Advertisement
బిగ్‌బాస్ తెలుగు 4లో అఖిల్ సార్థక్ పార్టిసిపేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. షోలో అతను ఉత్సాహంగానే పాల్గొంటున్నాడు. అయితే అతని వదిన తాజాగా ఓ మీడియా చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ క్రమంలో ఆమె పలు ఆసక్తికర విషయాలను తెలిపింది. తాము బిగ్ బాస్ షో అసలు చూడనే చూడమని, కేవలం అఖిల్ కోసమే ఈ సీజన్ చూస్తున్నామని తెలిపింది. ఇక షోలో అఖిల్ తాను పాల్గొంటున్నట్లు తమకు చివరి నిమిషం వరకు చెప్పకుండా సర్‌ప్రైజ్ ఇచ్చాడని తెలియజేసింది.
అఖిల్ సార్థక్ ఎక్కువగా పిల్లలు, కుటుంబ సభ్యులతో సమయం గడుపుతాడని ఆమె తెలిపింది. ఇక షోలో మోనాల్‌తో అతను ఎక్కువ క్లోజ్‌గా ఉన్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదని, కేవలం షో కోసమే అలా చనువుగా ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారని పేర్కొంది. అంతకు మించి వారి మధ్య ఏమీ ఉండదని అభిప్రాయపడింది. అఖిల్‌కు ఫ్యాన్స్, ఫాలోవర్లు కూడా ఎక్కువగానే ఉన్నారని ఆమె తెలిపింది.
Advertisement
బిగ్‌బాస్ షోలో అఖిల్ చాలా బాగా ఆడుతున్నాడని ఆమె అన్నారు. టీవీలో అతను కనిపిస్తున్నా తమతోనే అతను ఉన్నట్లు ఫీలవుతున్నామని అన్నారు. బిగ్‌బాస్ షో ఆద్యంతం సస్పెన్స్‌గా సాగుతుందని, ఎవరితో ఎవరు ఎలా మాట్లాడుతారు, ఏం జరుగుతుంది ? అని తెలుసుకునేందుకు షోను ఆసక్తిగా చూస్తున్నామన్నారు. హౌస్‌లో ఉండేవారిపై రూమర్స్ రావడం సహజమేనని, తరువాత అవే కనుమరుగవుతాయని అన్నారు.
అఖిల్ ఎవరినైనా నమ్మి అటాచ్‌మెంట్ ఎక్కువైతే వారికి దగ్గరగా ఉంటాడని, అందుకనే మోనాల్‌తోనూ దగ్గరగా ఉంటున్నాడేమోనని అన్నారు. షోలో అతని ప్రదర్శన బాగుందని తమకు చాలా మంది చెబుతున్నారని అన్నారు. అఖిల్ షోలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని, అతను ఇలాగే కంటిన్యూ అవ్వాలని, అందరితోనూ ఫ్రీగా ఉంటే మరింత ముందుకు కొనసాగవచ్చని అన్నారు. అతను బిగ్‌బాస్ టైటిల్ గెలవాలని కోరుకుంటున్నానని ఆమె అతనికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
Watch Video:
Advertisements
Advertisements