Advertisement
అభినయ…పుట్టుకతో మూగ మరియు చెవిటి.! తనతో ఎలాగైనా మాట్లాడించాలనే తపనతో బంధువులు, స్నేహితుల దగ్గర 11 లక్షల వరకు అప్పు తెచ్చిమరీ తమిళనాడు నుండి హైద్రాబాద్ కు వచ్చారు. స్పీచ్ థెరపీ క్లాసులు ఇప్పించారు. అయినా ఎలాంటి ఫలితం లేదు!
అభినయ పేరుకు తగ్గట్టే అభినయంలో టాప్ లో ఉండేది.అందుకే తన 7 క్లాస్ లోనే తనకు ఓ తమిళ సినిమాలో నటించే అవకాశం దక్కింది. కానీ తర్వాత ఇండస్ట్రీలో అవకాశాలు రాలేదు కారణం తను మాట్లాడలేకపోవడం, వినలేకపోవడం. నటన పట్ల తన ఇష్టాన్ని గమనించిన తండ్రి అభినయను యాడ్స్ లో అయినా యాక్ట్ చేయిద్దామనే ప్రయత్నాలు మొదలు పెట్టాడు…ఇక్కడైతే మాట్లాడే అవసరం ఉండదు అని ఆలోచించి.
అభినయ తండ్రికి కూడా సినిమాల పట్ల ఆసక్తి ఉండడంతో….. ఆయన ఆర్టిస్టుగా ట్రై చేసేవాడు. ఆయన వెళ్లిన ప్రతీ ఆఫీస్ లో తన ఫొటోలతో పాటు అభినయ ఫోటోలు కూడా ఇచ్చేవాడు. అభినయ ఫోటోలు చూసి అమ్మాయి భలే ఉంది అన్నవారే…ఆమెకు మాటలు రావని తెలిసి ముఖం చిట్లించేవారు!
తొలి అవకాశం:
Advertisements
Advertisement
నాదోదిగల్ అనే సినిమాకు ఆ సినిమా డైరెక్టర్ ఓ బాంబే యాక్టర్ ను సెలెక్ట్ చేసుకున్నాడు. ఆమెకు తమిళ్ కష్టమవ్వడంతో ఈ సినిమా నేను చేయనంటూ వెళ్లిపోయింది. దీంతో డైరెక్టర్ కు కోపమొచ్చింది….పట్టుదల పెరిగి… అసలు కమ్యూనికేషనే తెలియని అమ్మాయిని పెట్టి ఈ సినిమా తీస్తానని అనుకొని అప్పటికప్పుడు అభినయను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ ఒక్క సినిమాకి 13 అవార్డ్స్ వచ్చాయి. ఇదే తెలుగులో శంభోశివశంబో గా వచ్చింది. ఈ సినిమాలో రవితేజ చెల్లెలి క్యారెక్టర్ చేసింది అభినయనే! తర్వాత ఇదే సినిమా కన్నడలో కూడా తీశారు.
మూగ, చెవిటి కద..మరి షూటింగ్ ఎలా? :
Advertisements
అభినయ చెప్పాల్సిన డైలాగ్ ను డైరెక్టర్ ముందుగా అభినయ తల్లిదండ్రులకు వినిపిస్తారు. వారు సైగల ద్వారా అభినయకు చూపిస్తారు. సింగిల్ టేక్ లో అభినయ తన డైలాగ్ కు తగ్గ ఎక్స్ ప్రెషన్ ను ఇస్తూ నటించేస్తుంది!
- నాదోదిగల్, “శంభో శివ శంభో చిత్రాలకు గాను…. అభినయకు రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులు లభించాయి.
- దమ్ము చిత్రంలో జూనియర్ ఎన్.టి.ఆర్ కు సోదరిగా నటించింది
- డమరుకంలో నాగార్జన చెల్లిగా
- సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకీకి చెల్లిగా నటించింది