Advertisement
అది 1794. మైసూర్ రాజు టిప్పు సుల్తాన్ కు బ్రిటీషర్స్ కు మద్య మూడవ మైసూర్ యుద్దం జరుగుతున్న రోజులు…. బ్రిటీష్ సైనికులకు ఆహార వస్తువులను తీసుకొని ఓ బండి వెళుతుంది. టిప్పు సైనికులు ఆ బండి నడిపేవాడిని పట్టుకొని రాజు దగ్గరికి తీసుకొచ్చారు. శత్రువులకు సహాయం చేయడం నేరంగా పరిగణించి…అతడి ముక్కును కోసేయమని ఆర్డర్ వేశాడు రాజు … అతని ముక్కు తెగింది.! అతని పేరు కోసాజి.!
యుద్దం ముగిసింది. బ్రిటీషర్స్ చేతిలో టిప్పు ఓడిపోయాడు… కోసాజి దగ్గరికి ఓ బ్రిటీష్ వైద్యుడు వచ్చి ట్రీట్మెంట్ చేయబోతే…కోసాజి అతడిని వారించి తనను కుమార్ అనే ఆయుర్వేద వైద్యుడి వద్దకు తీసుకెళ్లమన్నాడు. అందరూ అతనికి నచ్చజెప్పినప్పటికీ అతను వినకుండా..కుమార్ దగ్గరకు వెళ్లాడు.
Advertisement
కుమార్…కోసాజి నుదుటి మీది చర్మాన్ని తీసి…తెగిన ముక్కును అతికించి కుట్లు వేశాడు. కొన్ని రోజుల తర్వాత నుదుటి చర్మం నార్మల్ అయ్యింది. ముక్కు కూడా సెట్ అయ్యింది!ఈ సమాచారం తెల్సుకున్న డాక్టర్…కుమార్ గురించి బ్రిటన్ లో ఉన్న జోసెఫ్ అనే డాక్టర్ కు చెప్పాడు. జోసెఫ్ హుటాహుటిన లండన్ నుండి ఇండియా వచ్చి….కుమార్ వద్ద ఆ విద్యను నేర్చుకొని బ్రిటన్ వెళ్లాడు.

బ్రిటన్ మ్యూజియంలో కోసాజి వివరాలను తెలుపుతూ గీసిన పెయింటింగ్.!
కుమార్ కు ఆ విద్య ఎలా వచ్చిందంటే…25000 సంవత్సరాల క్రితం శుశ్రుతుడు రాసిన శుశ్రు సంహిత పుస్తకం నుండి.! శుశ్రు సంహిత లో ఈ ఫ్లాస్టిక్ సర్జరీ గురించి వివరించబడింది.! దాన్ని ఫాలో అయ్యి కుమార్ కోసాజీ ముక్కును అతికించాడు.. బ్రిటీష్ వాళ్లు ఆ టెక్నాలజీని తర్వాత మరింత డెవలప్ చేశారు.!
Advertisements
Advertisements