గేమింగ్ కన్సోల్స్
వీటిల్లోనూ థాలేట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఫ్లేమ్ రిటార్డెంట్స్ ఉంటాయి. ఇవి మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తాయి.
18. డెస్క్‌టాప్ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు
డెస్క్‌టాప్ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల నుంచి పెద్ద మొత్తంలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ (ఈఎంఎఫ్) ఉత్పత్తి అవుతుంటుంది. ఇది మన శరీరానికి హాని కలిగిస్తుంది.
19. సెల్‌ఫోన్లు
Advertisements
సెల్‌ఫోన్ల నుంచి విడుదలయ్యే రేడియేషన్ వల్ల క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే వాటి తయారీకి ఉపయోగించే వస్తువుల్లో సీసం, పాదరసం, ఆర్సెనిక్, కాడ్మియం వంటి లోహాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరానికి హాని కలగజేస్తాయి.