Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

9 అడుగుల శివ‌లింగానికి 35 ఏళ్లుగా పూజ‌లు…నిజ‌మైన‌ బాహుబ‌లి ఈ 84 ఏళ్ళ పూజారి.!

Advertisement

క‌ర్నాట‌క‌లోని హంపిలో విజ‌య‌న‌గ‌ర‌రాజులు ప్ర‌తిష్టించిన ఈ 9 అడుగుల శివ‌లింగం.. బ‌హుమని సుల్తానుల దాడి త‌ర్వాత పూజ‌ల‌కు నోచుకోకుండా అయ్యింది. 450 సంవ‌త్స‌రాల త‌ర్వాత మ‌ళ్లీ 1980 ఈ శివ‌లింగానికి పూజ‌లు పున ప్రారంభ‌య్యాయి. 35 ఏళ్లుగా ఇదిగో ఈ ఫోటోలో క‌నిపిస్తున్న పూజారే ఈ శివ‌లింగానికి పూజ‌లు నిర్వ‌హిస్తున్నాడు.

9 అడుగుల ఆ లింగాన్ని శుభ్రం చేయ‌డ‌మే గాక‌…. 84 ఏళ్ళ వ‌య‌స్సులో శివుడుకి నిత్య అభిషేకాలు నిర్వ‌హిస్తున్నాడు.
దీనికి గాను ఏడాదికి రెండు సార్లు మాత్ర‌మే అత‌నికి జీతం ల‌భిస్తుంది. అయినా డ‌బ్బుపై ఆస‌క్తితో కాకుండా…దేవుడిపై భ‌క్తితో ఈ ప‌ని చేస్తూనే ఉన్నాడు .

Advertisement

ఈయ‌న ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ్వ‌గా… ఇత‌ని దేహ‌ధారుడ్యాన్ని చూసి ఇత‌నే అస‌లైన బాహుబ‌లి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisements

Advertisements