Advertisement
నా పెద్ద కొడుకు 3ఏళ్లప్పుడు నేను మళ్లీ ప్రెగ్నెంట్ అయ్యాను.. నా కడుపు పెరిగే కొద్ది పొట్టలోపల పెరుగుతున్న బేబి గురించి మా బాబుకి ఆసక్తి ఎక్కువైంది.. రోజు ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడు..వాడు మొదటి సారి నన్ను అడిగిన ప్రశ్న అమ్మా, మీరు బేబిని తిన్నారా?? నేను అవాక్కయ్యాను..లేదు నాన్నా అని సమాధానమిచ్చా..మరి మీ బొజ్జలోకి చిన్నపాప ఎలా వచ్చింది.. సమాధానం చెప్పేవరకు వదలడని అర్దం అయింది..
సో, పునరుత్పత్తి గురించి లైట్ గా వివరించాలనుకున్నాను.. నా పొట్ట లోపల యుటెరస్(గర్భాశయం) ఉంటుంది..అందులో గుడ్డు ఉంటుంది…అది పెరుగుతూ పెరుగుతూ చిన్నపాప అవుతుంది అని చెప్పాను.. వాడు అక్కడితో ఆపుతాడనుకున్నాను..కానీ డెలివరి గురించి ప్రశ్నవేసాడు.. సెక్స్,స్పెర్స్ లాంటి విషయాలు ఆ ఏజ్ కి చెప్పడం సరికాదని, చెప్పినా వాడికి అర్దం కాదని గుడ్డు పెరిగి బేబి అవుతుంది,బేబిని డాక్టర్స్ బయటకి తీస్తారు అని చెప్పి ఊరుకున్నాను..
Advertisement
కొన్ని రోజుల తరువాత మరో ప్రశ్న సంధించాడు.. అమ్మా, నేను పెద్దయ్యాక నీలా అమ్మని కావొచ్చా? అని.. వాన్ని దగ్గరకు తీసుకుని, “లేదు నాన్నా, నీ పొట్ట లోపల గర్బాషయం లేదు కదా, సో గుడ్డు కూడా ఉండదు.. అమ్మవి కాలేవు, కానీ నాన్నవి కావొచ్చు” అని చెప్పాను..దానికి వాడు కళ్లు పెద్దవి చేసి నాన్న అవొచ్చా. నాన్న పనేంటి అని అడిగాడు.. “బేబి రెడీ కావాలంటే ఒన్ ఎగ్ సరిపోదు, మరో ఎగ్ కావాలి అది అందించడమే నాన్న పని,..అమ్మ పొట్టలో నాన్న ఆ ఎగ్ పెడితే, టూ ఎగ్స్ కలిసి బేబి అవుతుంది అని చెప్పాను.. దాంతో ఆ క్వశ్చన్స్ పర్వం ముగిసింది.
నాకు నెలలు నిండుతున్నాయి.. పనులు చేస్కోలేకపోతున్నాను..అలసట, బాడిపెయిన్స్ ఉండేవి..వాటన్నింటిని చూసి నా కొడుకు బాధపడేవాడు, తనకు తోచిన చిన్నచిన్న హెల్ప్స్ చేయడానికి ప్రయత్నించేవాడు..వాడు నాపై చూపించే ప్రేమకి చాలా అబ్బురంగా ఉండేది..ఒకరోజు తలనొప్పితో పడుకున్నాను.. “ అమ్మా ఇదేం బాగలేదు, నాన్న మీ కడుపులో బేబిని ఉంచాడు, నాన్న మాత్రం హెల్తీగా ఉన్నారు, నువ్ మాత్రం పెయిన్ తో బాధపడుతున్నావ్, నాకు నచ్చలేదు” అన్నాడు..వాడి మాటలకు నేను మా హబ్బి ఇద్దరం నవ్వుకున్నాం..!
Advertisements
పిల్లలనుండి ఇలాంటి ప్రశ్నలను ప్రతి తల్లిదండ్రులు ఎదుర్కొంటూ ఉంటారు.. దాంతో పేరెంట్స్ ఎక్కడ సెక్స్ గురించి చెప్పాల్సి వస్తుందో అని భయపడిపోయి సమాధానం చెప్పకుండా దాటవేస్తుంటారు..మనం అలా సమాధానం చెప్పకపోతే వాళ్లకి తెలుసుకోవాలనే క్యూరియాసిటి పెరిగిపోతుంది.. మనం చెప్పనప్పుడు బయటివాళ్లనుండి తెలుసుకోవాలనుకుంటారు..కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలా చిన్నచిన్న సమాధానాలు చెప్పగలిగితే బెటర్..పెరుగుతున్న కొద్ది వారికి విషయాల పట్ల అవగాహన కల్పిస్తే బాగుంటుంది..ఏమంటారు?
Advertisements