Advertisement
సోషల్ మీడియా యుగం కావడం వల్లన మనకి ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఏం జరిగినా అది వెంటనే తెలిసిపోతుంది. అలాంటి న్యూస్ లో పనికొచ్చేవి, పనికిరానివి అనే రెండు కేటగిరీలు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి డీటైల్ గా చెప్పి మిమ్మల్ని విసిగించను కాని సోషల్ మీడియా ద్వారా పనికొచ్చే క్యాటగిరిలో పబ్లిష్ అయిన ఓ కథ ఇప్పుడు అందరికంట నీరు తెప్పిస్తుంది.
Advertisement
తాజాగా సోషల్ మీడియాలో ఓ వ్యక్తి ఓ వార్తను పోస్ట్ చేశారు.అదేంటో ఇప్పుడు చూద్దాం.అందులో ఒక చేయి కోల్పోయిన తండ్రి కూతురిని వేరే వాళ్ళ ఇంటిలో పనిమనిషిగా చూడడం ఇష్టంలేక ఆమెను చక్కగా చదివించడం కోసం అంగవైకల్యం ఎదురుకుంటున్న తండ్రి కూతురు సాయంతో ఆటో నడుపుతున్నాడు.మొదట ఈ విషయాన్ని ఊహించని నేను ఆటో డ్రైవర్ వళ్లో కూర్చున్న చిన్నారిని చూసి తను ఆడుకుంటుంది అని అనుకున్నాను. కాని నేను దిగవలసిన చోటు రావడంతో దిగిన నేను ఆ వ్యక్తి వైపు దీక్షగా చూస్తే అసలు విషయం అర్థమైంది.వెంటనే ఆటో డ్రైవర్ ను ఈ విషయం పై ప్రశ్నించగా అతను తన చేతిని కోల్పోయాడని జీవనోపాధి కోసం తన కూతురిని పని మనిషిగా చూడడం,లేదా తనని తాను రోడ్డు మీద అడుక్కునే వాడిగా చూడడం ఇష్టం లేక తాను చెబుతుంటే ఆ చిన్నారి ఆటోను నడిపే విధంగా ఇద్దరూ తమని తాము మార్చుకున్నమని అన్నాడు.
Advertisements
ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియాలో చూసినవారంతా ఆ పోస్ట్ ను పోస్ట్ చేసినవారు ఆ ఆటో డ్రైవర్ కు అసలైన సహాయం చేయడం లేదని ఇలా ఆటోను రోడ్లమీద నడపడం ఇల్లీగల్ అని కామెంట్ చేస్తున్నారు.
Advertisements