Advertisement
సివిల్స్ అంటే మనది కాని జీవితంలో బతుకుతూ, బతుకంతా దానికే అంకితం చేస్తే తప్ప సాధ్యపడదని చాలామంది అభిప్రాయం..కానీ ఆడుతూ పాడుతూ ,మన లైఫ్ మనం బతుకుతూ కూడా సివిల్స్ సాధించొచ్చు అనడానికి తాజా ఉదాహరణ ఐశ్వర్య…మొన్నటి సివిల్స్ రిజల్ట్స్ లో 97 ర్యాంక్ సాధించిన ఐశ్వర్య షిరాయన్.. ఒకవైపు మోడలింగ్ ,మరోవైపు సివిల్స్ అనేది ఎలా సాధ్యమైంది?అసలు కోచింగే లేకుండా ఎలా సివిల్స్ సాధించగలిగింది??తన సక్సెస్ మంత్ర ఏంటి??? లాంటి ఆసక్తికర విషయాలు మీకోసం..
ఐశ్వర్యా షిరాయన్ జన్మస్థలం రాజస్తాన్..తండ్రి ఆర్మి ఆఫీసర్.. దాంతో అనేక రాష్ట్రాలు తిరగాల్సి వచ్చేది..ప్రస్తుతం తండ్రి కరీంనగర్ జోన్లో వర్క్ చేస్తుండగా..ఐశ్వర్య మాత్రం ఫ్యామిలితో ముంబాయ్ లో ఉంటుంది.. హైయర్ స్టడీస్ కోసం ఢిల్లి యూనివర్శిటి(DU)లో జాయిన్ అయింది.. తనని మిస్ ఇండియాగా చూడాలన్నిది ఐశ్వర్య తల్లి కోరిక..అందుకే ఐశ్వర్యరాయ్ పేరునే తన కూతురికి పెట్టుకుంది.
ఢిల్లి యూనివర్శిటిలో జాయిన్ అయిన తర్వాత ఒకవైపు స్టడీస్ మరోవైపు మోడలింగ్ లో అడుగుపెట్టింది ఐశ్వర్య.. తల్లి కోరిక తీర్చడం తన బాద్యత అనుకుంది.. కానీ తన అల్టిమేట్ గోల్ మాత్రం తండ్రి నుండి పునికి పుచ్చుకన్న దేశభక్తే..అందుకే మోడలింగ్ చేస్తున్నప్పటికి స్టడీస్ ని నెగ్లెక్ట్ చేయలేదు.. 2016 మిస్ ఇండియా పోటిల్లో ఫైనలిస్ట్ గా నిలిచింది..2017లో సివిల్స్ కి అప్లై చేసిన తర్వాత తన లైఫ్ స్టైల్ పూర్తిగా ఛేంజ్ చేసింది.
Advertisement
10+8+6 మెథడ్..
Advertisements
ఈ 10+8+6 మెథడ్ ఏంటా అనుకుంటున్నారా?? సివిల్స్ అప్లై చేయగానే తను ఫస్ట్ చేసిన పని సోషల్ మీడియాకు పూర్తిగా దూరం అయింది..ఎలాంటి విషయాలు కూడా తన మైండ్ ని డైవర్ట్ చేయకూడదని ఆ పని చేసింది.. వన్ ఇయర్ కి సరిపడా పక్కా ప్లాన్ వేసుకుంది.. అదే 10+8+6 మెథడ్.. రోజుకి పదిగంటలు చదవడం, ఎనిమిది గంటలు నిద్ర పోవడం..ఆరు గంటలు ఇతర యాక్టివిటీస్ కి కేటాయించడం..ఇదీ షెడ్యూల్..
ఈ షెడ్యూల్ ని ఏ రోజు కూడా మిస్ చేయలేదు.. ఉదయం పనులుంటే చదువుకి నైట్ కేటాయించడం.. ఉదయం నిద్రొస్తే నైట్ చదువుకోవడం.. ఇలా ఏది ఏ టైంలో మిస్ అయినా రోజులో మరో టైంలో ఎక్కడో కవర్ చేసేలా ఈ మూడింటిని ఫాలో అయ్యేదట..సోషల్ మీడియా లైఫ్ మిస్ అయింది తప్ప సోషల్ లైఫ్ కాదు..మనిషికి ఎనిమిది గంటలు నిద్ర అవసరం అనేది తూచా తప్పక పాటించింది.. కంటి నిండా నిద్ర ఉంటే.. ఆటోమేటిక్ గా మనసు,మెదడు ప్రశాంతంగా ఉంటాయి.. మిగతా పనులు సెట్ అయిపోతాయి.. అది ఐశ్వర్య సక్సెస్ మంత్ర..!
సివిల్స్ అంటే ఆషామాషి కాదు.. అదొక దీక్ష.. పట్టుదల,కృషి ఉంటేనే సాధించగలం.. సివిల్స్ సాధించాలంటే వ్యక్తిగత ఇష్టాలన్ని దూరం పెట్టాలి.. అసలు పూర్తిగా మనది కాని జీవితంలో బతకాలి.. అబ్బో..సివిల్స్ అంటే అది.. సివిల్స్ అంటే ఇది.. అని ఈ భయాలతోనే సగం మంది అమ్మో సివిల్స్ అంటే చాలా కష్టం అని దూరం పెట్టేస్తూ ఉంటారు.. కదా కాబట్టి ఎలాంటి భయం లేకుండా ఇలా పక్కా ప్లాన్ చేసుకుని చదువుకోండి..ఆల్ ది బెస్ట్..!
Advertisements