Advertisement
క్రీస్తు పూర్వం 331 లో… అలెగ్జాండర్ సైన్యం డేరియస్ 3 రాజుగా ఉన్న పర్షియన్ రాజ్యంపై దండెత్తింది. అపార సైన్యం ఉన్న డేరియస్ రాజును అలెగ్జాండర్ సైన్యం చాకచక్యంగా ఓడించింది. ఈ యుద్దమే అలెగ్జాండర్ లో స్పూర్తి నింపింది. అప్పటి నుండి వెనుకకు తిరిగి చూసుకోకుండా…..తన యుద్ద పరాక్రమను ప్రదర్శిస్తూ ప్రపంచ విజేతగా ఎదిగాడు.!
అయితే ఈ యుద్ద సమయంలో పర్షియన్లు యుద్దానికి వాడిన చిన్నపాటి వస్తువులు అలెగ్జాండర్ దృష్టిని ఆకర్షించాయి.! చూడడానికి చిన్నవే అయినా….యుద్దంలో అలెగ్జాండర్ సైన్యాన్ని అవి తెగ ఇబ్బంది పెట్టాయి.!
Advertisement
అవే…. నాలుగు దిశలు మొనతేలి ఉండే ఇనుప మేకులు… వీటిని కాల్ ట్రాప్ లు అంటారు. ఇవి ఎలా విసిరేసినా….ఒక కొన మాత్రం పైకి ఉంటుంది. యుద్ద సమయంలో వచ్చే సైనికులకు, గుర్రాలకు ఇవి గుచ్చుకోవడంతో…. వారి వేగం తగ్గుతుంది. గుర్రాలైతే ఆ నొప్పికి భరించలేక…. యుద్దరంగం నుండి దూరంగా పారిపోయేవి! దీంతో ప్రత్యర్థి సైన్యం సామర్థ్యం తగ్గేది.
ఆ యుద్దంలో….వీటిని గమనించిన అలెగ్జాండర్ తన సైన్యాల రూట్ మార్చి వెనుక నుండి దాడి చేయించాడు. ఆ యుద్దంలో గెలిచాక….వీటిని ప్రత్యేకంగా తయారు చేయించి…తను తర్వాత చేసిన ప్రతి యుద్దంలో వాడాడు.!
Advertisements
Advertisements