Advertisement
అది 19 సెప్టెంబర్ 1965.. ఇండియాకు పాకిస్థాన్ కు మధ్య యుద్దం జరుగుతోంది. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి బల్వంత్ రాయ్ మెహతా అహ్మదాబాద్ నుండి ప్రత్యేక ఫ్లైట్ లో తన భార్యతో కలిసి మితాపూర్ కు బయలు దేరారు.
మితాపూర్ ఇండియా- పాకిస్థాన్ కు బోర్డర్ లో ఉన్న ప్రాంతం. ఇంకో 30 నిమిషాల్లో ఫ్లైట్ ల్యాండ్ అవుతుందనగా….. పాకిస్థాన్ యుద్ద విమానం మెహతా ప్రయాణిస్తున్న ఫ్లైట్ ను కూల్చేసింది. ఈ ఘటనలో మెహతా తో పాటు మొత్తం 7 గురు మరణించారు.
ఈ ఘటన జరిగిన చాలా రోజుల తర్వాత… పాక్ యుద్ద విమానాన్ని నడిపిన కైస్ హుస్సేన్ మెహతా ఫ్లైట్ ను నడిపి మరణించిన పైలెట్ కూతురికి ఓ లెటర్ రాశాడు. అందులో ” నన్ను క్షమించమ్మా…. యుద్ద సమయంలో పాకిస్థాన్ బోర్డర్ లోకి వస్తున్న ఇండియన్ పౌర విమానాన్ని..మా వాళ్లు పొరపాటున యుద్ద విమానంగా భావించారు, వెంటనే నాకు ఆర్డర్స్ పాస్ చేశారు. నేను ఆ విమానాన్ని పేల్చి, మీ నాన్నను బలిగొనాల్సి వచ్చింది. నన్ను క్షమించు” అని ఆ లెటర్ లో రాశారు.
Advertisement
నిజంగానే మన విమానం బోర్డర్ దాటిందా? :
లేదు…, మెహతా విమానం ఇండియన్ ఎయిర్ స్పేస్ లోనే ఉంది. పాక్ యుద్ద విమానమే 20,000 అడుగుల ఎత్తులో ఇండియన్ ఎయిర్ స్పేస్ లోకి చొచ్చుకొచ్చి మరీ మెహతా ప్రయాణిస్తున్న విమానాన్ని కూల్చేసింది.
Advertisements
రిజల్ట్ : ఇండియన్ ఆర్మీ 1965 యుద్దంలో పాకిస్థాన్ ను చిత్తుచిత్తుగా ఓడించింది. సైన్యాన్ని దేశాన్ని ధైర్యంగా నడిపించిన అప్పటి భారత ప్రధాని LB శాస్త్రి ముందు పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి ప్రాధేయపడ్డాడు.
Advertisements