Advertisement
మీరెప్పుడైనా మెడికల్ షాప్ కి వెళ్లారా?? వెళ్లే ఉంటారు.. నిన్న నేను కూడా మా ఇంటికి దగ్గరలోని మెడికల్ షాప్ కి వెళ్లాను.. నా చేతిలో ఉన్న ప్రిస్క్రిప్షన్ ఇచ్చి మందులు తీసుకున్నాను.. ప్రిస్క్రిఫ్షన్లో డాక్టర్ రైటింగ్ మెడికల్ షాప్ అతనికి ఎలా అర్దం అవుతుందా అనేది అందరిక ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది….కానీ నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే..మందులు పెట్టి ఇచ్చిన కవర్..
అది ఎలక్ట్రోలర్ రోల్.. ఓటర్ లిస్ట్ తో తయారు చేసిన పేపర్ కవర్..పేరు, ఊరు అడ్రస్ ఫోటో తో సహా ఎంతో మంది వివరాలు అందులో ఉన్నాయి..అలా అతను ఎంతమందికి ఇచ్చుంటాడు..ఆధార్ కార్డ్ అంత భద్రం కాకపోయినా ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లిస్ట్ అలా బహిరంగంగా ఉపయోగించడం ఎంత వరకు సబబు అనేది నాకు అర్దం కాలేదు..
Advertisement
సామాన్య ప్రజల పర్సనల్ విషయాలను పబ్లిక్ చేసే హక్కు ఎవరికి ఉంది?? ఇదే విషయం నా ఫ్రెండ్స్ తో చెప్తే హా చాల్లే మన డీటెయిల్స్ తో ఎవరేం చేసుకుంటారు అని అంటున్నారు..ఇది నా డీటెయిల్స్ తో ఎవరో ఏదో చేస్తారని కాదు..నేను గౌరవం గురించి మాట్లాడుతున్నాను.. నా పర్సనల్ విషయాలను ఫోటోతో సహా ఇంత ఘోరంగా వాడితే ఒక ఓటరుగా గౌరవం కోరుకోవడం నా తప్పా??
Advertisements
Advertisements
మన దేశంలో విద్యార్దుల పరీక్షా పేపర్లు పకోడి పొట్లాలుగా.. టెక్స్ట్ బుక్స్ పేపర్లలో సమోసాలు చుట్టిన దాఖలాలు కూడా నేను చూసాను… ప్రభుత్వ సంస్థల నిర్లక్ష్యానికి ఎన్ని ఉదాహరణలు చెప్పుకున్నా తక్కువే!