Advertisement
విక్టరీ వెంకటేష్… ఇంటి పేరు దగ్గుబాటి అయినా తన వరుస విజయాలతో విక్టరీ గా తన ఇంటి పేరు మార్చుకుని టాలీవుడ్ లో ఏ వివాదం లేకుండా ముందుకు వెళ్తున్నారు. యువ హీరోలతో పోటీ పడుతూ ఫ్యామిలీ హీరోగా మంచి సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. అతని కెరీర్ లో చాలా మంచి విజయాలు ఉన్నాయి. అందులో మనం ఒక 8 వండర్స్ చూద్దాం.
కలిసుందాం…రా ఉదయ్ శంకర్ దర్శకత్వంలో 2000 లో విడుదలైన కుటుంబ కథాచిత్రం. వెంకటేష్, సిమ్రాన్ జంటగా నటించిన ఈ సినిమా ఘనవిజయం సాధించటమే కాక ఉత్తమ తెలుగు చిత్రం గా భారత జాతీయ చలనచిత్ర పురస్కారాన్నిఅందుకొంది. రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లో వంద రోజులు ఆడింది. 74 కేంద్రాల్లో రిలీజ్ అయి 74 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది.
Advertisement
రెండో రికార్డ్ విషయానికి వస్తే 1997 వచ్చిన ప్రేమించుకుందాం రా సినిమా 50కి పైగా కేంద్రాల్లో వంద రోజులు ఆడింది. మూడో రికార్డ్ విషయానికి వస్తే 100 కు పైగా కేంద్రాల్లో 50 రోజులు ఆడిన తొలి సినిమా జయం మనదేరా… నాలుగో రికార్డ్ విషయానికి వస్తే 9 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన తొలి సినిమా చంటి. అయిదో రికార్డ్ చూస్తే… 25 కోట్ల గ్రాస్ సాధించిన తొలి తెలుగు చిత్రంగా కలిసుందాంరా నిలిచింది.
Advertisements
అలాగే… ఆరో రికార్డ్ చూస్తే 2000 వ సంవత్సరానికి ఆల్ టైం టాప్ 10 తెలుగు సినిమాలలో ఒక్క వెంకటేష్ వి 5 ఉన్నాయి. ఇది ఎప్పటికి ఒక రికార్డ్ గానే ఉంటుంది. కలిసుందాం రా, రాజా, జయం మనదేరా, సూర్యవంశం, ప్రేమించుకుందాం రా, ఇక ఏడో రికార్డ్ చూస్తే… ఎన్టీఆర్ హీరోగా వచ్చిన కొండవీటి సింహం మూవీ… 1981 లో విడుదలై 31 కేంద్రాల్లో వంద రోజులు ఆడితే ఆ రికార్డ్ ని 1992 లో వెంకటేష్ బ్రేక్ చేసారు. చంటి 33 కేంద్రాల్లో డైరెక్ట్ గా వంద రోజులు ఆడింది. ఎనిమిదో రికార్డ్ చూస్తే ఒకే ఏరియాలో ఒకే థియేటర్ లో 50 సినిమాలు విడుదలై 50 రోజులు ఆడాయి.
Advertisements