Advertisement
ఆ 5గురు…టీమిండియా తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు కానీ ఈ IPL లో మాత్రం తమ సత్తా చాటుతున్నారు. టీమ్ ఇండియా సెలెక్టర్లకు గట్టి సవాల్ విసురుతున్నారు. వీరు ఇలాగే ఆడితే ఏడాది తిరిగే లోపు వీరిని టీమ్ ఇండియా జట్టులో ఖచ్చితంగా చూస్తాం.! ఇంతకీ ఆ ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం!
1. దేవదత్ పడికల్
RCB ఒపెనర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న 20 ఏళ్ల కుర్రాడే దేవదత్ పడికల్……ఇప్పటి వరకు తానాడిన 14 మ్యాచుల్లో ఐదు ఆఫ్ సెంచరీలు చేసి , 33.71 యావరేజ్ తో 472 రన్స్ చేశాడు. అతను ప్రస్తుతం ఒకే IPL సీజన్లో ఎక్కువ రన్స్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ లో మూడవ స్థానంలో ఉన్నాడు . గతంలో షాన్ మార్ష్ IPL 2008 లో 616 రన్స్ చేయగా , సూర్యకుమార్ యాదవ్ 2018 లో 512 రన్స్ చేసాడు. అంతే కాదు పడికల్ తన IPL తొలి సీజన్లో 400 పరుగులు సాధించిన నాలుగవ ఇండియన్ ప్లేయర్!
2. సూర్య కుమార్ యాదవ్
Advertisements
సూర్యకుమార్ యాదవ్ 2018 IPLలో 512 పరుగులు చేశాడు..ఈ సీజన్ లో కూడా ఇప్పటికే 410 రన్స్ స్కోర్ చేసాడు ఇందులో 3 హాప్ సెంచరీలున్నాయ్..స్ట్రైక్ రేట్ 150+. RCBతో మ్యాచ్ లో 43 బాల్స్ లో 79 రన్స్ చేసి ఒంటిచేత్తో మ్యాచ్ ను గెలిపించాడు.
Advertisement
3. టి నటరాజన్
SRH తురుపుముక్క నట్టు… భువి రెస్ట్ తో టీమ్ లోకి వచ్చిన నటరాజన్ ఖచ్చితమైన యార్కర్లు బౌన్సర్లతో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు 14 వికెట్లే తీసినప్పటికీ అతని బౌలింగ్ యాక్షన్ , బాల్ డెలివరీ అద్భుతంగా ఉంటాయి. ఆస్ట్రేలియా టూర్ లో నట్టును నెట్ బౌలర్ గా సెలెక్ట్ చేశారు.
4. ఇషాన్ కిషన్
చూడడానికి చిన్నగా ఉన్నా…..సిక్సులు కొడితే గ్రౌండ్ బయటే….. రోహిత్ ప్లేస్ లో ఒపెనర్ గా మంచి ప్రదర్శన కనబరుస్తున్న 22 ఏళ్ళ ఇషాన్ కిషన్ ….ఇప్పటి వరకు తానాడిని 12 మ్యాచ్‌ల్లో 42.55 సగటుతో 428 పరుగులు చేశాడు, ఇందులో రెండు హాప్ సెంచరీలున్నాయి.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై ఇతను చేసిన 99 పరుగులు హైలెట్!
5. రాహుల్ తెవాటియా
ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ పరువును నిలబెట్టింది తెవాటియానే….టీమ్ ఓడిపోయే మూడు మ్యాచ్ లను మలుపు తిప్పాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పై ఓకే ఓవర్లో 5 సిక్సులు హైలెట్…. హార్డ్ హిట్టర్ గా, లెగ్ స్పిన్నర్ గా ఇండియన్ టీమ్ కు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెవాటియా బ్యాటింగ్ లో 255 రన్స్ చేసి , బౌలింగ్ లో 10 వికెట్లు పడగొట్టాడు
Advertisements