Advertisement
బన్నీ మొదటి సినిమా రిలీజ్ అయినప్పుడు అందరూ ట్రోల్ చేశారు , ఇతను హీరో ఏంటి? అన్నారు. నాన్న పెద్ద నిర్మాత మామయ్య స్టార్ హీరో కాబట్టి హీరో అయ్యాడు కానీ…. లేకపోతే స్క్రీన్ పై కనబడే ఫేస్ కాదిది అని ఎగతాళి చేశారు. కానీ అతను మాత్రం అవేవి పట్టించుకోలేదు… నటన మీద, డాన్స్ మీద, వర్క్ అవుట్స్ మీద దృష్టి పెట్టాడు…. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఇప్పుడు స్టార్ హీరోగా, స్టైలిష్ స్టార్ గా ఎదిగిపోయాడు. తెలుగులోనే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు.
2 సంవత్సరాల వయస్సులోనే వెండితెరపై కనిపించాడు:
1985 లో బన్నీకి 2 సంవత్సరా వయస్సున్నప్పుడు …చిరంజీవి విజేత సినిమాలో నటించాడు.! 10 సంవత్సరాల వయస్సునుండి చిరంజీవి పాటలు చూస్తూ అలాగే డాన్స్ ప్రాక్టీసు చేసేవాడు . డాన్స్ పై తనకున్న ఇష్టాన్ని గమనించిన తండ్రి అరవింద్ బన్నీకి డాన్స్ లో ట్రైనింగ్ ఇప్పించాడు.
Advertisements
మొదటిగా అవమానాలు:
గంగోత్రి సినిమాతో హీరో గా పరిచయమయ్యాడు… , సినిమా సూపర్ హిట్… 53 సెంటర్ లలో 100 రోజులు ఆడింది. కానీ బన్నీపై విపరీతమైన ట్రోల్స్! ఇవేవీ పట్టించుకోని బన్నీ మూడు నెలల కఠోరశ్రమ చేసాడు. ఎక్కడ లోపాలు ఉన్నాయో అన్ని సరిచేసుకున్నాడు. 3 నెలల ఆర్య లో డిఫరెంట్ లుక్ లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.! ఆ తర్వాత బన్ని, హ్యాపీ సినిమాల్లో మంచి డాన్సర్ గా గుర్తింపు పొందాడు .
సిక్స్ పాక్స్:
Advertisement
పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన దేశముదురు సినిమాలో ఫస్ట్ టైమ్ సిక్స్ ప్యాక్ లో కనిపించాడు బన్నీ.! ఆ సినిమా తర్వాత బన్నీకి యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరింగింది. తర్వాత పరుగు, వేదం సినిమాలతో నటుడిగా తనను తాను మెరుగుపర్చుకున్నాడు . ముఖ్యంగా ఒక స్టార్ గా ఎదుగుతున్న టైంలో వేదం లాంటి సినిమా చేయడంఒక సాహసం .
స్టార్ నుంచి సూపర్ స్టార్ గా:
నటుడిగా ఒకే మరి సూపర్ స్టార్ హోదా…? ఆ వెలితిని తీర్చాడు త్రివిక్రమ్….జులాయి సినిమా బన్ని కెరీర్లో …. ఫస్ట్ టైం 40 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది . జులాయి తర్వాత ఇద్దరమ్మాయిలతో సినిమా నిరాశ పర్చినప్పటికీ…. రేసుగుర్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. తర్వాత s/o సత్యమూర్తి , రుద్రమదేవి వరుసగా 50 కోట్ల సినిమాలు.
మాస్ హీరోగా నిలబెట్టిన సరైనోడు:
స్టార్ హీరోగా పేరు పడాలంటే మాస్ సినిమా పడాలి…కానీ బన్నీ ఖాతాలో ఆ రేంజ్ మూవీ లేదు. అప్పుడు బోయపాటి బన్నీకి సరైనోడు సినిమాతో మంచి బ్రేక్ ఇచ్చాడు. మొదట్లో నెగెటివ్ టాక్ వచ్చిన సినిమా తర్వాతర్వాత పుంజుకొని 75 కోట్ల షేర్ ను వసూలు చేసింది.
ప్రాణం పెట్టి చేసిన నాపేరు సూర్య నిరాశ పర్చినప్పటికీ ….. త్రివిక్రమ్ మ్యాజిక్, బన్నీ వన్ మ్యాన్ షో తో అల వైకుంఠపురం సినిమాతో నాన్ బాహుబలి రికార్డ్ ను క్రియేట్ చేశాడు బన్నీ.! ఇప్పుడు తాజాగా సుకుమార్ దర్శకత్వంలో ….. పుష్ప సినిమాలో లుంగీ కట్టుకొని ఒక లారీ డ్రైవర్ పాత్రలో కనిపించబోతున్నాడు బన్నీ!
Advertisements
ఫైనల్ గా ఓ మాట….. వంశం, కుటుంబం ఓ రూట్ ను చూపిస్తుందేమో కానీ అక్కడ సక్సెస్ అవ్వడం అనేది పూర్తిగా సదరు వ్యక్తిపైనే ఆధారపడి ఉంటుంది.