Advertisement
ఈ ఫోటోలో కనిపిస్తున్నామె పేరు అనుష్య….పుట్టుకతో పురుషుడే అయినా తన ఫీలింగ్స్ కు ప్రాముఖ్యతనిచ్చి ట్రాన్స్ జెండర్ గా మారింది.తమ పరువు తీస్తుందని భావించిన తల్లిదండ్రులు తనకు 15 సంవత్సరాల వయస్సులో ఇంట్లోనుండి గెంటివేశారు.!
Advertisement
అలా రోడ్ల మీద తిరుగుతున్న అనుష్యను కొంత మంది ట్రాన్స్ జెండర్లు చేరదీశారు. తాము చేస్తున్నట్టుగానే యాచక వృత్తి చేయమన్నారు. కొన్ని రోజులు షాప్ షాప్ కు తిరిగి యాచించిన అనుష్యకు తను చేసేది కరెక్ట్ కాదని అనిపించింది.! థర్డ్ జెండర్ అయినప్పటికీ తాను ఇతరులతో ఏ మాత్రం తక్కువ కాదు అని ఫీల్ అయ్యేది! అందుకే స్వశక్తితో ఏదైనా చేయాలని అనుకునేది….ఆమె ఆలోచనకు అనుగుణంగా ఓ స్వచ్చంధ సంస్థ….ఆటో డ్రైవింగ్ లో శిక్షణ ఇస్తున్నారని తెలిసి….అప్లికేషన్ పెట్టుకుంది..మూడు నెలలు కష్టపడి ఆటో నేర్చుకుంది…వారి సహాయంతోనే ఓ ఆటోను కొనుక్కొని నడపడం స్టార్ట్ చేసింది!
Advertisements
మొదట తన ఆటో ఎక్కడానికి కస్టమర్లు ఆలోచించేవారట.. కానీ క్రమంగా అలవాటు పడుతున్నారట.! దానికి తోడు అనుష్య డ్రైవింగ్ స్కిల్స్ , తను ప్రయాణికులతో మాట్లాడే విధానం నచ్చి ఇప్పుడు కస్టమర్లు ఎక్కువగా తన ఆటోనే ప్రిఫర్ చేస్తున్నారట! సంకల్పం, సమాజంలో పరిస్థితులను ఎదుర్కునే తెగువ మనలో ఉంటే మనం ఉన్నత శిఖరాలను అందుకోవచ్చని అనుష్య అంటుంది.
Advertisements