Advertisement
థియోడోర్ రూజ్‌వెల్ట్.. అమెరికాకు 26వ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయనను టెడ్డీ రూజ్‌వెల్ట్ అని కూడా పిలుస్తారు. 1901 సెప్టెంబర్ 14 నుంచి 1909 మార్చి 4 వరకు ఆయన రెండు సార్లు అధ్యక్షుడిగా పనిచేశారు. తరువాత మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యేందుకు ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహించారు. అయితే 1912 అక్టోబర్ 14న ఆయన్ను ఓ వ్యక్తి రివ్వాల్వర్‌తో కాల్చాడు. అయినప్పటికీ ఆయన ఏమాత్రం చెక్కు చెదరకుండా 84 నిమిషాల పాటు స్పీచ్ ఇచ్చి అందరినీ షాక్‌కు గురి చేశారు. అప్పట్లో ఈ విషయం సంచలనం సృష్టించింది.
ఆ రోజు రూజ్‌వెల్ట్ Milwaukee Auditoriumలో తన ఎన్నికల క్యాంపెయిన్‌కు సంబంధించి స్పీచ్ ఇచ్చే కార్యక్రమం ఉంది. దాని కోసం ఆయన అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఓపెన్ ఎయిర్ మొబైల్ వ్యాన్‌లో ప్రజలకు అభివాదం చేస్తూ.. Friends, I shall ask you to be as quiet as possible అని అన్నారు. అంతే.. రెండో వాక్యం మాట్లాడేలోపే జనాల గుంపులోంచి దూసుకువచ్చిన ఓ బుల్లెట్ ఆయన కుడి భాగంలో ఛాతిలోకి దూసుకెళ్లింది. అయితే ఆ భాగంలో ఆయన అద్దాలను ఉంచే చిన్న బాక్స్‌తోపాటు తన స్పీచ్‌కు సంబంధించిన 50 పేజీల పుస్తకాన్ని ఉంచుకున్నారు. దీంతోపాటు దృఢమైన కోట్ ధరించి ఉన్నారు. ఈ క్రమంలో బుల్లెట్ వాటి గుండా వెళ్లే సరికి చాలా నెమ్మదించింది. ఫలితంగా ఆయన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. స్వల్ప గాయాలతో బయట పడ్డారు.
Advertisement
అయితే బుల్లెట్ ఛాతిలోకి వెళ్లి ఓ వైపు రక్తస్రావం అవుతున్నా.. రూజ్‌వెల్ట్ మాత్రం ఆ కాల్చిన వ్యక్తిని వదిలేయమన్నారు. కానీ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఇక రూజ్‌వెల్ట్ ఆడిటోరియంలోకి వెళ్లి తన స్పీచ్ కొనసాగించారు. ఓవైపు ఛాతిలో బుల్లెట్ అలాగే ఉంది. అయినప్పటికీ ఆయన 84 నిమిషాల పాటు స్పీచ్ ఇచ్చారు.
Advertisements
ఆయన స్పీచ్ ఇలా ప్రారంభించారు:
ఫ్రెండ్స్.. నన్ను గన్‌తో కాల్చారని మీలో చాలా మందికి తెలియదు. అదృష్టవశాత్తూ నా స్పీచ్ బుక్ ఉండడం వల్ల నేను బతికిపోయా. నేను సుదీర్ఘ ఉపన్యాసం ఇవ్వాలని అనుకున్నా. కానీ నా ఛాతిలో బుల్లెట్ ఉంది. అది ఇలా లోపలికి దూసుకెళ్లింది. అది నా గుండెకు తాకలేదు. బతికిపోయా. ఆ బుల్లెట్ ఇప్పుడు నాలోనే ఉంది. కనుక నేను ఎక్కువ సేపు మాట్లాడలేను. కానీ వీలైనంత వరకు మాట్లాడేందుకు ట్రై చేస్తా.. నన్ను కాల్చినందుకు నేనేమీ బాధపడను.. మీకు మాటిస్తున్నా..
Advertisements
ఇలా ఆయన సుదీర్ఘమైన స్పీచ్ ఇచ్చి అటు నుంచి హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స చేయించుకున్నారు. అయితే ఆ బుల్లెట్‌ను తీయడం కన్నా శరీరంలోనే అది ఉంటే బాగుంటుందని, దాంతో ప్రమాదమేమీ లేదని వైద్యులు చెప్పారు. కానీ ఆ బుల్లెట్ వల్ల ఆయనకు పలు అనారోగ్య సమస్యలు మాత్రం వచ్చాయి. అయితే ఎన్నికల్లో తనపై కాల్పులు జరిపిన ఘటనను వాడుకుని ఆయన అప్పట్లో మూడో సారి అమెరికా అధ్యక్షుడిగా గెలిచి ఉండేవారు. కానీ ఆయన దాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడలేదు. అయినప్పటికీ ఆ ఘటన ఆయనకు ఏమాత్రం సానుభూతిని తెచ్చిపెట్టలేదు. ఫలితంగా ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. తరువాత 7 ఏళ్లకు.. అంటే.. 1919 జనవరి 6న ఆయన చనిపోయారు..!