Advertisement
లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో ఉండాలన్నా, జనజీవనం ప్రశాంతంగా ఉండాలన్నా..తమ తమ ప్రాంతాలకు తగ్గట్టుగా రూల్స్ పెట్టుకోవడం ఆయా దేశాల ఇష్టం! ఇదే సమయంలో కొన్ని దేశాలు పాటించే రూల్స్ ను చూస్తే ఇదేం రూల్ చాలా వింతగా ఉందే అనుకుంటాం.! అలా వింత మీకు ఆశ్చర్యాన్ని తెప్పించే 7 వింత రూల్స్ గురించి ఇప్పుడు చూద్దాం!
1) కాప్రి అనే దేశంలో రోడ్ల మీద మీ కుక్క విసర్జించిన మలం క్లీన్ చేయకపోతే దాదాపు 2 లక్షల ఫైన్ వేస్తారు. అవసరమైతే కుక్క మలం యొక్క DNA ద్వారా అది ఎవరి కుక్కో పసిగట్టేస్తారు.
2) సింగపూర్లో చూయింగమ్ నమలడం చట్ట విరుద్దం. కేవలం డాక్టర్ల ప్రిస్క్రిషన్ మేరకే మెడికల్ షాప్ లలో ఇస్తారు.
Advertisements
3) శ్రీలంక లో బుద్దుడి విగ్రహంతో సెల్ఫీలు తీసుకోవడం నిషేదం.
Advertisement
4) కుక్కను వాకింగ్ కు తీసుకెళ్లకుంటే క్రైమ్! ఇటలీ లోని టురిన్ అనే ప్రాంతంలో కుక్కను రోజులో 3 సార్లు వాకింగ్ కు తీసుకెళ్లకపోతే నేరంగా పరిగణిస్తారు.
5) ఒసానియా అనే దేశంలో భర్తలు భార్య బర్త్డే ను మర్చిపోతేదే పెద్ద తప్పు … ఈ కారణంతో భార్యలు భర్తలను కటకటాల వెనక్కి కూడా పంపొచ్చు
6) వెన్నిస్ లో పావురాలకు దాణా వేయడం నిషేదం. అలా దాణా వేయడం వల్ల పావురాలు ఒకచోట గుమ్మిగూడి చారిత్రక కట్టడాలను పాడు చేస్తాయనే కారణంతో ఈ రూల్ తీసుకొచ్చారు.
7) నార్త్ కొరియా నుండి ఇంటర్నేషనల్ కాల్స్ చేయడం నిషిద్దం. కిమ్ గురించి మీకు తెలుసు కదా!
Advertisements