Advertisement
సెక్షన్ 498A (గృహహింస నిరోధక చట్టం)..మహిళలకు ఒక రక్షణ కవచంగా చెప్పవచ్చు.. at the same time అమాయక మగవారి పట్ల ఈ చట్టం శాపంగా మారిందని..దీనివలన లాభపడిన మహిళలకంటే.. నష్టపోయిన మగవారే ఎక్కువ అని భావిస్తూ ఉంటారు.. అసలు ఈ చట్టం ఉద్దేశ్యం ఏంటి?? దీనివలన నిజంగానే న్యాయం జరిగిన మహిళలు ఎంతమంది? మగవారి తప్పు లేకపోయినా ఇబ్బందులు పడుతున్నారా లాంటి వివరాలు చూద్దాం..
గృహహింస నిరోధక చట్టం అంటే కేవలం ఓ భార్య తన భర్త పైన వేసే కేస్ గానే చాలామంది చూస్తారు..కానీ ఈ చట్టం ప్రకారం ఏ ఆడవాళ్లైనా (కోడలు, కూతురు, అత్త) కేసువేయవచ్చు..గృహంలో జరిగే హింస అది ఎవరు ఎవరి నుండి ఎదుర్కొంటున్నా కేసు పెట్టే అవకాశం ఉంటుంది.
- కోడలు…. భర్త, అత్తింటి(అత్త,మామ, ఆడపడుచు) కుటుంబంపై వేయవచ్చు
- ఒక ఆడపిల్ల తన ఇంట్లో హింసను ఎదుర్కుంటున్నట్టైతే ఈ కేస్ పెట్టవచ్చు
- ఒకవేళ కోడలి చేతిలో అత్త ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టైతే అత్తలు కూడా 498A వేయవచ్చు
- సీనియర్ సిటిజన్స్ (తల్లిదండ్రి,అత్తమామ) ను ఇంట్లో వారు కష్టపెడితే ఈ చట్టం ద్వారా కేస్ పెట్టవచ్చు.
తమపై వేధింపులు జరిగాయి అని మహిళలు కేసు పెట్టగానే సరిపోదు..అది ప్రూవ్ చేస్కోవాల్సిన బాధ్యత వారిపైనే ఉంటుంది.. కాబట్టి ఈ రోజు ఇంట్లో మీరు హింస ఎదుర్కొన్నాక రెండు రోజుల తర్వాత తీరిగ్గా వెళ్లి కేసు పెడతామంటే కుదరదు.. మహిళల ఒంటిపై గాయాలున్నప్పుడు ఆ కేసు తీవ్రత వేరేగా ఉంటుంది..ఇలాంటి సంధర్బంలో 41A సిఆర్పిసి నోటీస్ ఇవ్వకుండానే అరెస్ట్ చేసే హక్కు పోలీసులకు ఉంటుంది..
Advertisement
- కేసు పెట్టాక ముందుగా వారికి కౌన్సిలింగ్ ఇస్తారు..ఇవ్వాలి .. రెండు మూడు సార్లు కౌన్సిలింగ్ తర్వాత కూడా ఎటువంటి మార్పు రాకపోతే అప్పుడు FIR ఫైల్ చేస్తారు.
- తర్వాత 41A సిఆర్పిసి నోటీస్ ఇచ్చి రెండు వారాల గడువు తర్వాత మాత్రమే అరెస్ట్ చేసే వీలుంటుంది..అది కూడా నిజంగా హింస జరుగుతుంది అని నిర్దారణ జరిగాక మాత్రమే.
- 498A అనేది నాన్ బెయిలబుల్ కేస్..అయినప్పటికి స్టేషన్ బెయిల్ మంజూరు చేస్తారు, యాంటిసిపిరేటరి బెయిల్, నాట్ టు అరెస్ట్ బెయిల్స్ తెచ్చుకునే అవకాశం కూడా ఉంది.
సెక్షన్ 498A దుర్వినియోగం అవుతుందా??
Advertisements
మగవారు ఈ సెక్షన్ వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే వాదన వినిపిస్తూ ఉంటుంది.. చట్టం వచ్చిన కొత్తలో కొందరు ఇబ్బంది పడిన మాట వాస్తవమే కానీ,తర్వాత సుప్రిం కోర్టు ఈ చట్టంలో మార్పులు తీసుకొచ్చింది. 498A కేసు పెట్టగానే పోలీసులు ఒక నిర్ణయానికి రావడానికి వీలు లేదని..దానిపై సమగ్ర దర్యాప్తు జరిగిన తర్వాతే పోలీసులు చర్య తీసుకునే అవకాశం కల్పించింది..ఒకవేళ తప్పుడు కేసు పెట్టారని ప్రూవ్ అయితే కేసు పెట్టిన వారికి శిక్ష పడుతుంది..దీన్ని సాక్ష్యంగా చూపుతూ భార్య నుండి విడాకులు పొందే హక్కు కూడా భర్తకు ఉంది.
గమనించాల్సిన విషయం:
దుర్వినియోగం అవుతుందనేది పూర్తి వాస్తవం కాదు. అంత కంటే పెద్ద నిజం “ఈ సెక్షన్ ప్రకారం శిక్షలు పడే శాతం చాలా తక్కువ”..మహిళలపై దాడులు జరిగే ఘటనలు రోజు వందల సంఖ్యలో చూస్తూ ఉంటాం…మన చుట్టూనే చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి..కానీ ఈ చట్టాన్ని ఆయుధంగా వాడుకునే మహిళలు అరుదు..ఒకవేళ ఎవరైనా దురుద్దేశంతో కేసు పెట్టినా సరే , అది నిర్దారణ జరగాలి.. కాబట్టి తప్పుడు కేసులు పెట్టడంతో అసలు మహిళలపై హింస జరగకుండానే దుర్వినియోగం అవుతున్నాయి అనే నిర్దారణకు రావడం సరికాదు..
ప్రతి చట్టంలో లొసుగులు ఉంటాయి..వాటిని దుర్వినియోగం చేస్తూనే ఉంటారు..కానీ కేవలం 498A విషయంలోనే ఎక్కువగా దుర్వినియోగం అవుతుందనే కామెంట్ వినిపిస్తూ ఉంటుంది… నిజంగా మార్పు కోరుకుంటే హింసను ఎదుర్కొంటున్న మహిళలు దీన్ని వినియోగించుకునేలా చేయగలగాలి..అసలు హింసే ఎదుర్కోకుండా చేయగలిగితే మరీ మంచిది!
Advertisements