Advertisement
మన దేశంలోనే కాదు.. ఏ దేశంలో అయినా సరే.. రైతులు తమ పొంట పొలాలను వన్య ప్రాణుల నుంచి రక్షించుకునేందుకు అనేక మార్గాలను అనుసరిస్తుంటారు. కొందరు తమ పొలాలకు కంచెలు వేసుకుంటారు. కొందరు ఫెన్సింగ్ వేసి వాటికి విద్యుత్ పెడతారు. ఇక కొందరైతే వన్య ప్రాణులను పట్టుకుని క్రూరంగా హింసిస్తారు. అయితే ఆఫ్రికాలోని రైతులు మాత్రం ఇలాంటి దారుణమైన పనులు చేయడం లేదు. ఎందుకంటే వారు చాలా సులభంగా పంటలను కాపాడుకునేందుకు ఓ టెక్నిక్‌ను ఉపయోగిస్తున్నారు. అదేమిటంటే..
ఆఫ్రికాలో రైతులు ది ఎలిఫెంట్ అండ్ బీస్ అనే ప్రాజెక్టు కింద వినూత్న పద్ధతిలో తమ పంటలను ఏనుగుల నుంచి రక్షించుకుంటున్నారు. అందుకుగాను వారు ఎలాంటి హింసాత్మకమైన పద్ధతులను అనుసరించడం లేదు. చాలా సురక్షితమైన, మేలైన మార్గాన్ని వారు ఎంచుకుని అనుసరిస్తున్నారు. వారు తమ పొలాల చుట్టూ కర్రలను పాతి వాటి మధ్యలో చిన్నపాక లాంటిది వేసి దాని కింద బుట్టల్లాంటివి పెట్టి.. వాటిల్లో తేనెటీగలను పెంచుతున్నారు. అవును.. అయితే తేనెటీగలకు, ఏనుగులకు లింకేమిటి..? అంటారా..? అవునండీ.. సంబంధం ఉంది..
Advertisement
Advertisements
తేనెటీగలంటే ఏనుగులకు భయమట. అవి వెలువరించే గుయ్ మనే శబ్దాన్ని ఏనుగులు దూరం నుంచే విని తేనెటీగలు ఉన్న వైపుకు కాకుండా వాటికి వ్యతిరేక దిశలో వెళ్తాయట. ఈ విషయాన్ని సైంటిస్టులే చెప్పారు. అందుకనే ఏనుగులు తమ పంటలను నాశనం చేయకుండా ఉండేందుకు గాను ఆఫ్రికా రైతులు తమ పొలాల చుట్టూ తేనెటీగలను బుట్టల్లో పెంచుతున్నారు. ఇక దీని ద్వారా రెండు లాభాలు ఉన్నాయి. ఒకటి.. ఏనుగులు పంటలను నాశనం చేయవు. పంటల దగ్గరకు అస్సలే రావు. రెండు.. తేనెటీగల పెంపకం ద్వారా అదనపు ఆదాయం లభిస్తుంది. అవును.. ఇలా వారు రెండు విధాలుగా లాభం పొందుతున్నారు. అంతే కదా..! తెలివి ఉండాలేగానీ.. మనం ఏం చేసినా దాని ద్వారా డబుల్ ప్రాఫిట్ పొందడమంటే.. ఇదే.. ఏది ఏమైనా.. వారు అనుసరిస్తున్న ఈ విధానాన్ని మెచ్చుకోవచ్చు..!
Advertisements