Advertisement
1965 పాకిస్థాన్ తో యుద్దం ముగిసింది. వరల్డ్ కప్ లో క్రికెట్ మ్యాచ్ లో మాదిరిగానే ప్రతి యుద్దంలో పాకిస్థాన్ పై ఇండియా గెలుస్తూనే ఉంది. అయితే ఈ యుద్దం తర్వాత గాయపడిని సైనికులలో ధైర్యాన్ని నింపడానికి వారిని పరామర్శించడానికి అప్పటి ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి మిలటరీ హాస్పిటల్ కు వెళ్లారు.
Advertisement
ప్రతి ఒక్కరిని పలకరిస్తూ…ఓ మేజర్ దగ్గరకు వెళ్లాడు. డాక్టర్ అతడిని పరిచయం చేస్తూ… “చాలా గాయాలయ్యాయ్ సార్…బతకడం కష్టమ”ని చెప్పాడు. ప్రధానిని చూసిన ఆ మేజర్ కన్నీరు పెట్టుకుంటుంగా…అతడిని ఓదార్చుతూ ప్రధాని… “మేజర్ ..మీరు ప్రపంచంలోనే తెగువ, ధైర్యం గల ఇండియన్ ఆర్మీకి మేజర్ మీరు ఏడవొద్దు ధైర్యంగా ఉండాల”న్నారు.
దానికి ఆ మేజర్….”సార్ ఇవి బాధతో వచ్చే కన్నీరు కాదు , ఆనందభాష్పాలు.. నాకో కోరికుండేది… మిమ్మల్ని ప్రత్యక్షంగా కలుసుకోవాలని, సెల్యూట్ కొట్టాలని ..కానీ ప్రస్తుతం నేను సెల్యూట్ కొట్టే స్థితిలో లేను సార్” అన్నాడు …ఇప్పుడు ప్రధాని కంటి నుండి కన్నీరు ఉబికివచ్చింది.
సెల్యూట్ టు ఇండియన్ ఆర్మీ.
Advertisements
Advertisements