Advertisement
ఎలాగూ క్లాసులు జరగట్లేదు ఒకసారి పాత పుస్తకాలన్ని సర్ది నీట్ గా పెట్టుకుందాం అని..ఫోన్లో FM ఆన్ చేసి పాటలు వింటూ… బుక్ సెల్ఫ్ వైపు వెళ్లా..ఒక్కో బుక్ తీస్తూ ఉంటే..నా పాత బుక్స్ అన్ని కనపడుతున్నాయి..నేను బుక్స్ సెల్ఫ్ క్లీన్ చేస్కోక నెలలు కాదు సంవత్సరాలు గడిచిపోయిందని అర్ధం అయింది.. నాలుగేళ్ల క్రితం నా స్కూల్ డేస్ బుక్స్, అప్పట్లో నేను రాసుకున్న డైరీలన్ని కనపడ్డాయి..ఒక్కసారిగా సంతోషంతో నా కళ్లు విచ్చుకున్నాయి..
Advertisement
2016లో నేను రాసుకున్న డైరీ నా కంటబడింది.. సంతోషంగా ఓపెన్ చేసి దాన్ని చదవడం మొదలు పెట్టా..ఇంతలో డైరిలో ఏదో ఉన్నట్టు అనిపించింది.. చూస్తే 1500రూ.. ఒకటేమో 1000రూ నోటు, ఒకటి 500 నోటు..వావ్ వాటిని చూడగానే నేను యురేక అని గట్టిగా ఒక అరుపు అరిచా…నా ఆనందానికి తగ్గట్టుగా ఎఫ్ఎమ్ లో పాటవస్తుంది.. గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే అని నేను కూడా ఆనందంతో పాట పాడుతూ గాల్లో తేలుతున్నా..
Advertisements
కానీ, రెండు నిమిషాలకే నిజంగానే గుండె పేలింది..పదిహేనొందలు దొరికాయని సంతోషం మొత్తం ఆవిరైపోయింది..గాల్లో తేలుతున్నదాన్ని కాస్తా ఒక్కసారిగా నేలపైకి వచ్చా..అవి పాత నోట్లు.. నోట్ల రద్దు విషయం గుర్తొచ్చింది..నోట్లు కనపడగానే క్షణాల్లోనే ఎన్నో ఊహించేసుకున్నా.. షాపింగ్ చేయాలని, సినిమాకు వెళ్లాలని.. నా ఆశలన్ని అడియాశలయ్యాయి.. ప్చ్..ఒక్కసారిగా ఈలోకంలోకి వచ్చా..ఎఫ్ఎమ్లో పాట వినిపిస్తుంది.. అనుకున్నదొక్కటి..అయ్యిందొక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా..!
Advertisements