Advertisement
2019 లో టాలీవుడ్ పరిస్థితి మునుపెన్నడూ లేని విధంగా ఉంది . మన మార్కెట్ పెరిగిందని సంబరపడాలో పట్టుమని 10 హిట్స్ కూడా లేవని బాధపడాలో అర్ధంకాని పరిస్థితి . భారీ సినిమాల్లో ఒక్క మహర్షి తప్ప మిగతావన్నీ పరాజయం పాలవ్వడం విచారకరం . ఫైనల్ గా 2019 లో సూపర్ హిట్లుగా నిలిచిన 10 సినిమాలివే!
1. మహర్షి
100 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరుపుకున్న మహేష్ బాబు మహర్షి కి మిక్సిడ్ టాక్ వచ్చింది . ఐనా మహేష్ పెర్ఫార్మన్స్ తో 105 కోట్లు కలెక్ట్ చేసి ఈ సంవత్సరం నెంబర్ వన్ హిట్ గా నిలిచింది మహర్షి .వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా….మే 9, 2019 న రిలీజ్ అయ్యింది.
2. F2
Advertisements
32 కోట్ల ప్రి బిజినెస్ జరుపుకొని 80 కోట్ల షేర్స్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచిన మరో సినిమా F2 . అనిల్ రావిపూడి కామెడీ స్క్రిప్ట్ , వెంకటేష్ యాక్టింగ్ ఈ సినిమాను నిలెబట్టాయి. 2019 జనవరి 12 న రిలీజైన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా ఫుల్ కలెక్షన్లు వసూల్ చేసింది!
3. మజిలీ
చైతన్య, సుమంత కాంబినేషన్ కి తోడు మంచి కథా బలం కూడా తోడవడంతో …. 22 కోట్ల ప్రి బిజినెస్ చేసిన మజిలీ 39 కోట్ల షేర్ కలెక్ట్ చేసి సూపర్ హిట్టయింది. రియల్ లైఫ్ జంట రీల్ లైఫ్ లో అద్భుతంగా నటించారు.
4. ఇష్మార్ట్ శంకర్
హిట్లు లేని పూరిని మరోమారు నిలబెట్టిన మూవీ ఇస్మార్ట్ శంకర్.! రామ్ ను డిఫరెంట్ గా చూపుతూ తీసిన ఈ మూవీ….. 20 కోట్ల ప్రి బిజినెస్ చేసి, 38 కోట్లు కలెక్ట్ చేసి మంచి విజయం సాధించింది. ఆడియో ఆల్బమ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది
5. ప్రతిరోజు పండగే
Advertisement
ఫస్ట్ డే యావరేజ్ టాక్ సొంతం చేసుకొని … . క్రమ క్రమంగా సూపర్ హిట్ దిశగా దూసుకువెళ్లిన చిత్రం ప్రతిరోజు పండగే . 20 కోట్ల ప్రి బిజినెస్ చేసిన ఈ సినిమా హిట్ గా నిలిచింది .
6. జెర్సీ
క్రికెట్ నేపథ్యంలో నాని హీరోగా తెరకెక్కిన చిత్రం జెర్సీ.! 23 కోట్ల ప్రి బిజినెస్ చేసిన ఈ సినిమా ….. 28.2 కోట్లు షేర్ కలెక్ట్ చేసి హిట్ గా నిలిచింది.
7. ఓ బేబి
10 కోట్ల ప్రి బిజినెస్ చేసిన ఈ సినిమా . 18 కోట్ల షేర్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టరై సమంత కెరీయర్లో బెస్ట్ మూవీగా నిలిచింది .
8. చిత్రాలహరి
నిజానికి పెద్ద హిట్ అవ్వాల్సిన సినిమా సాయి ధరమ్ తేజ్ చిత్రాలహరి . 14 కోట్లకు అమ్ముడుపోయిన ఈ సినిమా 15 కోట్లు వసూల్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలబడింది .
9. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ
జస్ట్ 3 కోట్ల ప్రి బిజినెస్ చేసిన ఈ సినిమా సర్ప్రైజ్ హిట్ అయింది . చిన్న సినిమాగా రిలీజై దాదాపు 10 కోట్ల వరకు వసూల్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది
10. 118
కళ్యాణ్ రామ్ డిఫ్రెంట్ థ్రిల్లర్ మూవీ 118. ఈ సినిమా 10 కోట్లకు అమ్ముడుపోయి , 11 కోట్లు కలెక్ట్ చేసి హిట్ గా నిలిచింది .
Advertisements