Advertisement
భారతదేశం భిన్న రాష్ట్రాలు, సంస్కృతుల సమ్మేళనం. ఒక్కో రాష్ట్రంలో మనకు ఒక్కో రకమైన సంప్రదాయం, ఆచార వ్యవహారాలు కనిపిస్తాయి. అందుకు అనుగుణంగానే ఆయా రాష్ట్రాల ప్రజలు తీసుకునే ఆహారాలు కూడా వేరుగా ఉంటాయి. ఇక స్వీట్ల విషయానికి వస్తే.. ఒక్కో ప్రాంతం ఒక్కో రకమైన స్వీట్‌కు పేరుగాంచింది. ఈ క్రమంలోనే దేశంలోని పలు ప్రాంతాల్లో మనకు లభించే ముఖ్యమైన స్వీట్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. తెలంగాణ – కుబానీ కా మీఠా
యాప్రికాట్లతో వేసి తయారు చేసే ఈ స్వీట్ అంటే చాలా మందికి ఇష్టం. అలాగే ఏపీలో తిరుపతి లడ్డూ, పూతరేకులు, అరిసెలు, కరిజలను ఎక్కువగా తింటారు.
Advertisements
2. అస్సాం – నారికోల్ లడ్డూ
కొబ్బరితో తయారు చేసే తీపి వంటకం. కొబ్బరి, చక్కెరలను కలిపి ఉండలుగా చుట్టి తయారు చేస్తారు. ఇది ఎంతో తియ్యగా ఉంటుంది.
3. బీహార్ – ఖాజా
బీహార్‌లో తయారయ్యే ఖాజా స్వీట్ ఎంతగానో పేరుగాంచింది.
4. గోవా బెబింకా
16 రకాల పొరలుగా దీన్ని తయారు చేస్తారు. ఇది అక్కడి సంప్రదాయ పడ్డింగ్ వంటకం.
5. గుజరాత్ – బాసుంది
కుంకుమ పువ్వు, డ్రై ఫ్రూట్స్, పాలతో దీన్ని తయారు చేస్తారు. అత్యంత రుచిగా ఉంటుంది.
6. పశ్చిమ బెంగాల్ – రసగుల్ల
తియ్యగా, స్పాంజిలా ఉండే వెస్ట్ బెంగాల్ రసగుల్ల అంటే చాలా మందికి ఇష్టం.
7. ఉత్తర ప్రదేశ్ – బలుషాహి
చక్కెర పాకం, పిండితో ఈ వంటకాన్ని తయారు చేస్తారు. అందువల్ల ఇది అత్యంత తీపిని కలిగి ఉంటుంది.
8. కర్ణాటక – మైసూర్‌పాక్
వెన్న, శనగపిండిలతో తయారు చేసే కర్ణాటక మైసూర్‌పాక్‌ను చాలా మంది ఇష్టంగా తింటారు.
9. కేరళ – ఇళయప్పం
ఆవిరితో ఈ వంటకాన్ని తయారు చేసి అరటి ఆకుల్లో వడ్డిస్తారు. భలే రుచిగా ఉంటుంది.
10. మధ్యప్రదేశ్ – మావాబతి
మధ్యప్రదేశ్ లో ఈ వంటకం చాలా ఫేమస్. ఎంతో తియ్యని రుచిని కలిగి ఉంటుంది.
11. మహారాష్ట్ర – మోదక్
గణేష్ ఉత్సవాల సమయంలో మహారాష్ట్రలో ఈ వంటకాన్ని ఎక్కువగా ఆరగిస్తారు.
12. ఒడిశా – చెనా పొడా
Advertisement
ఈ వంటకం ఒడిశాలో ఎంతో పేరుగాంచింది. ఎంతో రుచిగా కూడా ఉంటుంది.
13. తమిళనాడు – పొంగల్
బియ్యం, బెల్లంతో కలిపి ఈ వంటకాన్ని తమిళనాడులో వండుతారు. భలే రుచిగా ఉంటుంది.
14. రాజస్థాన్ – గెవర్
రాజస్థాన్‌లో చాలా మంది ఈ వంటకాన్ని ఎంతో ఇష్టంగా తింటారు.
15. మణిపూర్ – చఖావో ఖీర్
బియ్యం, పాలను కలిపి ఈ వంటకాన్ని తయారు చేస్తారు. ఎంతో రుచిగా ఉంటుంది.
16. పంజాబ్ – పిన్ని
పంజాబ్‌లో చలికాలంలో ఈ వంటకాన్ని ఎక్కువగా తింటారు.
17. హర్యానా – గోండ్ కే లడ్డూ
హర్యానాలో ఈ వంటకం చాలా ఫేమస్. ఎంతో ఇష్టంగా దీన్ని అక్కడ తింటారు.
18. ఉత్తరాఖండ్ – బాల్ మిఠాయి
ఉత్తరాఖండ్‌లో ఈ వంటకాన్ని ఎంతో మంది ఇష్టంగా తింటారు.
19. సిక్కిం – సేల్ రోటీ
దీన్ని సిక్కిం వాసులు ఎంతో ఇష్టంగా తింటారు.
20. హిమాచల్ ప్రదేశ్ – బబ్రూ
పిండి, చక్కెరతో కలిపి తయారు చేసే ఈ వంటకం అక్కడ చాలా ఫేమస్.
21. జమ్మూ, కాశ్మీర్ – షుఫ్తా
ఈ వంటకంలో డ్రై ఫ్రూట్స్ ను ఎక్కువగా వేస్తారు. అందువల్ల ఈ స్వీట్ చాలా రుచికరంగా ఉంటుంది.
22. జార్ఖండ్ – అనర్స
నువ్వులు, జీడిపప్పులను బాగా వేసి ఈ వంటకాన్ని తయారు చేస్తారు. రుచిగా ఉంటుంది.
23. నాగాలాండ్ – కోట్ పిఠా
పిండిని రోల్స్ లా చేసి డీప్ ఫ్రై చేసి ఈ వంటకాన్ని తయారు చేస్తారు.
24. మిజోరాం – చంగ్‌బన్ లెహ్ కుర్తాయ్
మిజోరాం వాసులు ఈ వంటకాన్ని ఎంతో ఇష్టంగా తింటారు.
25. అరుణాచల్ ప్రదేశ్ – ఖాప్సే
ఇది నిజానికి ఓ బిస్కెట్. ఆ రాష్ట్ర వాసులు దీన్ని ఇష్టంగా తింటారు. దీని వల్ల ఎంతో శక్తి లభిస్తుంది.
26. మేఘాలయ – పుఖ్‌లెయిన్
బియ్యం, బెల్లంతో ఈ స్వీట్‌ను తయారు చేస్తారు. దీన్ని బ్రేక్‌ఫాస్ట్ రూపంలో తీసుకుంటారు. రుచిగా ఉంటుంది.
Advertisements