Advertisement
తెరమీద తమ అభిమాన హీరో డాన్స్ చేస్తేనే ఈలలు గోలలతో థియేటర్స్ దద్దరిల్లేలా చేస్తారు ఫ్యాన్స్! మరి ఒకే పాటకు 7 గురు హీరోలు కలిసి డాన్స్ చేస్తే….? అదే జరిగింది వెంకటేష్ త్రిమూర్తులు సినిమాలో……..ఒకే మాట ఒకే బాట అంటూ సాగిన ఆ పాటలో 7 గురు హీరోలు 4గురు హీరోయిన్స్ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చి ప్రేక్షకులు ఎన్నటికీ మర్చిపోలేని ఓ అందమైన జ్ఞాపకాన్ని ఇచ్చారు.
1987 లో వెంకటేష్ హీరోగా రూపొందిన త్రిమూర్తులు సినిమాలో ఒకే మాట ఒకే బాటలో అప్పటి టాప్ స్టార్స్ అందరిని ఒకే ఫ్రెమ్ లో చూపించాలనుకున్నాడు ఆ సినిమా ప్రొడ్యూసర్ టి సుబ్బిరామిరెడ్డి. ఈ సినిమా నసీబ్ అనే హిందీ సినిమాకు రీమేక్.., ఆ సినిమాలోని పాటకు హిందీ టాప్ స్టార్స్ అంతా కనిపిస్తారు. సో తెలుగులో కూడా అలాగే ఇక్కడి స్టార్స్ అందరూ ఈ పాటలో కనిపించేలా చేయాలని ప్లాన్ చేశారు . ఎన్టీఆర్ , ఏఎన్ఆర్, క్రిష్ణ , శోభన్ బాబు , కృష్ణంరాజు, చిరంజీవి ఈ ఆరుగురిని ఆ పాటలో చూపించాలని అందరిని ఒప్పించారు . కానీ ఎన్టీఆర్ , ఏఎన్ఆర్ లు కొన్ని కారణాల రీత్యా నటించలేమని చెప్పడంతో …వారి ప్లేస్ లో వారి వారసులైన బాలక్రిష్ణ , నాగార్జున లని ఒప్పించారు. ఆ పాటలో నటింపజేశారు.
Advertisement
వెంకటేష్ తో స్టార్ట్ అయ్యే ఆ సాంగ్ లో మొదట శోభన్ బాబు , విజయ శాంతి , క్రిష్ణ, విజయ నిర్మల , చిరంజీవి , కృష్ణంరాజు శారద కనిపిస్తారు . ఆ తర్వాత బాలక్రిష్ణ, నాగార్జున కనిపిస్తారు . వీరితో పాటు రాధిక , రాధ , జైమాళిని , చంద్రమోహన్ , మురళి మోహన్ తో పాటు ఇంకొంతమంది దర్శక నటులు కనిపిస్తారు . కేవలం ఈ పాట చూడటానికే ప్రేక్షకులు థియేటర్ లకి వెళ్లారట!
Watch Video :
Advertisements
Advertisements
వెంకటేష్ తర్వాత నాగార్జున ఒకే పాటకు 8 మంది హీరోయిన్స్ తో చేసాడు:
కింగ్ సినిమాలో నువ్వు రెడీ నేను రెడీ అనే పాటలో నాగ్ 8 మంది హీరోయిన్స్ తో డాన్స్ చేసాడు.. త్రిష ,మమతా మోహన్ దాస్ , అనుష్క , ఛార్మి, జెనీలియా , ప్రియమణి, స్నేహ ఉల్లాల్, కామ్నా జెట్మలానీ లు ఈ సాంగ్ లో నాగ్ తో డాన్స్ చేసారు.