Advertisement
ప్రస్తుతం ఇండస్ట్రీలో రియలిస్టిక్ మరియు బోల్డ్ మూవీస్ కామన్ అయిపోయాయి. కానీ 2004 లో ఇలాంటి సినిమా తీయడానికి ఎంతో ధైర్యం ఉండాలి! ఒకవేళ తీసిన వాటిపై బూతు సినిమాలని ముద్ర వేసేవారు.! అయినా ఆ టైమ్ లోనే ….అలాంటి కంటెంట్ తో కల్ట్ స్టేటస్ పొందిన మూవీ 7G బృందావన్ కాలనీ.. యూత్ ను కన్నుల బాసలు తెలియవులే అంటూ పాడుకునేలా చేసింది!
1. సెల్వ రాఘవన్
తన కాలేజీ రోజుల్లో జరిగిన ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని ఒక స్టోరీ రాశాడు. ఒక పంజాబీ అమ్మాయిని చూసి ఇష్టపడి తనకోసం చేసిన ఫీట్ లు అన్ని ఇందులో పొందుపర్చాడు. మొదట్లో …ఈ సినిమాకు హీరోగా సిద్ధార్థ లేదా మాధవన్ ను తీసుకోవాలనుకున్నాడు కానీ ఈ స్టోరీని మాధవన్ రిజెక్ట్ చేయగా సిద్ధార్థ నువ్వు వొస్తానంటే నేనొద్దంటానా? సినిమా బిజిలో ఉన్నాడు .
2. హీరో- రవికృష్ణ
ఈ సినిమాకు హీరోగా ఎవరిని తీసుకోవాలని ప్రొడ్యూసర్ ఏ ఎమ్ రత్నం గారి ఆఫీస్ లో డిస్కషన్ జరుగుతుండగా రత్నం గారి అబ్బాయి రవి క్రిష్ణ వచ్చాడు . అతన్ని చూసి సెల్వ రాఘవన్ నువ్వు ఎందుకు హీరోగా ట్రై చేయకూడదు , ఈ కథలో హీరో పాత్ర మీకు బాగా సరిపోతుంది అని చెప్పారు . కానీ రవి క్రిష్ణ రాఘవన్ మాటలని అంత సీరియస్ గా తీసుకోలేదు . ఐనా సెల్వ బలవంతం చేయడంతో లుక్ టెస్ట్ లు చేశారు. అవి చూశాక రవి ఈ కథకి బాగా సెట్ అవుతాడనే కాన్ఫిడెన్స్ వచ్చింది . రవి క్రిష్ణ ని యాక్టింగ్ ట్రైనింగ్ కోసం లండన్ పంపించారు .
Advertisements
3. హీరోయిన్ ఎంపిక
ఈ సినిమాకు హీరోయిన్ గా మొదట జెనీలియాను అనుకున్నారు. కథలో హీరోయిన్ పంజాబీ అమ్మాయి క్యారెక్టర్ కావడంతో నిజంగా పంజాబీ అమ్మాయైతే బాగుంటుందని భావించి సోనియా అగర్వాల్ ని సెలెక్ట్ చేశారు.
Advertisement
4 సినిమా
సినిమా చూసిన ప్రేక్షకులలో కొంతమంది సాఫ్ట్ వన్ మూవీ అన్నారు, ఇంకొంతమంది హీరో క్యారెక్టర్ వేస్టు అన్నారు. కానీ యూత్ కి మాత్రం ఆ సినిమా పిచ్చపిచ్చగా నచ్చింది.! అవారాగా తిరిగే హీరో క్యారెక్టర్ , అలాంటి కొడుకును భరించలేని తండ్రి క్యారెక్టర్ , కాలేజీ బ్యాచ్ …..క్యారెక్టర్స్ అన్నీ రియాలిస్టిక్ మలిచారు సెల్వ రాఘవన్ . హీరో మరియు అతని తండ్రి పాత్రల మధ్య సీన్స్ ఎంత పాపులరో మనకి తెలిసిందే ఇప్పటికి వాటిపై ఎన్నో మీమ్స్ కనిపిస్తుంటాయి .
5. పాటలు
యువన్ శంకర్ రాజా అందించిన మ్యూజిక్ ఈ సినిమాను మరో లెవల్ కి తీసుకెళ్లింది. కన్నులబాసలు తెలియవలే, తలచి తలచి చూశా పాటలైతే…. యూత్ కాలర్ టూన్స్ గా మిగిలిపోయాయి.!
6 హృదయాల్ని హతుకున్న సీన్స్
ఇంటర్వెల్ సీన్ , తన కొడుకు ప్రయోజకుడు అయ్యాడని చంద్రమోహన్ సంతోషపడే సీన్స్, హీరోయిన్ కి హీరో మీద ఎంత ప్రేముందో ఎక్స్ పోజ్ చేసే షాట్స్ ,హీరోయిన్ చనిపోయాక హీరో బెడ్స్ పిల్లొస్ పట్టుకొని పిచ్చోడిలా తిరిగే సీన్ . ఈ సీన్ కి కన్నీళ్లు వొస్తాయి .హీరోయిన్ జ్ఞాపకాల్లో హీరో బతకడం అనే థీమ్ కు యూత్ కదిలిపోయారు . సినిమాలో ట్రాజెడి క్లైమాక్స్.
8 బడ్జెట్ – వసూళ్లు
3 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా తమిళ్ లో 10 కోట్లు వసూలు చేయగా తెలుగులో 5 కోట్లు వసూల్ చేసి డబ్బింగ్ సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ గా నిలిచింది . 25 సెంటర్ లలో 100 రోజులు ఆడింది .
Advertisements
ఈ సినిమా తర్వాత…. డైరెక్టర్ సెల్వ…ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సోనియా అగర్వాల్ ను పెళ్లి చేసుకున్నారు. రెండేళ్ల తర్వాత వీరి మధ్య సఖ్యత కుదరక విడాకులు తీసుకున్నారు.