Advertisement
భర్త కంటే భార్య చిన్నగా ఉండాలని అనుకుంటారు..భారత సంప్రదాయాల ప్రకారం కూడా వివాహం కుదుర్చుకునేటప్పుడు వయసుని చూసుకుంటారు..కానీ అందుకు భిన్నంగా భర్త కంటే భార్యల వయసు పెద్దగా ఉన్న వివాహాలు కూడా చేస్కుంటూ ఉంటారు… అలాాా పెళ్లి చేసుకున్న కొన్ని సెలబ్రిటి జంటలు.. వారి మధ్య వయసు భేధం ఎంతో చూడండి.
మహేశ్ బాబు- నమ్రత
వంశీ చిత్రం షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన ఈ జంట తర్వాత ఐదేళ్లకు పెళ్లి చేసుకున్నారు..మహేశ్ బాబు కంటే నమ్రత నాలుగేళ్లు పెద్ద.. మహేశ్ వయసు ప్రస్తుతం 44 ఏళ్లు కాగా..నమ్రత వయసు 48 ఏళ్లు.
ఐశ్వర్య రాయ్ – అభిశేక్ బచ్చన్
Advertisements
ప్రపంచసుందరి ఐశ్వర్యరాయ్, అభిశేక్ బచ్చన్ కంటే రెండేళ్లు పెద్ద..సల్మాన్ , వివేక్ ఓబెరాయ్ లతో లవ్ బ్రేకప్ తర్వాత అనూహ్యంగా అభిశేక్ పరిచయం..బచ్చన్ ఇంటి కోడలిగా ఐశ్వర్య స్థిరపడిపోవడం జరిగిపోయాయి.
ధనుష్ – ఐశ్వర్య
సూపర్ స్టార్ రజినికాంత్ కూతురు ఐశ్వర్య, తమిళ నటుడు ధనుష్ లది ప్రేమ వివాహం.. ధనుష్ కంటే ఐశ్వర్య రెండేళ్లు పెద్ద.
స్నేహ – ప్రసన్న
తెలుగు వారికి దగ్గరైన తమిళ నటి స్నేహ , సహనటుడు ప్రసన్నని వివాహం చేసుకుంది..ప్రసన్న కంటే స్నేహ ఒక ఏడాది పెద్ద.. వీరిద్దరిది ప్రేమ వివాహం.
యశ్- రాధికా పండిట్
KGF సినిమాతో పాన్ ఇండియా హీరోగా దేశమంతటా గుర్తింపు తెచ్చుకున్న నటుడు యశ్ భార్య పేరు రాధికా పండిట్.. యశ్ సీరియల్స్ లో నటిస్తున్నప్పుడే రాధిక పరిచయం.. రాధిక కూడా నటే. రాధిక కంటే యశ్ రెండేళ్లు చిన్నవాడు.
Advertisement
అనుష్క శర్మ- విరాట్ కొహ్లీ
బాలివుడ్ నటి అనుష్క శర్మ తన భర్త విరాట్ కొహ్లీ కంటే ఏడాది పెద్దది ప్రస్తుతం అనుష్క వయసు 32 ఏళ్లు కాగా, విరాట్ ఏజ్ 31.
బిపాసా బసు- కరణ్ సింగ్
టక్కరి దొంగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన డస్కీ బ్యూటి బిపాసా , కరన్ సింగ్ ని వివాహం చేసుకుంది..జాన్ అబ్రహంతో పీకల్లోతు ప్రేమ, డినోమోరియోతో డేటింగ్.. అప్పట్లో వార్తల్లో నిలిచిన ఈ భామ… హఠాత్తుగా కరణ్ ని వివాహం చేసుకుని అందరికి షాక్ ఇచ్చింది..కరణ్ కంటే బిపాసా మూడేళ్లు పెద్ద.
ప్రియాంక చోప్రా-నిక్ జోనస్
బాలివుడ్ నటి ప్రియాంక చోప్రా , నిక్ జోనస్ ల వివాహం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.. నిక్ కంటే ప్రియాంక పదేళ్లు పెద్దది..మూడేళ్ల ప్రేమాయణం తర్వాత వీరిద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు.
సచిన్ -అంజలి:
సచిన్ కంటే అంజలి 6 సంవత్సరాలు పెద్ద.! వీరిదీ లవ్ మ్యారేజ్ యే.! 1995 లో వీరి వివాహం జరిగింది. ఎయిర్ పోర్ట్ లో ఒకరినొకరు చూసుకొని …లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టు ప్రేమలో పడ్డారు. అంజలికి అప్పటి వరకు క్రికెట్ అంటే కూడా తెలియదట!
శిల్పాశెట్టి- రాజ్ కుంద్రా:
2009 వివాహం చేసుకున్న ఈ జంటలో…రాజ్ శిల్పా కంటే 3 నెలల చిన్న.! వీరిదీ లవ్ మ్యారేజ్ యే.!
Advertisements