Advertisement
వ్యాధి నిరోదకత ( ఇమ్యూనిటి పవర్ ) పెంచుకుంటే చాలు… ఎన్నో రోగాలకు సింపుల్ గా చెక్ పెట్టొచ్చు.! ఇప్పుడు విజృంభిస్తున్న కొరోనా నివారణ కూడా ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవడమే బెస్ట్ సొల్యూషన్ ! ఇమ్యూనిటీ బలంగా ఉంటే అదే …కొరోనా గో… కొరోనా గో…అంటూ కొరోనాను తరిమికొడుతుంది!
ఆహారం పేరుతో మనమేం తీసుకుంటాం..వాటి పనితీరు ఎలా ఉంటుందో ఇప్పుడు తెల్సుకుందాం.
1.మాంసకృత్తులు (Proteins)
2.పిండిపదార్ధాలు (Carbohydrates)
3.కొవ్వుపదార్ధాలు (Fats)
4.విటమిన్లు (Vitamins)
5.ఖనిజలవణాలు (Minerals)
6.నీరు (Water)
1. మాంసకృత్తులు (proteins): మనం తీసుకునే ఆహారం లోని ప్రోటీన్స్ ని శరీరం డైరక్ట్ గా ఉపయోగించుకోలేదు. పెప్సిన్ అనే ఎంజైమ్ ప్రోటీన్స్ ను బ్రేక్ చేసి పెప్టైడ్స్ గా మార్చుతుంది. ఆ పెప్టైడ్స్ ను శరీరంలోని ఇతర ఎంజైములు శరీరానికి ఉపయోగపడే ఎమైనో యాసిడ్స్ గా మార్చుతాయి.
ప్రధానం ఉండే 21 ఎమైనో యాసిడ్స్ . …. శరీరం లోని జన్యుపదార్ధం,కండరాలు, ఎముకలు, మిగతా అవయవాలు,గోళ్ళు, జుట్టు ల్లో ఉంటాయి. మన శరీరం లోని కణజాలాలు గోడలు అనుకుంటే ప్రోటీన్స్ లోని ఎమైనో యాసిడ్స్ ఇటుకల్లాంటటివి. ఈ ఇటుకలే శరీర నిర్మాణానికి, ఎదుగుదలకి ఉపయోగపడతాయి.
Advertisements
2. పిండిపదార్ధాలు (carbohydrates): కార్బోహైడ్రేట్స్ శరీరానికి అవసరం అయ్యే శక్తిని ఇస్తాయి, శక్తిని నిల్వ ఉంచుతాయి, జీవ కణాల గోడల నిర్మాణం లో ఉపయోగపడతాయి. వివిధ బ్లడ్ గ్రూప్స్ కూడా వీటివలనే ఏర్పడతాయి. సాధారణం గా కార్బోహైడ్రేట్స్ కార్భన్, హైడ్రోజన్, ఆక్సీజన్ తో ఏర్పడతాయి.
3. కొవ్వుపదార్ధాలు (Fats): కొవ్వుపదార్ధాలు అత్యంత తక్కువ మోతాదులో అవసరం, కానీ ఇవి లేకుండా ఎనర్జీ ఉత్పత్తి అవ్వదు. కొవ్వు పదార్ధాలు శక్తిని ఇస్తాయి.
ఇక్కడ ప్రధానం గా తెలుసుకోవాల్సింది 78.8% కార్బోహైడ్రేట్, 21% శాతం ప్రోటీన్, 0.2% కొవ్వు పదార్ధం కలిస్తే 1 ATP శక్తి వస్తుంది. ఒకవేళ 200 గ్రాముల కార్బోహైడ్రేట్, 200 గ్రాముల ప్రోటీన్, 200 గ్రాముల కొవ్వు పదార్ధం తీసుకుంటే, 2 ATP ల శక్తి వస్తుంది. మిగతాది అంతా శరీరం లోని వివిధ భాగాల్లో వేస్ట్ గా మిగిలిపోతుంది. అందుకే ఏది ఏ పరిమాణం లో తీసుకోవాలో అదే పరిమాణం లో తీసుకోవాలి. ఇంకా తీసుకున్న ఆహారం లో కార్బోహైడ్రేట్స్ బ్రేక్ కాటానికి తక్కువ నీరు,ఎంజైములు అవసరం కానీ ప్రోటీన్స్ & కొవ్వు పదార్ధాల బ్రేకింగ్ కి ఎక్కువ నీరు, ఎంజైములు అవసరం.
4. విటమిన్లు (Vitamins): A, B, C, D, E, K అనే ఆరు విటమిన్లు ఉన్నాయి. ఇవి శక్తిని ఇవ్వవు కానీ పరోక్షం గా శక్తి ప్రసరణ, జీవక్రియల నియంత్రణలో అత్యంత ప్రధాన పాత్ర వహిస్తాయి. ఒక విటమిన్ ప్రత్యుత్పత్తికి, ఇంకో విటమిన్ కంటి చూపు కి, మరో విటమిన్ రోగనిరోధక శక్తి కి, ఇంకో విటమిన్ రక్త ప్రసరణ కి ఇలా ప్రతి విటమిన్ అత్యంత అవసరం. ఈ 6 విటమిన్స్ లో ఏది లోపించినా దానికి సంబంధించిన లోపం వస్తుంది.
Advertisement
A, D, E, K విటమిన్స్ కొవ్వులో కరుగుతాయి. B, C విటమిన్స్ నీటిలో కరుగుతాయి. అందుకే C విటమిన్ ట్యాబ్లెట్స్ రోజూ తీసుకోవచ్చు కానీ D విటమిన్ ట్యాబ్లెట్ రోజూ తీసుకోకూడదు, వారానికొకసారి మాత్రమే తీసుకోవాలి.
Advertisements
5.ఖనిజలవణాలు (Minerals): మాక్రో ఖనిజ లవణాలు, మైక్రో ఖనిజ లవణాలు అని రెండు రకాలు. ఇవి అత్యంత తక్కువ పరిమాణం లో అవసరం కానీ ఏది లోపించినా దానికి సబంధించిన లోపం వస్తుంది.
ప్రధాన ఖనిజ లవణాలు; కాల్సియం, ఫాస్పరస్, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, ఐరన్, జింక్, సెలీనియం, మాలిబ్డనం, మాంగనీస్, ఐయోడిన్, ఫ్లోరిన్, కాపర్, క్రోమియం, బెరీలియం మొదలగునవి. ఉదాహరణకి సెలీనియం శరీరం లోని కణాల డామేజ్ ని ఆపుతుంది, జింక్ రోగ నిరోధక కణాలని యాక్టివేట్ చేస్తుంది. కొన్నీంటి లోపం వలన క్యాన్సర్ వస్తుంది. ఇలా ప్రతి ఖనిజ మూలకం ఆయా పనులని చేస్తుంది.
6.నీరు (Water): శరీర అవసరాలని బట్టి తగినంత నీరు అవసరం.
- స్థూలంగా ఇవి మానవ శరీరానికి కావాల్సినవి. ప్రతిదానికి తక్కువ, ఎక్కువ లిమిట్ ఉంటుంది. ఏదీ తక్కువ కాకూడదు, ఎక్కువ కాకూడదు; ప్రతి ఒక్కటీ అవసరమే. ఉదాహారణకి మోకాళ్ళ నొప్పి అని వెళ్తే ఎక్స్-రే తీసి చూసి ఏమీ లేదు అని చెప్తారు. కానీ D విటమిన్ లోపం అవ్వొచ్చు, కాల్సియం లోపం అవ్వొచ్చు, మెగ్నీషియం లోపం వలన రావొచ్చు. ఇంకా కాల్సియం లోపం ఉంది అని కాల్సియం ట్యాబ్లెట్స్ సొంతంగా వాడుతుంటే కిడ్నీ లో రాళ్ళు ఏర్పడొచ్చు. ప్రొటీన్స్ ఫుడ్ తీసుకోకుండా డైరక్ట్ గా ఎమైనో యాసిడ్స్ తీసుకుంటుంటే కొన్ని రోజులకి ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నా దాన్ని బ్రేక్ చేసే ఎంజైములు అలసత్వానికి గురై తన పనిని చేయకపోవొచ్చు.!
- ఎవరికి వారు శరీరం లో జరిగే మార్పులని పసిగట్టుకోవాలి. చిన్న ఉదాహరణ యూరిన్ రంగు, ఎక్కువ వాసన వస్తుంటే ఏదో ఇన్ ఫెక్షన్ వచ్చినట్లు, మన నాలుక స్వభావం బట్టి కూడా చాలా వరకు తెలుసుకోవచ్చు.
- రోజూ C విటమిన్స్ వేసుకున్నంత మాత్రాన సరిపోదు. అవే వేసుకుంటుంటే రేపటి నాడు డైరక్ట్ గా ఫ్రూట్స్ తిన్నా ఫ్రూట్ నుంచి విటమిన్ ని బ్రేక్ చేసి అబ్సార్వ్ చేసుకునే ఎంజైం అలసత్వం ప్రదరించవచ్చు. ప్రతి కాయకూరలు తినాలి, ఏ కాలం లో లభ్యమయ్యే ఫ్రూట్స్ ఆ కాలం లో తినాలి. కొన్ని సార్లు సొంత పెత్తనం అసలు మంచిది కాదు. యాపిల్స్ మంచివి అని సర్జరీ జరిగినప్పుడు తినకూడదు, ఆకుకూరలు మంచివి అని యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా తినకూడదు. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నప్పుడు అతిగా నిమ్మరసం తాగకూడదు.
- ఆరోగ్యకరమైన జీవనవిధానాన్ని మించిన సైన్స్ ఈ ప్రపంచం లో లేదు. సృష్టి ధర్మాన్నీ మైక్రోస్కోపు లోనో, పరీక్ష నాళిక లోనో పెట్టి చూడలేం. ప్రకృతికి , ప్రాకృతిక నియమాలకి దగ్గరగా జీవనవిధానం కొనసాగించాలి అంటుంది విశ్వరసాయన శాస్త్రం. అందుకే “దేహమే దేవాలయం, జీవుడే సనాతన దైవం” అనే దానితో నేను ఏకీభవిస్తాను.
Article Written By : – జగన్