Advertisement
తల్లి ఒడిలోని బాబు ముఖంలో దరహాసం…ఆ బాబును ఎత్తుకున్న తల్లి ముఖంలో బాధ మరియు భయం.! ఈ ఫోటో 2018 కేరళ వరదల సమయంలోనిది. మలయాళ మనోరమ అనే పత్రిక ఫోటోగ్రాఫర్ గోపన్ తీశాడు. ఎందరో హృదయాలను కదిలించిన ఫోటో ఇది. 2018లో కేరళలో కురిసిన భారీ వర్షాలకు ఆ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. దీంతో చాలా ప్రాంతాలు నీట మునిగాయి.
అఖిల అనే ఈ తల్లి ఉండే మలప్పురం కూడా వరదలతో మునిగిపోయింది. రెస్య్కూ టీమ్ లు మూడు విడతలుగా వీరిని రక్షించే ప్రయత్నం చేశాయి.. కానీ వరదల ఉదృతి కారణంగా ఏమీ చేయలేకపోయారు… ఎంతో కష్టపడి చివరకు వారి ఫ్యామిలీని 5 రోజుల తర్వాత సురక్షిత ప్రాంతానికి తరలించారు.
Advertisement
ఈ అయిదు రోజులు ఆ తల్లిదండ్రులు ఏమీ తినలేదు, కానీ ఆ తల్లి మూడు నెలల తన బాబుకు అయిదు రోజులగా తన పాలను తాపించి బతికించుకుంది. అందుకే తల్లిని మించిన యోధులెవ్వరూ లేరు ఈ గడ్డ మీద…అంతే కదా.!
ఆ ఫోటో తీసింది ఇతనే – పేరు:- గోపన్.:
Advertisements
Advertisements
2018 కేరళ వరదలు:
గత 100 ఏళ్లలో లేనంత వర్షం కేరళలో …2018 లో కురిసింది. ఈ వర్షాల వల్ల ఆ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. ఈ వరదల్లో 483 మంది చనిపోయారు 140 మంది గల్లంతయ్యారు…లక్షల మంది నిరాశ్రయులయ్యారు.