Advertisement
ఇన్ కం ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయడానికైనా, పాన్ కార్డ్ పొందడానికైనా, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికైనా ఇలా ఏ పనికైనా ప్రస్తుతం కావలసింది “ఆధార్ కార్డ్”..ఆధార్ కార్డ్ కి మీ మొబైల్ లింక్ తప్పని సరి..అన్నింటికి ఆధారమైన ఆధార్ కార్డ్ ఎక్కడైనా పొరపాటున మిస్ చేసుకున్నారనుకోండి.. ఇకపై టెన్షన్ పడాల్సిన పనిలేదు.. మొబైల్ నంబర్ తో లింక్ అప్ అయి లేకున్నా నామినల్ ఫీజ్ ని ఛార్జ్ చేసి తిరిగి ఆధార్ కార్డ్ ని రీప్రింట్ పొందేలా UIDIA(యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా)మార్పులు చేసింది..దానికి మీరేం చేయాలో చూడండి.
రీ ప్రింట్ కోసం ఏం చేయాలి?
Advertisement
- UIDAI యొక్క అధికారిక వెబ్‌సైట్ gov.in లోకి వెళ్లి..’ఆర్డర్ ఆధార్ రీప్రింట్’ పై క్లిక్ చేయండి
- మీ ఆధార్ సంఖ్య (యుఐడి), నమోదు ఐడి (ఇఐడి) లేదా వర్చువల్ ఐడి (విఐడి) ని ఎంటర్ చేయండి.
- సెక్యురిటి కోడ్ ఎంటర్ చేసి , “MOBILE LUMBER IS NOT REGESTER” అనే ఆఫ్షన్ పై క్లిక్ చేయండి
- మీరు OTP ను స్వీకరించాలనుకుంటున్న మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి
- రిసీవ్ చేసుకున్న OTP ని ఎంటర్ చేసి. టి అండ్ సి చెక్‌బాక్స్‌ను తనిఖీ చేసి,SUBMIT పై క్లిక్ చేయండి.
- మేక్ పేమెంట్ పై క్లిక్ చేసి, ఆన్‌లైన్ చెల్లింపు మోడ్‌ను ఎంచుకుని పేమెంట్ చెల్లించండి.
- అప్పుడు మీరు అప్లై చేసినట్టుగా అక్నలెడ్జమెంట్ వస్తుంది..దానిపై 28అంకెలు గల SRNనంబర్ ఉంటుంది. ఆ రిసీప్ట్ ని డౌన్‌లోడ్ చేసి సేవ్ చేయండి
- ఈ ప్రాసెస్ అంతా అయ్యాక 15 రోజుల్లో స్పీడ్ పోస్ట్ ద్వారా ఆధార్ కార్డ్ మీకు పంపబడుతుంది.
Advertisements
మీ ఆధార్ రీ ప్రింట్ జరిగిందా..మీకు డిస్పాచ్ అయిందా తదితర వివరాల స్టాటస్ ని కూడా తెలుసుకోవచ్చు.దానికోసం ఏం చేయాలంటే…
Advertisements
- UIDAI యొక్క అధికారిక వెబ్‌సైట్ – gov.in కి వెళ్లి ‘MY ADHAR” పై క్లిక్ చేయండి
- డ్రాప్-డౌన్ మెను నుండి ‘చెక్ ఆధార్ రీప్రింట్ స్టేటస్’ పై క్లిక్ చేయండి
- మీ రసీదులో లేదా మీ మొబైల్‌లో మీరు అందుకున్న 28 అంకెల SRN కోడ్‌ను నమోదు చేయండి.
- 12 అంకెల ఆధార్ నంబర్ (యుఐడి) ను నమోదు చేయండి
- తర్వాత సెక్యురిటి కోడ్ ను ఎంటర్ చేసి, SUBMIT పై క్లిక్ చేయండి
- మీ ఆధార్ కార్డ్ స్టాటస్ ఏంటి అనేది తెలుస్తుంది.