Advertisement
సుబాష్ చంద్రబోస్ బ్రతికుంటే….ప్రస్తుతం మనదేశంలో జరుగుతున్న అవినీతి చూసి ఎలా రియాక్ట్ అవుతాడు అనే లైన్ తో క్రియేటివ్ డైరెక్టర్ తెరకెక్కించిన సినిమా భారతీయుడు! కథ రాసేటప్పుడే కమల్ హాసన్ ను హీరోగా ఊహించుకొని రాశాడు. కథ విని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కమల్!
శంకర్ , కమల్ కాంబినేషన్లో , AM రత్నం నిర్మాతగా 12 కోట్ల బడ్జెట్ తో భారతీయుడు మూవీ అనౌన్స్ చేశారు . సౌంత్ ఇండియా మొత్తం ఒక్కసారిగా షాక్ ! అప్పటివరకు అంత బడ్జెట్ పెట్టి ఎవ్వరూ సినిమా తీయలేదు.
నటీనటులు ఎంపిక:
- కమల్ హాసన్ డ్యుయల్ రోల్ చేయకపోతే కొడుకు పాత్రకి ముందుగా అజిత్ ని తీసుకోవాలి అనుకున్నారు … కానీ కమల్ రెండు పాత్రలు చేయడానికి ఒప్పుకున్నాడు.
- పెద్ద కమల్ హసన్ పక్కన రాధికని తీసుకోవాలి అనుకున్నారు కాని డేట్స్ కుదరక ఆమె చేయలేకపోయారు . దాంతో సుకన్య ని తీసుకున్నారు.
- మొదట హీరోయిన్స్ క్యారెక్టర్ కి ఐశ్వర్యారాయ్ , శిల్పాశెట్టి లను అనుకున్నారు కానీ ఐశ్వర్య కి ఒక యాడ్ ఏజెన్సీతో అగ్రిమెంట్ వల్ల కుదరకపోవడంతో అప్పుడే బొంబాయ్ సినిమాతో టాప్ లో ఉన్న మనీషా కొయిరాలాని తీసుకున్నారు . శిల్పాశెట్టి స్థానంలో ఊర్మిల ఫిక్స్ అయ్యింది .
- మ్యూజిక్ డైరెక్టర్ గా అప్పటికే టాప్ లో ఉన్న ఏ ఆర్ రెహమాన్ ని తీసుకున్నారు .
Advertisements
షూటింగ్:
లొకేషన్స్ అన్ని వెతికి 1995 లో షూటింగ్ ప్రారంభించారు , ఈ సినిమాలో కమల్ మేకప్ వేయడానికి 5 గంటలు , తీయడానికి 2 గంటలు పట్టేదట కేవలం మేకప్ కోసమే 1 కోటి రూపాయలు పెట్టి అమెరికా నుండి స్పెషల్ టీమ్ ని తీసుకొచ్చారు . అప్పట్లో ఈ మేకప్ కి పెట్టిన ఖర్చుపై వార్తాపత్రికల్లో పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి!
Advertisement
షూటింగ్ మొత్తం ప్రసాద్ స్టూడియోస్ , వాహిని స్టూడియోస్ ,ముంబైలో కొంత చేశారు .
టెలిఫోన్ ధ్వనిలా నవ్వే అనే పాటను ఆస్ట్రేలియాలో తీశారు ఫస్ట్ టైం ఫారెన్ లో తీసిన ఇండియన్ సినిమాకూడా ఇదే . అంతేకాదు ఒక ఇండియన్ సినిమా పాటలో ఫారెనర్స్ తో డాన్స్ వేయించిన ఫస్ట్ సినిమా కూడా ఇదే . షూటింగ్ మొత్తం 150 రోజుల్లో పూర్తి చేశారు. గ్రాఫిక్స్ కోసం అమెరికా నుంచి స్పెషల్ టెక్నిషియన్స్ ని తీసుకొచ్చారు . సినిమా పూర్తయ్యే వరకు మొత్తం 14 కోట్ల బడ్జెట్ అయ్యింది .
సంగీతం:
భారతీయుడు ఆడియో ని 1996 ఏప్రిల్ నెలలో రిలీజ్ చేశారు. తెలుగు , తమిళ్ , కన్నడ, హిందీ అన్ని భాషల్లో పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి . ఈ సినిమాలో పచ్చని చిలుకలు తోడుండే అనే మెలోడీ సాంగ్ ఎవర్ గ్రీన్ సాంగ్ ! రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ప్రాణం పోసింది . ఈ సినిమాకి రెహమాన్ కి నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది .
ముఖ్యమైన సన్నివేశాలు:
- టీవీ లో కనిపిస్తూ అవినీతి అధికారులను చంపే సీన్
- ట్రాఫిక్ పోలీస్ ని చెప్పుతో కొట్టే సీన్
- మనోరమ గవర్నమెంట్ అధికారిని తిట్టే సీన్
- ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్
- సీబీఐ ఆఫీసర్ ఫస్ట్ టైం భారతీయుడిని కలిసే సీన్ .
- వందేమాతరం ఉద్యమం సీన్
- స్వాతంత్రం వచ్చాక సేనాధిపతి ( తండ్రి కమల్ హాసన్ ) తిరిగొచ్చే సీన్
- క్లైమాక్స్ లో కన్న కొడుకుని చంపే సీన్ రికార్డ్స్ :
Advertisements
అప్పటివరకు రిలీజ్ అయిన అన్నిటిల్లో టాప్ తెలుగు డబ్బింగ్ సినిమా ఇదే . 60 కోట్లు వసూలు చేసిన టాప్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ . 25 లక్షల ఆడియో సేల్స్ చేసి సరికొత్త రికార్డ్ సృష్టించింది . ఈ సినిమాకు మూడు నేషనల్ అవార్డ్స్ రావడం ఇంకో రికార్డ్ .