Advertisement
కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. చైనాకు చెందిన 59 యాప్‌లపై దేశంలో నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఆ యాప్‌లో టిక్‌టాక్, షేరిట్, యూసీ బ్రౌజర్, వీ చాట్ వంటివి ఉన్నాయి. చైనాతో తాజాగా నెలకొన్న సరిహద్దు వివాదం కారణంగా భారత్ ఈ యాప్‌లపై నిషేధం విధించింది. అయినప్పటికీ దేశ ప్రజల రక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం వెల్లడించింది.
భారత్‌లో నిషేధించబడిన 59 చైనా యాప్‌ల జాబితా ఇదే…
Advertisement
Advertisements
కాగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 69ఎ ప్రకారం సదరు 59 యాప్‌లను నిషేధించామని ప్రభుత్వం తెలిపింది. దేశంలో ఉన్న 130 కోట్ల మంది భారతీయుల డేటాను సురక్షితంగా ఉంచడం కోసమే ఈ యాప్‌లను నిషేధించామని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ప్రజల డేటాకు రక్షణ కల్పించడంతోపాటు వారి సమాచారానికి గోప్యతను పెంచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది.
Advertisements
ఇక ఈ యాప్స్‌లో చాలా వరకు యాప్స్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండు ప్లాట్‌ఫాంలపై భారత్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో రెండు ప్లాట్‌ఫాంలలో ఉన్న ఈ యాప్‌లు అన్నింటినీ నిషేధించారు. ఈ యాప్‌లు వినియోగదారుల డేటాను తస్కరిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయని కూడా కేంద్రం తెలియజేసింది.