Advertisement
సినిమాలు థియేటర్లో రిలీజ్ అయ్యే వరకు నమ్మకం ఉండదు.! మద్యలోనే బడ్జెట్ కారణంగా నిర్మాతలు చేతులెత్తేయొచ్చు., హీరోకి డైరెక్టర్ కి పడకపోవడం, డేట్స్ కుదరకపోవడం ఇలా రకరకాల కారణాల రీత్యా అనేక సినిమాలు షూటింగ్ మద్యలోనే ఆగిపోతుంటాయి. లెక్కలేనన్ని చిన్న సినిమాలు థియేటర్ కు రాకుముందే ప్యాకప్ అయిపోతుంటాయి. అలాగే కొన్ని పెద్ద హీరోల సినిమాలు కూడా మద్యలోనే ఆగిపోయాయి. అలా ఆగిన సినిమాలేంటి…వాటి వెనుక కారణాలేంటో తెలుసుకుందాం!
1. నర్తనశాల
నందమూరి బాలక్రిష్ణ 2003 లో మొట్టమొదటి సారి దర్శకుడుగా నర్తనశాల అనే సినిమా మొదలుపెట్టారు. అందులో అర్జునుడి పాత్రలో బాలయ్య , భీముడు పాత్రలో శ్రీహరి , ద్రౌపతిగా సౌందర్యని అనుకున్నారు సినిమా షూటింగ్ కూడా సగం వరకు పూర్తైంది….. కానీ 2004 లో సౌందర్య హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోవడంతో షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఇటీవల అదే సినిమా రష్ ఫీడ్ ను కాస్త ఎడిట్ చేసి ఓటీటీలో విడుదల చేశారు. వీలైతే ఓ సారి చూడండి.
2.అబూ బాగ్దాద్ గజదొంగ
Advertisements
సురేష్ క్రిష్ణ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఈ సినిమాని హాలీవుడ్ రేంజ్ లో తీయాలని ప్లాన్ చేశారు.! ఒక మతాన్ని అవమానించారంటూ పెద్ద గొడవ అవ్వడంతో ఈ సినిమాని మద్యలోనే ఆపేశారు.
3. సత్యాగ్రహి
పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో తానే హీరోగా ఈ సినిమాని 2006 లో స్టార్ట్ చేశారు . ఏ ఎమ్ రత్నం ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి ఒప్పుకున్నాడు . సంగీత దర్శకుడిగా ఏ ఆర్ రెహమాన్ ని అనుకున్నారు . కానీ తెలియని కారణాల వల్ల ఈ సినిమా మొదట్లోనే ఆగిపోయింది.
Advertisement
4. వినాలని వుంది
రాంగోపాల్ వర్మ , చిరంజీవి కాంబోలో ఒక సినిమా మొదలు పెట్టారు . కొంత సినిమా షూటింగ్ కూడా జరిగింది. అసలు చిరంజీవి లాంటి హీరో వర్మ లాంటి డైరెక్టర్ కాంబినేషన్లో వచ్చే సినిమా ఎలా ఉంటుందో చూడాలని చాలామంది ఫ్యాన్స్ ఎదురుచూశారు. కానీ ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆపేశారు . ఈ సినిమాకి వినాలని వుంది అని పేరు పెట్టి పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు . ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు ఆ పాట ఇప్పటికీ యూట్యూబ్ లో ఉంది .
5. భూలోక వీరుడు
జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా తర్వాత డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ భూలోక వీరుడు అనే పేరుతో చిరంజీవి హీరోగా ఒక సినిమా స్టార్ట్ చేసాడు . ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట అయ్యింది . కానీ చివర్లో ఔట్ పుట్ బాలేదని చిరంజీవి అనడంతో ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు.
6.మెరుపు
పవన్ కళ్యాణ్ తో బంగారం సినిమా తీసిన ధరణి దర్శకత్వంలో రాంచరణ్ , కాజల్ కలిసి మెరుపు అనే సినిమా మొదలు పెట్టారు . ఇందులో రాంచరణ్ ఒక ఫుట్ బాల్ ఆటగాడు. ఈ సినిమా మొదలు పెట్టాక చెన్నైలో కొన్ని సీన్స్ కూడా షూట్ చేసారు . ఐతే 2010 సంవత్సరంలోనే సినిమా బడ్జెట్ 35 కోట్లు దాటిపోతుందని తెలియగానే ఈ సినిమా నిర్మాతలు మొదట్లోనే షూటింగ్ ఆపేశారు .
Advertisements