Advertisement
రాంచరణ్ హీరోగా చేసిన ఆరెంజ్ మూవీ ఎప్పుడు చూసినా చాలా అద్భుతంగా అనిపిస్తుంది … మంచి కథ , స్క్రీన్ ప్లే , హీరో క్యారెక్టర్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి . అయినా ఆ సినిమా ఎందుకు ప్లాప్ అయ్యిందో అర్థం కాదు . ఒక కల్ట్ క్లాసిక్ గా మిగిలిపోయిన ఆరెంజ్ సినిమా కమర్షియల్ గా హిట్ కాలేకపోవడానికి 6 కారణాలున్నాయి అవేంటో చూద్దాం.
మగధీర ప్రభావం:
ఆరెంజ్ కంటే ముందు రామ్ చరణ్ మగధీర రిలీజై…..సౌతిండియాలో అత్యధిక వసూళ్లు చేసిన రెండవ చిత్రంగా నిలిచింది. అలాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆడియన్స్ రామ్ చరణ్ నుండి అలాంటి కమర్షియల్ మూవీనే ఎక్స్ పెక్ట్ చేస్తారు…కానీ ఆరెంజ్ ఫుల్లీ క్లాసిక్ మూవీ ఆ ఎక్సెపెక్టేషన్స్ తో థియేటర్లకు వెళ్లిన ఆడియన్స్ ఈ కథకు కనెక్ట్ అవ్వలేకపోయారు. వెంటనే నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయిపోయింది.
పదేళ్ల తర్వాత రావాల్సిన కథ:
Advertisements
Advertisement
నిజంగా చెప్పాలంటే ఆరెంజ్ కథ 2010 లో రిలీజ్ అవ్వాల్సిన కథ కాదు….2020 తర్వాత రిలీజైతే బ్లాక్ బస్టర్ అయ్యేది. కారణం జనాల మెచ్యూరిటీ లెవల్ లో మార్పు.! ప్రేమ అంటే ఒక్కరిపైనే అనే ఫిక్స్ డ్ మైండ్ సెట్ నుండి జనాలు ఇంకా బయటికి రాలేకపోవడంతో సినిమా రాంగ్ రూట్ లో వెళుతుందనే భావనతో చాలా మంది నెగెటివ్ కామెంట్స్ చేశారు.
బడ్జెట్ :
యాక్షన్ మూవీ కాదు కాబట్టి బడ్జెట్ ను ఇంకాస్త కంట్రోల్ లో పెట్టాల్సింది. ఈ సినిమాకు అప్పుడే 40 కోట్ల మేరకు ఖర్చు చేశారట…. ఓ ప్లాన్ ప్రకారం తీస్తే 20 కోట్లలోనే సినిమా అయిపోయేది.
మ్యూజిక్:
ఈ సినిమా ఆల్బమ్ సూపర్ హిట్ అయ్యింది. దీంతో సినిమాపై అంచనాలు ఇంకా పీక్స్ లోకి వెళ్లాయి. పాటలతో పోల్చితే సినిమా అంతగా జనాలకు ఎక్కలేదు. అందుకే ఇది కూడా ఓ కారణమైంది.
పబ్లిసిటి:
సినిమా ప్రమోషన్ కూడా యాక్షన్ అడ్వెంచర్ అనే థీమ్ లోనే సాగింది. అందుకే జనాలు యాక్షన్ మూవీ అని ఫిక్స్ అయిపోయారు. సడెన్ గా కథవేరేలా ఉండడంతో జీర్ణించుకోలేకపోయారు.
పెద్ద సినిమాలన్నీ రిలీజవ్వడం:
Advertisements
ఈ సినిమా ఎక్కువ రోజులు ఆడకపోవడానికి కారణం 2010లో దాదాపు ప్రతి పెద్ద హీరోల సినిమాలు రిలీజయ్యాయి. బృందావనం, ఖలేజా, రక్తచరిత్ర, నాగవల్లి, రగడ ఈచిత్రాల ప్రభావం కూడా ఆరెంజ్ పై పడింది.