Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

TV సీరియ‌ల్ కు కూడా ప‌నికిరాద‌ని చెప్పిన ఆ క‌థ‌… తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే ఓ గొప్ప సినిమాగా నిలిచింది.!!

Advertisement

ప్రముఖ సినిమాటోగ్రాఫ‌ర్ గోపాలరెడ్డి  దగ్గర  అసిస్టెంట్ కెమెరామెన్‌గా ప‌నిచేస్తున్న మదన్… త‌ను డిగ్రీలో ఉన్న‌ప్పుడు ఆ ఊరిలో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న అత‌డిని క‌దిలించింది. ఓ వ్య‌క్తి… ఊరంతా  అప్పులు  చేసి చనిపోయాడు.  కానీ అతని  అంతిమయాత్రకు  ఊరు ఊరంతా  కదిలివచ్చింది.  మహానుభవుడని  పొగిడింది. కారణం అతను  మంచివాడు. తనతో పాటు  నలుగురూ చల్లగా ఉండాలని  కోరుకున్నవాడు.  డబ్బు  గొప్పదా? మానవత్వం  గొప్పదా? అనే కోణంలో ఇదే సంఘ‌ట‌న‌కు కాస్తంత నాట‌కీయ‌త జోడిండి క‌థ‌గా రాసుకున్నాడు మ‌ద‌న్.

 

a naluguru movie
ఇదే క‌థ‌ను ETV ఆఫీస్ కి  వెళ్లి  కథ  చెప్పాడు…. టైటిల్  ‘అంతిమయాత్ర’.  స్టార్టింగ్ సీనే చావు.  వింటున్న ఓ సీరియ‌ల్ డైరెక్ట‌ర్ మొహం  చిట్లించాడు. అబ్బో ఇలాంటి  చావు కథతో  26 ఎపిసోడ్ల  టీవీ సీరియల్ ఎలా తీస్తారు? అంటూ  రిజెక్ట్ చేశాడు!

మ‌ద‌న్ కు ద‌ర్శ‌కుడు రామ్‌ప్రసాద్  పరిచయమయ్యాడు. ఆయనకు  కథ బాగా నచ్చింది.  ఇదే క‌థ‌ను ప‌ట్టుకొని నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు ద‌గ్గ‌ర‌కు చేరారు…అట్లూరి క‌థ ఇంకా బాగా న‌చ్చింది. మదన్‌ని  ఊటీ  పంపి, నెలరోజులు  కూర్చోబెట్టి  ఫుల్‌స్క్రిప్ట్  రాయ‌మ‌ని అడ్వాన్స్ ఇచ్చి పంపిచాడు.

a naluguru
అట్లూరి కోరిక మేర‌కు మ‌ద‌న్ త‌న క‌థ‌ను కె. భాగ్యరాజాకు వినిపించాడు.  కథ విన్న భాగ్య‌రాజా కదిలిపోయాడు.  ‘‘తెలుగు, తమిళ  భాషల్లో  నేనే చేస్తాను… హీరో మాత్రం  నేనే’’ అని  ప్రపోజల్  పెట్టాడు. అట్లూరికి  మాత్రం ఆ సినిమాలోని మెయిన్ రోల్ ను దాసరి లేదా మోహన్‌బాబు లేదంటే ధర్మవరపు సుబ్రహ్మణ్యంతో చేయించాలని ఫిక్స్ అయ్యాడు! వ‌ర్క్ అవుట్ కాద‌నుకున్న‌  భాగ్యరాజా  వెళ్లిపోయాడు.  ప్రాజెక్ట్ మ‌ళ్లీ పెండింగ్ లో ప‌డిపోయింది.

Advertisement

క‌థ న‌ర‌స‌రాజుకు వినిపిస్తే….‘మోసం  చేయడం చేతకాని  పిచ్చివాడివి… అందుకే  అప్పు  ఇస్తున్నా’’  ఈ డైలాగ్ ను యాడ్ చేసి స్టోరి డెప్త్ ఇంకాస్త పెంచాడు. ప్ర‌కాశ్ రాజ్ కు వినిపిస్తే…. ఇది సినిమా కంటే న‌వ‌లైతే బాగుంటుంద‌ని స‌ల‌హా ఇచ్చారు.

Advertisements

ఓ సారి చంద్రసిద్ధార్థ్  ఇంటికి  వెళ్ళిన‌ మదన్. ఆయన  లేక‌పోవ‌డంతో త‌న క‌థ‌ను చంద్ర సిద్ధార్థ్  అన్నయ్య కృష్ణమోహన్ చెప్పాడు. అన్న స‌ల‌హా మేర‌కు చంద్రసిద్ధార్థ్ ఇదే క‌థ‌ను సినిమా తీయాల‌ని ఫిక్స్ అయ్యాడు! వెంట‌నే అట్లూరి ద‌గ్గ‌ర‌కు వెళ్లిన చంద్ర సిద్ధార్థ్ ఆ క‌థ‌కు సంబంధించిన తెలుగు రైట్స్ కొనుక్కున్నాడు.  ప్రొడ్యూసర్‌గా ప్రేమ్‌కుమార్ ఓకే చెప్పారు.

a naluguru

 

నటీనటుల ఎంపిక‌
ప్ర‌ధాన పాత్ర‌లో రాజేంద్ర‌ప్ర‌సాద్ ను ముందుగానే అనుకొని క‌థ‌ను ఆయ‌న‌కు వినిపిస్తే రాజేంద్రప్రసాద్  కళ్ళలో  నీళ్ళు తిరిగాయి. రాజేంద్రప్రసాద్  వెంటనే  పనిలో  పడిపోయాడు.  డైలాగ్ డెలివరి,  కళ్లజోడు,  విగ్గు,  పంచెకట్టు,  టోటల్‌గా రఘురామ్  గెటప్ లోకి ప‌ర‌కాయ‌ప్ర‌వేశం చేశాడు. ర‌ఘురామ్ భార్య‌గా ఆమని ఫిక్స్..  షూటింగ్ స్టార్ట్ అయిపోయింది.

ఆర్పీ పట్నాయక్ చాలా  బిజీగా ఉన్న‌ప్ప‌టికీ ‘ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం,  పాటకు  ట్యూన్ కట్టాడు.  ఈ సినిమా టైటిల్  అంతిమ‌యాత్ర నుండి ఆ న‌లుగురిగా మారిపోయింది!

రిలీజ్ : 

Advertisements

2004 డిసెంబర్ 9  ‘ఆ నలుగురు’  రిలీజ్.  సినిమా పేరుకి  తగ్గట్టే  థియేటర్‌లో  నలుగురే  ఉన్నట్టున్నారు. 27 ప్రింట్లలో  16 రిటర్న్.! రెండు వారాలు గ‌డిచాయి…ఇక క‌ష్ట‌మే అనుకునే స‌మ‌యానికి …. సర్‌ప్రైజ్  షాక్.!  ఆ రోజు మార్నింగ్  షోస్ ఫుల్, మాట్నీ ఫుల్ , ఫస్ట్  షో ఫుల్,   సెకండ్  షో ఫుల్…… ఒక్క‌సారిగా సినిమా రేంజే మారిపోయింది . స్టోరికి క‌దిలిపోయిన జ‌నాలు సూప‌ర్ సూప‌ర్ అంటూ ప్రశంసల జ‌ల్లు కురిపించారు.